top of page
Original.png

సంసారంలో చిటపటలు

#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #SamsaramloChitapatalu , #సంసారంలోచిటపటలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Samsaramlo Chitapatalu - New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 02/08/2025

సంసారంలో చిటపటలు - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 


"అమ్మా, !" అంటూ వచ్చి తల్లిని వాటేసుకుని బోరు మంది శశి, 

.సూటు కేసు పక్కన పడేసింది. 


 టీవీ సీరియల్ చూస్తున్న సుశీల కాస్త కంగారు పడింది. 

 "ఏమైందమ్మా? ఏమిటి సంగతి, " అని అడిగింది. 


"అమ్మా, నేను ఇంక శేఖర్ తో కాపురం చేయలేను. 

నేను విడాకులు తీసుకుంటాను. వచ్చేస్తా మన ఇంటికి " అంటూ ఒకటే ఏడుపు, 


"అదేంటే, శేఖర్ తో చదువుకుని, నాలుగేళ్లు బాగా తిరిగావు. అతనినే చేసుకుంటానని పట్టుబట్టి చేసుకున్నావ్. ఇప్పుడు నచ్చలేదు అంటావేంటి, ?" సుశీల ఆశ్చర్యపోతూ.. 


"ఏంటమ్మా శేఖరు ఏమి వినడు. అన్నీ తన ఇష్టం మంటాడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు పెళ్లికి ముందు అంతా నీ ఇష్టం అంటూ బాగా ఉండేవాడు. ఇప్పుడో, నామీద ప్రేమ చూపిచ్చటం లేదు, మాల్ కి వెళ్దాం రా అంటే రాడు‌. నువ్వు వెళ్ళు నేను ఆఫీసులో చాలా అలసిపోయాను అంటాడు. ఇంటికి కావలసిన వస్తువులు కొనడం లో గొడవ పెడతాడు. తనకిష్టమైన వే కొనాలి. కర్టెన్ కొందామని వెళితే అక్కడ గొడవ. ఈ బ్లూ వద్దు. నాకు ఇష్టమైన గ్రీన్ కొన మంటాడు. 


ముందు అయితే హోటల్ కి వెళితే, నీకు ఏది ఇష్టమో చెప్పు అదే తిందామనే వాడు, ఇప్పుడు నాకు ఇష్టం అయిన ఐస్క్రీమ్ చెప్తే, నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు.

 

కొత్త లో వంట ఇంటిలో కి వచ్చి నాకు సాయం చేసేవాడు. ఇప్పుడు నువ్వే చేసుకో అంటాడు. ఇలా ఎన్నని చెప్పను ఏది వినడు. పెళ్లయిన తర్వాత బాగా మారిపోయాడు. నేను ఇంక శేఖర్ తో కాపురం చేయలేను అమ్మా, "అంటూ బోరు మంది శశి. 


సుశీల కూతురుని దగ్గర తీసుకుని చక్కగా సముదాయించింది. 


"ఇదిగో శశీ! ఆడపిల్లలు పెళ్లి కాని ముందు హాయిగా తిని తిరుగుతారు. పుట్టింట్లో ముద్దుగా తల్లిదండ్రుల దగ్గర పెరుగుతారు. పెళ్లయిన తర్వాత ఇప్పుడు నీకు ఇంటి బాధ్యతలు వస్తాయి. నీకు కావలసింది నువ్వు చేసుకుని అతని కావలసింది చేసి పెట్టాలి. రేపు పొద్దున్న పిల్లలు పుడితే వాళ్ళ అవసరాలు కూడా నువ్వు చక్కగా తీర్చాలి. ఇదీ కుటుంబ బాధ్యత. పెళ్లంటే స్త్రీగా అన్ని బాధ్యతలు నెరవేర్చాలి. జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి. అన్నిటికీ తట్టుకుని నిలబడాలి. ఏడాదయ్యింది, అప్పుడే విడాకులు ఇస్తానని అంటున్నావు. జీవితం ఒక బండి లాంటిది. రెండు చక్రాలు ఒక చక్రం తో సాగేది కాదు. 


వేదమంత్రాలతో పెద్దల ఆశీర్వచనాలతో వివాహం మూడు ముళ్ళ బంధం, తల్లిదండ్రుల దగ్గర ముచ్చటగా పెరిగిన ఆడపిల్లలు పెద్ద ఉమ్మడి కుటుంబాలు నిస్వార్ధంగా బాధ్యతలను స్వీకరించేవారు.


నాయనమ్మ అమ్మమ్మ జీవితాలు తెలుసు కదా.


భర్త చెప్పిన మాటపై నిలబడే వారు. పక్క ఫ్లాట్లో ఆంటీ భర్త తాగి స్నేహితులతో పేకాట ఆడి అర్ధరాత్రి రెండింటికి వస్తాడు. ఆమె పూజలూ పునస్కారాలు భర్తను వదిలేసిందా?

రెండవ అంతస్తు ఆంటీకి పక్షవాతం ఆవిడకి సేవ చేసి మరి ఆఫీసుకి వెళ్తాడు.

సునీత ఆంటీ భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది. సంసారం ఆమె నడుపుతుంది.

పెళ్లంటే విడదీయరాని బంధం, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు పెద్దలు.


చిన్న చిన్న విషయాలకు ఎప్పుడూ గొడవ పడకూడదు. అతనికి ఇష్టమైనవి చేస్తూ నీకు ఇష్టమైనది కూడా చేసుకోవాలి. కర్టెన్లు ఇద్దరుకి కావలసిన రంగులు కొనుక్కోవచ్చు. అతడికి వంకాయ కూర అయితే, నీకు బంగాళదుంప కూర, ఇష్టమైతే రెండు చేసుకోవచ్చు కదా. 


ఆఫీసులో అలిసిపోతే మగాళ్ళకు రెస్ట్ తీసుకుందాం అని పిస్తుంది. ఎక్కడ తిరుగుతాడు. 

అతడు కూడా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా. నువ్వు కూడా తక్కువేమీ కాదు చాలా తల తిక్కదానివి. అవన్నీ భరిస్తున్నాడు కదా పాపం, పెళ్ళంటే ఏమన్నా మజాక్ అనుకున్నావా, ఇష్టం లేదు వచ్చేస్తాను అనడానికి.. ఒకరి ఇష్టాయిష్టాలు రెండవవారు గౌరవించాలి. భార్య భర్తలలో అప్పుడే సంసారాలు ఆనందంగా ఉంటాయి” అంటూ సుశీల, శశికి నచ్చజెప్పినది. 


“సరేలే అమ్మ, నువ్వు ఎప్పుడు శేఖర్ పార్టీ” అంటూ పడకగదిలోకి వెళ్ళిపోయింది కోపంగా. 


ఇంతలో శేఖరు వచ్చాడు హడావుడి పడుతూ, “శశి ఇక్కడికి వచ్చిందా నాకు ఫోన్ కూడా చేయలేదు" అంటూ కంగారు పడ్డాడు.


 "ఏం లేదు శేఖర్. నీ మీద అలిగి వచ్చింది లే", అంటూ నవ్వింది సుశీల.


"శశీ, శేఖర్ వచ్చాడు రా. నీవు అలిగి వచ్చావు. నీ మీద ఎంత ప్రేమతో వచ్చాడో చూడు. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. సంసారంలో ఇటువంటి చిటపటలు ఉంటాయి. సరదాగా సాగిపోవాలి "


"శేఖర్! ఎలాగా వచ్చావు కదా! భోజనం చేసి వెళ్ళండి"


"అవును శేఖర్, ఇక్కడ భోజనం చేసి వెళ్దాము. సారీ నీతో చెప్పకుండా వచ్చాను" అంది శశి.


“సరే నీ ఇష్టం” అన్నాడు శేఖర్.

 

ఇద్దరూ భోజనం చేశారు, తండ్రి ప్రభాకర్ వచ్చాక. 

 

"అమ్మ, వెళ్తాను” అంటూ శేఖర్ తో వెళ్ళింది శశి. 


ఆమె మనసులోని మబ్బులు వీడాయి.


‘ఈ కాలం పిల్లల తీరు ఇంతే, మాట్లాడితే విడాకులు అంటారు. సంసారంలో అడ్జస్ట్మెంట్లు చేసుకోరు. విడాకులు తీసుకోగానే సరికాదు కదా, ఆ తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ఇప్పుడు యువతరాని కేమీ తెలియటం లేదు’ అని నవ్వుకున్నారు ప్రభాకర్, సుశీల. 

***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page