top of page
Original.png

తెలుగు వారము మనమండి

   

Telugu Varamu manamandi - Telugu Poems | Chavali Seshadri Somayajulu

తెలుగు వారము మనమండి -  బాల గేయాలు | చావలి శేషాద్రి సోమయాజులు 

Published In manatelugukathalu.com On 14/04/2026


మన తెలుగు సంస్కృతిలోప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది.

ఆ తిథులను పిల్లలకు సులభంగాగుర్తుండేలా, విలువలతో కలిపిఈ అందమైన పద్యం రూపొందించబడింది.


పాడ్యమి ఒకటి పదరా ముందుకు 

విదియ‌ రెండు విద్య నేర్చుకో

తదియ‌ మూడూ తప్పుచేయకు‌

చవితి‌ నాలుగూ‌ చదువుమంచిగా‌

పంచమి‌ ఐదూ‌ పంచు‌ర మంచి

షష్టి ఆరు సత్యము‌ పలుకు‌

సప్తమి‌ ఏడు‌ సహనము‌ చూపు

అష్టమి‌ ఎనిమిది అబద్ధమాడకు

నవమి‌ తొమ్మిది నవ్వు హాయిగా‌

దశమి‌ పది‌  దండము రైతుకు 

ఏకాదశి‌ పదకొండు ఎపుడూ‌  మంచిగ నువ్వుండు

ద్వాదశి‌ పన్నెండు‌  దానం ధర్మం తెలిసుండు

త్రయోదశి పదమూడు తల్లిదండ్రులను‌ గొప్పగ చూడు

చతుర్దశి పద్నాలుగు చక్కగ అందరితో మెలుగు


శుక్లపక్షమున‌ పౌర్ణమి రా

పండు‌ వెన్నెలను‌ పంచునురా


కృష్ణ పక్షమున అమావాస్య రా

చుట్టూ చీకటి కమ్మునురా‌

తెలుగు వారము మనమండి 

తెలుగు తిథులను మరువద్దండి

------------------------------------------

చావలి శేషాద్రి సోమయాజులు, లెక్చరర్, జిల్లా విద్యా శిక్షణ సంస్థ, విజయనగరం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page