సంక్రాంతి శుభాకాంక్షలు
- Ayyala Somayajula Subramanyam
- Jan 14
- 1 min read
Updated: Jan 21
AyyalaSomayajulaSubrahmanyam, #సంక్రాంతిశుభాకాంక్షలు, #SankranthiSubhakankshalu, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Sankranthi Subhakankshalu - New Telugu Poem Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 14/01/2025
సంక్రాంతి శుభాకాంక్షలు - తెలుగు కవిత
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
సంక్రాంతి క్రాంతి మంచుతెరల
చేమంతుల దోబూచులు,
బంతిపూల పూబంతుల విరబూతలు,
హేమంతం చేసినంత సీమంతం,
పుడమితల్లి కడుపుపంట లోగిళ్ళను చేసెనంట శ్రీమంతం
సిరిమంతం, సిరుల విరులతో
అలరాలే కాలం, ఆబాల
గోపాలం ఆలపించు భూపాలం,
శుభసంక్రాంతి శోభకిదే సంకేతం,
దినకర మకరసంక్రమణ సంరంభాని కిదే స్వాగతం
పాడిపంటల వేడిమంటల భోగిపండుగ, పిండివంటల
పొంగలి పొంగుల పెద్దపండుగ,
పశువుల మేనినునుపుల మా
కనుమ పండుగ-కలల పండుగ,
ఆ పర్వదిన మాధుర్యం-అపూర్వ
సంప్రదాయ సౌరభం,మూడు నాళ్ళు ముచ్చటగా సంక్రాంతి-
తెలుగునేల తియ్యదనాల స్రవంతి,
జాలువారాలి నిరంతరం-తరలి
రావాలి తరం తరం, తరం తరం-
నిరంతరం-నిరంతరం-నిరంతరం.
"మనందరికీ సుఖసంతోషాలను
ఇవ్వాలని కోరుకుంటూ సంక్రాంతి
లక్ష్మి మనందరి ఇంటా కొలువు
దీరాలని ఆకాంక్షిస్తూ-
సంక్రాంతి శుభాకాంక్షలతో
-----------------------------------------------
అయ్యలసోమయాజుల
సుబ్రహ్మణ్యము,
ఉదయసుందరి.
Comments