top of page

స‌రిహ‌ద్దు


'Sarihaddu' New Telugu Story

Written By Gannavarapu Narasimha Murthy

'స‌రిహ‌ద్దు' తెలుగు కథ

రచన: గన్నవరపు నరసింహ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

పాకిస్తాన్ మీద స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచీ ల‌డక్ రెజిమెంటు బ్రిగేడియ‌ర్ అమ‌ర్‌దీప్ సింగ్‌కు క్ష‌ణం తీరిక లేదు... మొత్తం బెటాలియ‌న్ని ఎల్వోసీ అంటే వాస్త‌వాధీన రేఖ ద‌గ్గ‌ర‌కు త‌రలించారు...


వారం రోజుల క్రితం దాకా పాకిస్థాన్ బంక‌ర్స్ గురించిన సమాచారం లేదు; కాని వారం క్రితం స‌రిహ‌ద్దు రేఖ ద‌గ్గ‌ర‌కు ప‌శువుల్ని మేప‌డానికి వెళ్ళిన ప‌శువుల కాప‌ర్ని పాకిస్తాన్ సైన్యం కాల్చి చంపిన సంఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో బీఎస్సెఫ్ అంటే స‌రిహ‌ద్దు భద్ర‌తా ద‌ళం ఎల‌ర్టైంది. స‌రిహ‌ద్దు వెంబ‌డి గ‌స్తీని పెంచింది.


ఆ స‌మ‌యంలో పాకిస్తాన్ సైన్యం మ‌న జ‌వాన్ల మీద కాల్పులు జ‌ర‌ప‌డంతో ఒక జ‌వాన్ మ‌ర‌ణించాడు... అప్పుడు సైన్యాన్ని అక్క‌డికి త‌ర‌లించారు. అప్పుడు స‌రిహ‌ద్దు దగ్గర పాకిస్తాన్ బంక‌ర్స్‌ని మ‌న సైన్యం గ‌మ‌నించింది... అలా రెండు రోజుల త‌రువాత కొన్ని దిగ్బ్రాంతిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి...


పాకిస్తాన్, స‌రిహ‌ద్దుకి రెండువైపులా బంకర్స్ ని ర‌హ‌స్యంగా నిర్మించిన‌ట్లు ఆ రెజిమెంటు బ్రిగేడియర్ అమ‌ర్‌దీప్ సింగ్ మిలట‌రీ ముఖ్య కార్యాల‌యానికి ఒక నివేదిక పంపాడు. వెంటనే ఏరియల్ సర్వే చేసి వివరాలు పంపమని ఆదేశాలు వచ్చాయి;


అప్పుడు సుఖోయ్ విమానాల ద్వారా స‌ర్వేచేసి ఆ నివేదిక‌లో అంశాలు నిజ‌మేన‌ని రూఢీ చేసుకున్న త‌రువాత ర‌క్ష‌ణ‌శాఖ ముఖ్య కార్యాల‌యానికి నివేదిక పంపాడు అమరదీప్ సింగ్ ; తక్షణం స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ మొద‌లు పెట్టి బంకర్స్‌ని నాశ‌నం చెయ్య‌మ‌ని రక్షణ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.

రెండు రోజుల త‌రువాత ఎయిర్ స్ట్రైక్స్ మొద‌ల‌య్యాయి. ఆ స్ట్రైక్స్‌లో ముందుగా స‌రిహ‌ద్దుకి ఇవ‌త‌ల మ‌న భూభాగంలో నిర్మించిన బంక‌ర్స్‌ని నాశ‌నం చెయ్యాల‌ని నిర్ణ‌యించి వాటి మీద జెట్ విమానాల ద్వారా బాంబుల‌తో విరుచుకు పడింది మన సైన్యం. అర్ధ‌రాత్రి రెండు గంట‌ల‌కు మొద‌లైన విమాన దాడులు తెల్ల‌వారి 5 గంట‌ల దాకా కొన‌సాగాయి. అప్పుడు మ‌న భూభాగంలో సుమారు 20 బంకర్స్ నాశ‌నం అయ్యాయి. ఉద‌యం 6 నుంచి బోఫోర్స్ తుపాకుల‌తో మ‌ళ్ళీ వాటి మీద దాడులు చేసారు. బ‌య‌ట‌కు వస్తున్న స‌మ‌యంలో తుపాకీ దాడులు మొద‌ల‌వ‌డంతో చాలామంది పాకిస్తాన్ సైనికులు చ‌నిపోయారు.


కానీ రెండ‌వ రోజునాడు పాక్ భూభాగంలోని బంక్స‌ర్ మీద దాడి కావ‌డంతో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సి వ‌చ్చింది. ఆ బంక‌ర్స్‌ని నాశ‌నం చెయ్యాలంటే మ‌న జెట్ ఫైట‌ర్ విమానాలు పాక్ భూభాగంలోకి వెళ్ళాలి. అది అంత‌ర్జాతీయ ఒప్పందానికి విరుద్ధం.


అందుకే ఇత‌ర దేశంలోని భూభాగంలోకి వెళ్ళి దాడి చెయ్యాలంటే ర‌హ‌స్యంగా చెయ్యాలి. అటువంటి ర‌హ‌స్య మెరుపు దాడుల‌ను స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ అంటారు...

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చెయ్యాలంటే కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. అందుకే అమ‌ర్‌దీప్ సింగ్ ర‌క్ష‌ణ శాఖ‌కి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ యొక్క అవ‌స‌రాన్ని వివ‌రిస్తూ ఒక నోటు పంపి అందులో త‌గు సూచ‌న‌లు ఇమ్మ‌నీ కోరాడు.


కానీ ర‌క్ష‌ణ‌శాఖ నుంచి రెండు రోజుల వ‌ర‌కు ఏవిధ‌మైన ఆదేశాలు రాలేదు. కానీ మూడోరోజు రాత్రి 7 గంట‌ల‌కు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఆరాత్రే మొద‌లు పెట్ట‌మ‌నీ అక్కడినుంచి ఆదేశాలు వ‌చ్చాయి...ఆ రాత్రే దాడులంటే అమ‌ర్‌దీప్ సింగ్ గాబ‌రా ప‌డ్డాడు. ఐదు గంట‌ల వ్య‌వ‌ధిలో దాడులు చెయ్యాలంటే ఎంతో ప్లానింగ్ అవ‌స‌రం... వెంట‌నే అత‌ను రంగంలోకి దిగి సుఖోయ్ విమానాల‌ను తెప్పించి రాత్రి 2 గంట‌ల‌కు దాడులు మొద‌లు పెట్టించాడు.


అలా తెల్ల‌వారే వ‌ర‌కు పాకిస్తాన్దా భూభాగం లో దాడులు చేసి చాలా బంక‌ర్స్‌ని నాశ‌నం చేసారు... ఉద‌యం బోఫోర్స్ తుపాకుల‌తో మ‌ళ్ళీ అవే బంక‌ర్స్ మీద కాల్పులు మొద‌లు పెట్టారు...

అలా రెండు రోజుల్లో స‌రిహ‌ద్దుకి రెండు వైపులా పాకిస్తాన్ నిర్మించిన బంకర్సు అన్నింటినీ నాశ‌నం చేసారు. ఆ త‌రువాత మ‌ళ్ళీ అక్కడ బంక‌ర్స్‌ని నిర్మించ‌కుండా స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం యొక్క గస్తీని పెంచారు... సుమారు ఐదువంద‌ల మంది జ‌వాన్ల‌ను స‌రిహ‌ద్దు రేఖ వెంబ‌డి మోహ‌రించారు...

ఆమ‌ర్నాడు అమరదీప్ సింగ్ శ‌ల‌వు మీద త‌న స్వంత ఊరు పంజాబ్ వెళ్ళి వారం త‌రువాత వ‌చ్చాడు.


ఆరోజు అత‌ను ఆఫీసుకి వ‌చ్చి జీపులో స‌రిహ‌ద్దు ప్రాంతానికి ఇన‌స్పెక్ష‌న్ కోసం వెళ్ళాడు. అక్క‌డికి చేరుకునే స‌రికి అత‌ని కోసం న‌లుగురు లెఫ్టినెంట్లు ఎదురు చూస్తూ క‌నిపించారు. ఆ న‌లుగురితో క‌లిసి మొత్తం స‌రిహ‌ద్దు అంతా తిరిగి అక్క‌డ బీయ‌స్‌య‌ఫ్ జ‌వాన్ల‌తో మాట్లాడేడు... ఒక‌సారి దాడులు ప్రారంభమ‌య్యాయంటే ఆ ప్రాంతం అంతా మిల‌ట‌రీ ఆధీనంలోకి వ‌స్తుంది. అవి పూర్తైన తరువాత తిరిగి స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా దళానికి అప్పచెప్పాలి; ప్ర‌స్తుతానికి అదింకా ర‌క్ష‌ణ శాఖ ఆధీనంలోనే ఉంది. అమ‌ర్ దీప్ ఈరోజు ఇన‌స్పెక్ష‌న్ చేస్తున్న‌ది అందుకే...


ఇంక స‌రిహ‌ద్దులో ఏ స‌మ‌స్య‌లూ లేకుండా ఉంటే స‌రిహ‌ద్దు ప్రాంతాన్ని తిరిగి బియ‌స్‌య‌ఫ్‌కి అప్ప‌గించెయ్యాలి... ఆ నిర్ణ‌యం కోస‌మే ఆరోజు అత‌ను ఆ ప్రాంతాన్ని లెఫ్టినెంట్ల‌తో ప‌రిశీలించాడు.

ఆ ప‌రిశీల‌న‌లో అత‌నికి ఏ స‌మ‌స్య‌లూ క‌నిపించ‌లేదు. ఆమ‌ర్నాటి నుంచి బియ‌స్ఎఫ్‌కి స‌రిహ‌ద్దుని అప్ప‌గించ‌వ‌చ్చ‌నీ తెలిపే నోట్‌ని అక్క‌డే త‌యారు చేసి హెడ్‌క్వార్ట‌ర్స్‌కి మెయిల్ చేసాడు.

ఆ త‌రువాత అక్క‌డ గెస్ట్‌హౌస్‌లో లంచ్ చేసారు. అత‌ను లంచ్ పూర్తిచేసి బ‌య‌ట‌కొచ్చేస‌రికి అత‌ని కోసం న‌లుగురు జ‌వాన్లు బ‌య‌ట నిల‌బ‌డి ఎదురు చూస్తూ క‌నిపించారు.


"క్యా భాయ్‌! ఏమిటి విష‌యం" అనీ వాళ్ళ‌ని అడిగాడు అమ‌ర్‌దీప్ సింగ్‌.

"సార్‌! ఈరోజు మేము స‌రిహ‌ద్దులో తిరుగుతుంటే ఇద్ద‌రు పాకిస్తాన్ సైనికులు మ‌న భూభాగంలో క‌నిపించారు. వెంట‌నే వాళ్ళిద్ద‌ర్ని మేము ప‌ట్టుకొని బంధించాము. ఆ విష‌యం లెఫ్టినెంట్‌కి చెబితే మీతో చెప్ప‌మ‌నీ చెప్పారు" అని ఆ న‌లుగురులో ఒక‌త‌ను చెప్పాడు.

ఇంత‌లో ఆ న‌లుగురిలో ఇద్ద‌రు బ‌య‌ట‌కు వెళ్ళి అక్క‌డ లాక‌ప్పులో ఉన్న ఇద్ద‌రు పాకిస్తాన్ సైనికుల‌ను తీసుకు వ‌చ్చి అత‌నికి చూపించారు.

వాళ్ళిద్ద‌ర్నీ అత‌ను చూసి ``ఎందుకు వాళ్ళిద్ద‌రూ మ‌న భూభాగంలోకి వ‌చ్చారో క‌నుక్కొన్నారా?`` అనీ అడిగాడు.

"వాళ్ళు నిజం చెప్ప‌టం లేదు... నిన్న బంక‌ర్స్ మీద కాల్పులు జ‌రుపుతుంటే ప్రాణ‌భ‌యంతో మ‌న స‌రిహ‌ద్దులోకి వ‌చ్చ‌మ‌నీ చెబుతునారు. కానీ వాళ్ళు నిజం చెప్ప‌టం లేద‌నిపిస్తోంది" అన్నాడు ఆ జ‌వాన్‌...

వెంట‌నే అమ‌ర్‌దీప్ ఆ ఇద్ద‌రివైపు తిరిగి "క్యాభాయ్‌! ఎందుకు మీరు మా స‌రిహ‌ద్దులోకి వ‌చ్చారు?" అనీ ఉర్దూలో అడిగాడు.

"స‌ర్‌! నిన్న మేము బంకర్స్‌లో ఉన్న‌ప్పుడు బాంబుల వ‌ర్షం కురిసింది. వెంట‌నే భ‌యంతో బ‌య‌ట‌కు వ‌చ్చాము. మేము మా స‌రిహ‌ద్దులో ఉంటే మ‌మ్మ‌ల్ని కాల్చెస్తారన్న భ‌యంతో భార‌త స‌రిహ‌ద్దులోకి వ‌చ్చేసాము... మా ప్రాణాల‌ను కాపాడుకోవ‌డానికే వ‌చ్చాము త‌ప్పా మీ దేశానికి న‌ష్టం చేద్దామ‌ని కాదు" అన్నాడు ఆ జ‌వాను దండం పెడుతూ... అమ‌ర్‌దీప్ సింగ్ అత‌ని మాట‌లు విని కాసేపు మౌనం దాల్చేడు.


వెంట‌నే అక్క‌డున్న జ‌వాన్‌తో "అరే భాయ్‌! వాళ్ళు చెబుతోంది నిజ‌మే... ప్రాణభ‌యంతోనే ఇటువైపు వ‌చ్చారు. వీళ్ళు పాకిస్తాన్ ప్ర‌భుత్వం చేత నియ‌మించ‌బ‌డ్డ సైనికులు; ఆ ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ ఆఫీస‌ర్లు ఏంచెబితే అది చెయ్యాలి వాళ్ళు. అది వాళ్ళ ఉద్యోగ ధ‌ర్మం. మ‌న ప్ర‌భుత్వం పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లోకి చొర‌బ‌డి బంక‌ర్స్‌ని నాశ‌నం చెయ్య‌మ‌ని మ‌న‌కి ఆదేశాలిచ్చింది కాబ‌ట్టి అది త‌ప్పైనా మ‌నం రాత్రిపూట ర‌హ‌స్యంగా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసాము. అది మ‌న ఉద్యోగ ధ‌ర్మం. అంతే త‌ప్ప మ‌న‌కి వాళ్ళేమీ శ‌త్రువులు కారు ; పాక్ ఆర్మీలో ఉద్యోగం చేస్తునారు కాబ‌ట్టి మ‌న‌మీద దాడులు చేస్తునారు. అంతే త‌ప్ప మ‌నం వ్యక్తిగతంగా వాళ్ళ‌కు శత్రువులం కాము... వాళ్ళ‌ని ఇప్పుడు బంధిస్తే కొన్ని సంవ‌త్స‌రాల పాటు మ‌న జైళ్ళ‌లో వాళ్ళ కుటుంబాల‌కు దూరంగా మ‌గ్గిపోవ‌ల‌సి ఉంటుంది. అందువ‌ల్ల ఆ కుటుంబాలు ఎంతో న‌ర‌కం అనుభ‌విస్తాయి.

కాబ‌ట్టి దీన్నో ఇస్స్యూ చెయ్య‌కుండా వాళ్ళిద్ద‌ర్నీ పాకిస్తాన్ భూభాగంలో వ‌దిలేయండి" అని చెప్పాడు అమ‌ర‌దీప్ సింగ్‌...

అత‌ని మాట‌ల‌కు న‌లుగురు జ‌వాన్లు ఆశ్చ‌ర్య‌పోయారు.

ఇంత‌లో పాకిస్తాన్ సైనికులిద్ద‌రూ అమ‌ర్‌దీప్ సింగ్ కాళ్ళ‌మీద ప‌డి దండం పెట్టి "అల్లా మీ రూపంలో మ‌మ్మ‌ల్ని కాపాడాడు" అంటూ చెమ‌ర్చిన క‌ళ్ళ‌ను తుడుచుకున్నారు.

ఆ త‌రువాత ఆ న‌లుగురు జ‌వాన్లు పాకిస్తాన్ సైనికులిద్ద‌ర్నీ జీపులో తీసికెళ్ళి స‌రిహ‌ద్దుని దాటించి వ‌చ్చేసారు…

ఈ కథలో పాత్రలు, సన్నివేశాలు కేవలం సందర్భానుసారంగా వాడుకోబడ్డాయి.

ఇందులో వ్యక్తపరచిన అభిప్రాయాలు కేవలం కథలోని పాత్రలకు సంబంధించినవి మాత్రమే...

(స‌మాప్తం)

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


62 views0 comments
bottom of page