తానో వరమిస్తానంది
- Malla Karunya Kumar

- Jun 14, 2025
- 2 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #తానోవరమిస్తానంది, #TanoVaramisthanandi, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Tano Varamisthanandi - New Telugu Poetry Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 14/06/2025
తానో వరమిస్తానంది - తెలుగు కవిత
రచన: మళ్ళ కారుణ్య కుమార్
తానెవరో తెలియదు కానీ తానో వరమిస్తానంది
మళ్ళీ బాల్యంలోకి, పాఠశాల రోజుల్లోకి తీసుకుపొమ్మని
అడిగాను! మళ్ళీ స్నేహితులతో ముచ్చట్లు, బడి బెంచీ
మీద పెన్నుతో చెక్కిన పేర్లు నెమరువేసుకుంటూ
మళ్ళీ విద్యార్ధి అయిపోతానని తెగ ఆనంద పడ్డాను.
ఒక్కసారిగా నవ్వింది! ప్రశ్నార్థకంగా చూసాను!
నువ్వు ఇంకా విద్యార్దివే అంది! అర్దం కాక
బిక్క ముఖం వేసుకొని చూస్తున్నాను!
నేను విద్యార్ధిని ఏమిటని కొట్టి పారేసాను
సత్యం చెప్పినా అర్థం చేసుకొని నా వైనాన్ని చూసి ఫక్కున
నవ్వింది! బ్రతుకే ఓ పాఠశాల ఎదురయ్యే ప్రతి సవాలు ఓప్రశ్న!
పడిలేచిన ప్రతిసారి ఓ పాఠం నేర్చుకుంటూనే వున్నావు కానీ
నీతి తెలుసుకోక తడబడుతూ తప్పటడుగు లేస్తున్నావు!
మేలుకో ఓ శిష్య అని ఎదురుదెబ్బలు తాకిడి గుణపాఠాన్ని
మళ్ళీ వల్లే వేయించింది!. జాగ్రత్త ఓ నరోత్తమా పాఠం మరిచిపోతే
బతుకు పోరాటం సలపలేవని జీవిత సత్యం బోధించింది!
నువ్వెవరు అని అడిగాను సందిగ్ధంతో!
నువ్వు నిత్యం పోటీ పడే నీ ప్రత్యర్ధిని అంది!
నన్ను పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించలేవు
నిత్యం నిన్ను చూస్తూ బ్రతుకు పాఠం నేర్పే
నీ గురువును అంటూ, నేనే కాలాన్ని అని సెలవిచ్చింది!.
సమాప్తం..
******
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.




Comments