top of page
Original.png

సంక్రాంతి సందడి

Updated: Jan 21

#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #సంక్రాంతిసందడి, #SankranthiSandadi, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

Sankranthi Sandadi - New Telugu Poem Written By Bhallamudi Nagaraju

Published In manatelugukathalu.com On 14/01/2025

సంక్రాంతి సందడి - తెలుగు కవిత

రచన: భళ్లమూడి నాగరాజు


ముంగిట మంచి ముత్యాలు పోసినట్లు

ఇంటి గోడలపై రవివర్మ చిత్రాలు వేసినట్లు

అరుగుల పై కాన్వాస్ పరచినట్లు

రెండు వరుసల ఇళ్ల మధ్య రహదారి

రంగవల్లి అయినట్లు!


ఇంటి ముంగిట డూడూ బసవన్నలు

వీధి చివర భోగి మంటలు

ఊరు చివర కోడి పందాలు

అరుగులపై పేకాటలు

హరిలో రంగ హరి కీర్తనలు


అమ్మమ్మ చేసిన సున్నుండలు

అత్తమ్మ ఇచ్చిన ముగ్గుండలు

పిన్నమ్మ తెచ్చిన పాకుండలు

వదినమ్మ వండిన అరిసెలు


కొత్త బట్టల అందాలు

భోగి పళ్ళ సందళ్ళు

అలనాటి పాటలు

పేరంటాళ్ల ముచ్చట్లు


బావా మరదళ్ళ మురిపాలు

ఆత్మీయ పలకరింపులు

పసందైన విందులు

పంక్తి భోజనాలు

సంక్రాంతి సందళ్ళు

సంస్కృతికి దర్పణాలు .


..భళ్లమూడి నాగరాజు

రాయగడ.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page