top of page

సాంపి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Sampi' New Telugu Story

Written By Mukkamala Janakiram

రచన: ముక్కామల జానకిరామ్





పున్ని, ఈరు సిన్నప్పటి నుంచి మంచి దోస్తులు. ఐదో తరగతి చదువుతుర్రు. పొద్దూకాల నుంచి సీకటయ్యే వరకు ఆడుకొని దూపైతే ఈరిగాడు పున్నిగాని ఇంటికి ఎల్లిండు. నీళ్ళు తాగనైతే తాగిండు గాని, ఆని సూపంతా పున్ని ఇంట్లో నేలపై ఏసిన బండల మీదనే ఉంది. పాల లెక్క తెల్లగా మెరుస్తున్నై బండలు.

ఆనుంచి ఇంటికొచ్చిన ఈరిగాడు "అమ్మా ! నేను పున్నిగాని ఇంటికి మంచిళ్ళు తాగితానికి ఎల్లిన. ఆలింట్ల లోపల తెల్లబండలున్నై. మరి మనింట్ల ఎందుకు లేవే?" అని ఈరి గాడు అడ్గిన దానికి ఏం సెప్పాలో అర్థంకాలే అమ్మ సలీలకు.

కాసేపు ఆలోశల్నవడ్డది అమ్మ. "అరేయ్ ఈరూ! పున్నిగాని అయ్య ఉజ్జోగం సేసి పైసల్ సంపాయించి ఆల్లు కొత్తిల్లు కట్టిర్రు. నీ అయ్య నేనూ పొద్ద త్తమానం పనిసేసినా మూడు పూటల తిండి లేదాయె!.


ఐనా ఆ బండలెందుకు బిడ్డా! మొన్న దేశం పోయిన పటేలమ్మ కాలుజారి పడితే, నడుములిర్గినై అంట. ఆరం కింద మీ దోస్తు గానింట్లెకు పామొచ్చె.

మన ఇంటిముందలా లోపలా ఆవుపేడతో సాంపి సల్లి అలికితే పురుగులు, పాములు, తేళ్లు రావు బిడ్డా!. బజాట్లె నుంచివొచ్చే దుమ్మూ ధూళి గూడ లోపలికి రాదురా.ఆవుపేడ ఆరోగ్యాన్ని పెంచడమే గాక ,ఆయుష్షుని పెంచుతదిరా. మనకు జారిపడ్తం అనే బుగులు లేదు" అని అమ్మ సెప్పంగనే "సాంపి ఇంత గొప్పదా"! అనుకొని కుషాలుగా ఆడుకుంటెందుకు బైటి కురికిండు ఈరిగాడు.


ముక్కామల జానకిరామ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం: ముక్కామల జానకిరామ్








1 commentaire


plavanyakumari15
08 oct. 2022

ఈనాటి వారికి మంచి సమాచారం అందిస్తూ చిన్న కథనైనా మాండలికంలో చక్కగా వ్రాసారండి. అభినందనలు.

J'aime
bottom of page