top of page

శ్రీనాథుడు 'Srinathudu' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 15/05/2024

(కవులను గూర్చిన కథలు - పార్ట్ 4)

'శ్రీనాథుడు' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్తెలుగు కవులలో మహా భోగాలు అనుభవించినవాడు, అనేకమంది రాజులచేత సన్మానింపబడి, విశేష గౌరవమర్యాదలు పొందినవాడు శ్రీనాథుడు. ఈయన ఆశుకవిత్వంలో మేటి. ఈయన చాటువులు ఆంధ్రదేశంలో విననివారు వుండరు. 


ఒకప్పుడు పండిత కవి అయిన సర్వజ్జ సింగభూపాలుని ఆస్థానానికి వెళ్ళి, సాహిత్య వివాదానికి తలపడే ముందు, అక్కడ వున్న శారదా విగ్రహానికి నమస్కరించి శ్రీనాథుడు:


 " ఎటుల మెప్పించెదో నన్ను నింకమీద 

 రావు సింగ మాహీపాలు ధీవిశాలు 

 నిండు కొలువున నెలకొని యుండివీవు 

 సకల సద్గుణ నీకురంబ శారాదాoబ "


అని ప్రార్దన చేశాడుట. ఆ యాస్థానంలోని ఒక కవి, ద్వేషంతో "కుక్కవో, నక్కవో, ఫణివో, కోతివో, పిల్లివో, భూతపిల్లివో”, అని సమస్య యియ్యగా 


శ్రీనాథుడు "తక్కక రావుసింగ వసుధవరుడ అర్థుల కర్ధ మిచ్చుచో 

దిక్కులలేని కర్ణుని, దధీచిని, ఖేచరు, వేల్పుమ్రాను బెం పెక్కిన కామధేనువు శిబీoధ్రుని నెన్నెదు భట్ట దిట్టవై 

కుక్కవో, నక్కవో, ఫణివో, క్రోతివో, పిల్లివో, భూతపిల్లివో "


అని పూరించి నోరు మూయించాడు. 


ఆ సభలోనే సింగభూపాలుని 


"సర్వజ్ఞ నామధేయము

 శర్వునికే రావు సింగ జనపాలునికే 

 యుర్విo జెల్లున్, దక్కోరు 

 సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే"


అని పొగిడి, సంతోషపెట్టి, అయనచే విశేషంగా బహుమానాలు పొందాడు. 


శ్రీనాథుడు గొప్ప దేశభక్తుడు. ఒకసారి కర్ణాటక ప్రభువు ఆస్థానానికి వెడితే ఆ ప్రభువు యితడ్ని తెలియక ‘మీదే దేశం’ అని నిర్లక్ష్యంగా ఆడిగాడు. 


 "పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల 

 గోనకొని విడనాడు కొండవీడు

 పరిపoధిరాజస్య బలముల బంధించు 

 కొమరు మించినబోడు కొండవీడు

 ముగ్గురు రాజులకును మొహంబు పుట్టించు

 గురుతైన యురిత్రాడు కొండవీడు

 చటుల విక్రమకళాసాహసం భోనరించు 

 కుటిలాత్ములకు కాడు, కొండవీడు "


అని రొమ్ము విరుచుకుని సగరవ్వంగా జవాబు యిచ్చాడు. ఆ ప్రభువు ఇతడు శ్రీనాధుడని గ్రహించి మర్యాద చేసాడు. 


శ్రీనాథుడు పల్నాటి సీమ సంచారం లో నానా బాధలు పడ్డాడు. ఆయన పల్నాడు గురించి చెప్పిన చాటువులు ప్రసిద్ధి కెక్కాయి. 


 "రసికుడు పోవడు పల్నా

 డెసగంగా రంభయినా నేకులె వడకున్ 

 వసుధేశుడైన దున్నును 

 కుసుమాస్తుoడైన జొన్నకూడే కుడుచున్. "


తాత్పర్యం.. పల్నాడు లో రంభ అయినా ఏకులు వడకవలసిందే, రాజైనా భూమి దున్నాలిసిందే, మన్మధుడు అయినా జొన్నన్నం తినవలసిందే. ఒకసారి, ఆయన వేసవికాలంలో, పల్నాడు లో కాలినడకన ప్రయాణం చేస్తున్నాడు. దాహం వేసింది. కనుచూపుమేర ఎక్కడా నీళ్ల జాడ లేదు. 

గొంతుకు ఆరిపోతోంది. కాళ్ళు దడదడలాడిపోతున్నాయి. ప్రాణం విసిగి  "సిరిగలవానికి చెల్లును 

 దరుణుల పదియారువేల దగ పెండ్లాడన్ 

 తిరుపెమున కిద్దరాండ్రా 

 పరమేశా గంగవిడువు పార్వతిచాలున్. "


తాత్పర్యం.. బాగా ధనవంతుడు కాబట్టి విష్ణుమూర్తి పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, ముష్టి ఎత్తుకునేవాడివి నీకెందుకయ్యా ఇద్దరు భార్యలు? ఓ శివుడా పార్వతి చాలు గంగను విడిచిపెట్టు. 


అని అశువుగా పద్యం చెప్పాడు. వెంటనే భూమి పగిలి పాతాళ గంగ పైకి చిమ్మింది. ఆయన దోసిటి నిండా నీళ్లు తీసుకుని పదే పదే తృప్తిగా తాగి ముందుకు సాగాడు. మహాకవి వాక్సుద్ధి అటువంటిది. 


శ్రీనాథుడు చివరి రోజులలో చాలా బాధలు అనుభవించాడు. ఆయనని పోషించిన రాజులు ఒక్కరొక్కరే గతించారు. దేశం ముక్కలై, మూర్ఖులైన చిన్న చిన్న సామంతుల పాలబడింది. వాళ్ళు ప్రజల్ని హింసించి పన్నులు వసూలు చేస్తూ తమలో తాము కలహించుకుంటో వుండేవారు. ఆఖరికి శ్రీనాథుడు కూడా కృష్ణానది ఒడ్డున కొంత భూమి కౌలుకి తీసుకున్నాడు. 


వరద వచ్చి పంట నష్టమైంది. రాజు పన్ను కట్టమని నానాహింసలు పెట్టాడు. ఒకప్పుడు అష్ట ఐశ్వర్యం అనుభవించిన శ్రీనాథుడు, రాజు విధించిన శిక్షగా, మండు టెండలో నిలబడి "కవిరాజు కంఠంబు కౌగలిన్చెన్ కదా 

పురవవీధి నెదురెండ పొగడదండ "

అని వాపోయాడు. ఆయినప్పటికి, చనిపోయేటప్పుడు కూడా ధైర్యం విడక 


 "దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ

 అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి "

అంటూ కన్నులుమూసాడు.


నాల్గవ భాగం సమాప్తం

త్వరలో ఆయిదో భాగం లో మరికొంతమంది కవుల గురించి. 


ఆధారం మా తండ్రిగారు కీర్తిశేషులు జీడిగుంట రాఘవేంద్ర రావు గారి రచన

  • శ్రీనివాసరావు జీడిగుంట


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


25 views0 comments

Comments


bottom of page