ఈ వయస్సులో కూడానా???
- Dr. Brinda M. N.
- Jun 14
- 3 min read
#YeeVayassuluKudana, #ఈవయస్సులోకూడానా, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Yee Vayassulo Kudana - New Telugu Story Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 14/06/2025
ఈ వయస్సులో కూడానా - తెలుగు కథ
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
వెన్నెల పేరుకు తగ్గట్టుగానే అందమైన ఆడపిల్ల. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఐదవ తరగతి వరకే చదివించారు. ఇంటి, వంట, పొలం పనుల్లో, అల్లికలో అందెవేసిన చేయి వెన్నెలది. అత్తారింట ఆనందంగా ఉంటాననుకున్న వెన్నెలకు చుక్కెదురయింది.
" ఏంటే! ఏమి కూర ఇది బెండకాయ ఇలా తగలడిందేమిటీ?” మొహం మీదికి విసిరాడు వరుణ్.
త్రాగి కొట్టేవాడు. తెల్లారే పొలం పనికి పోయి సాయంత్రం వచ్చేది. రోజూ వారి వేతనం ఐదు వందలు, పోగు చేసి పిల్లల చదువులకు, తిండికి ఖర్చు పెట్టేది.
" ఎన్నెలా, యే, ఎన్నెలా నీ దగ్గర చాలా డబ్బు ఉందే, ఇటువ్వు" అని తాగిన మైకంలో డబ్బు లాగేసుకుని ఇష్టానుసారంగా కొట్టేవాడు.
ఇరుగు పొరుగు వారు వెదురు బుట్టల అల్లికల పనికి వెళ్తుంటే వారితో పాటుగా మరల సాయంకాలం పని చేస్తే మూడు వందలు చేతికొచ్చేవి.
ఇలా నిరంతరం కష్టపడి పనిచేస్తూ పిల్లల్ని మాధ్యమిక విద్య వరకు తీసుకొచ్చింది. పెద్దమ్మాయి పదవ తరగతిలోకి అడుగుపెడుతున్న తరుణంలో వరుణ్ తో విపరీత గొడవలు మొదలయ్యాయి. త్రాగుడు భర్తను భరించలేక, ఇక కలిసుండడం కుదరని పని, అని నిశ్చయించుకుని పట్టణానికి పరుగులు తీసింది వెన్నెల ముగ్గురమ్మాయిలతో.
ఒకరి ఇంట్లో చిన్న గది అద్దెకు తీసుకుని వ్యర్థమైన పదార్ధాలతో అందమైన గృహోపకరణ వస్తువులను తయారు చేసి అమ్మకానికి సంతలోకి తీసుకెళ్ళింది. వేసవి సెలవులు కావటంతో పిల్లలు కూడా తల్లికి చేయూత నిచ్చారు.
" అమ్మా! ఎంత చక్కగా చేశావు. ఇవ్వన్నీ కొనుకుంటాను. ఎంత?" అని ఓ బ్యాంకు మేనేజర్ అడిగాడు.
" మీకు తోచినంత ఇవ్వండి బాబుగారు, చేతికష్టం" అంది వెన్నెల.
వారం రోజుల తర్వాత మేనేజర్ వెన్నెలను పొదుపు సంఘాలలో చేర్పించి, బ్యాంక్ లోన్ ఇప్పించాడు. దాని ద్వారా "హస్తకళల తయారీ" దుకాణాన్ని ప్రారంభించింది. వాటి నుండి వచ్చిన డబ్బులతో కుట్టు మిషన్లు కొని ఒక వైపు టైలరింగ్ శిక్షణ కొనసాగించింది.
పిల్లలు కూడా తల్లి పడే కష్టాన్ని అణువణువున చూస్తూ బాగా కష్టపడి చదివి మంచి కొలువులో స్థిర పడ్డారు.
టీచర్, న్యాయవాది, ఇంజనీర్లుగా ఎదిగి గృహస్థ ధర్మాన్ని చేపట్టారు పిల్లలు. కాలచక్రం తిరుగుతుండగా మనవరాళ్ళూ, మునిమనవళ్ళూ వచ్చేసారు ఇంట్లోకి. ఏదో ముచ్చటిస్తూ
"అమ్మమ్మ! ఏంటి నీవు పదవ తరగతి కూడా పాస్ కాలేదా, ఛ! చెప్పుకుంటే సిగ్గుచేటు" వెక్కిరించాడు మునిమనవడు వినయ్.
"నేను, చూడు ఇప్పుడు పదవ తరగతి చదువుతున్న ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా. "
ఏదో ఒక మూల గట్టిగా తగిలింది వెన్నెలకు సరే అనుకుని, ఓపెన్లో ప్రైవేటుగా పదవ తరగతికి కట్టి, మాస్టారుని పెట్టించుకుని, శ్రద్ధగా చదివి రోజు విడిచి రోజు స్లిప్ టెస్ట్లు రాసి పరీక్షకు హాజరయ్యింది వెన్నెల. కొద్దినెలల తేడాతోనే వెన్నెల, మునిమనవడి పదవతరగతి ఫలితాలు వెలువడ్డాయి. వినయ్ ఫెయిలయ్యాడు. వెన్నెల డిస్టింక్షన్లో పాసయ్యింది.
"ఏంట్రోయ్! గడుగ్గాయి ఇప్పుడేమంటావ్?"
" అమ్మమ్మా! యు ఆర్ రియల్లీ వెరీ గ్రేట్, హ్యాట్సాఫ్ టు యు, నన్ను క్షమించు".
78వ వసంతంలో కూడా కృషి, పట్టుదల, అంకితభావంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులైన వెన్నెలను చూసి ఈ వయస్సులో ..కూడానా??? అంటూ అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెన్నెలను ఉత్తమ సీనియర్ సిటిజన్ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. కుటుంబ సభ్యులందరూ ఒక మరపురాని మధుర జ్ఞాపక వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వెన్నెల జీవితంలో నిజమైన వెన్నెలను నింపిన తమ కుటుంబానికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనందభాష్పాలతో వెన్నెల.
సందేశం: విద్యకు వయస్సుతో నిమిత్తం లేదు. కష్టే ఫలి..
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.
Comments