top of page

జస్ట్ టెన్ మినిట్స్

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #JustTenMinutes, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Just Ten Minutes - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 14/06/2025

జస్ట్ టెన్ మినిట్స్ - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఒరేయ్ మామాస్..! నాకు కొత్త జాబ్ వచ్చింది" అన్నాడు అఖిల్ తన ఫ్రెండ్స్ తో ఆనందంగా.


"ఏ జాబ్..? పెద్దదేనా?" అడిగారు అంతా.

 

"అందరి అవసరాలు తీర్చే జాబ్.." అని గొప్పగా అన్నాడు అఖిల్.

 

"అయితే శాలరీ కూడా పెద్దగానే ఉంటుందే.."


"ఎవరైనా దయతలచి ఇస్తే.. ఎక్కువే వస్తుంది.."


"ఏంట్రా..కొంపదీసి అడుక్కునే జాబ్ ఏమిటి?"


"ఛ..ఛ..అవేం మాటలు..నేననేది వచ్చే టిప్స్ గురించి.."


"ఓహ్ అవా..! అయితే వెయిటర్ అనమాట..పెద్ద స్టార్ హోటల్ అయి ఉంటుంది..నెలకొకసారి మీ హోటల్ నుంచి మాకు ఫ్రీగా పార్సెల్ తేవాలి.."


"ఊరుకోండి రా..నన్ను అసలు చెప్పనిస్తే గా..ఊరకే గోల చేస్తారు. నాకు వచ్చింది డెలివరీ బాయ్ జాబ్"


"డెలివరీ బాయ్..అవునా..?"


"అదేంట్రా అలా గాలి తీసేసారు.."


"డెలివరీ చేస్తే.. ఆయాసం తప్ప ఏం వస్తుంది..?"


"అందుకే ఫుడ్ డెలివరీ, పార్సెల్ డెలివరీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను..అన్నీ జస్ట్ టెన్ మినిట్స్ లోనే డెలివరీ..తెలుసా?"


"ఏదైతే ఏంటి..అన్నీ ఒకటే కదా..పంచడమే కదా.."


"అవును కానీ..బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మధ్య దారిలో ఆకలి వేస్తే, కొంచం ఫుడ్ టేస్ట్ చూడొచ్చు..పైగా తిరగడానికి పెట్రోల్ ఫ్రీ, టిప్స్, కొత్త పరిచయాలు, ప్రేమలో కూడా పడొచ్చు" అని మురిసిపోతూ అన్నాడు అఖిల్ 


"కొత్త అల్లుడిలాగా ఇన్ని ఆశలతో దిగితున్నావు...ఆల్ ది బెస్ట్. ఫస్ట్ కి శాలరీ వచ్చాక ఇక్కడే పార్టీ..అప్పుడు నీ విషయాలు అన్నీ మాకు చెప్పాలి. నచ్చితే, మేమూ తలో దిక్కు పంచుకుంటూ, నాలుగు డబ్బులు సంపాదించుకుంటాం..నీలాగ"


"అలాగే.."


ఒక నెల తర్వాత...అందరు మళ్ళీ అక్కడే కలిశారు. 


"ఏమిటి రా అఖిల్..మొహం అలా వాడిపోయింది? మునపటి హుషారే లేదు. నీ మాటలు వినాలని..మా చెవులు పెద్దవి చేసుకుని వెయిట్ చేస్తున్నాం.."


"అయితే చెబుతాను..మీరే డిసైడ్ చేసుకోండి"


"మొదట్లో ఫ్రీగా ట్రావెలింగ్ సూపర్ గా ఉంది. లొకేషన్ ఇస్తారు..అక్కడకు వెళ్లి డెలివర్ చెయ్యడమే అంతే..బైక్ రైడింగ్ కూడా ప్రాక్టీస్ అయ్యింది. ఇప్పుడు నేను కూడా డ్రైవింగ్ బాగా చేస్తాను. అవసరంలో ఉన్నవారికి మందులు, సరుకులు, మరిచిపోయిన వస్తువులు ఇస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది. మాదీ సేవే కదా!"


"వెరీ గుడ్..కానీ పే సర్వీసు బాబు" అన్నాడు ఫ్రెండ్.


"అదేలే..కొంతమంది టిప్స్ ఇస్తున్నారు..ఆ టిప్స్ నా దారి ఖర్చులకి కూడా రావట్లేదు. పైగా పీక్ టైం లో ట్రాఫిక్ ఒకటి. ఈ మధ్య చెవులు కూడా సరిగ్గా వినిపించట్లేదు..పైగా పొల్యూషన్.."


"హెల్త్ ప్రాబ్లెమ్స్ వస్తాయేమో చూసుకోరా" అన్నారు ఫ్రెండ్స్ అంతా


"ఇవన్నీ కామన్ రా.." అన్నాడు అఖిల్ 


"రాత్రి పూట కూడా ఆర్డర్ చేస్తున్నారు. నిద్ర పాడు. అర్దరాత్రి ఆకలేసిందని..రెండు చిప్స్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టారు..ఏం చెప్పను. అప్పుడప్పుడు పిజ్జా గుమగుమలు..తినాలని ఉన్నా..ఏమీ చెయ్యలేను. కొంతమంది కక్కుర్తి పడినా, మనం సిన్సియర్"


"నువ్వు గ్రేట్ రా...మేమూ జాయిన్ అయిపోమా..?"


"ఇంకా చెబుతాను..అసలైన పరీక్ష ఇక్కడే. పర్సనల్ పనులకి కూడా మమల్ని వాడుకుంటున్నారు. పెళ్ళైన వారైతే..వారి అవసరాలకి రాత్రి పూట ఆర్డర్ పెడుతున్నారు. ఒకటి, రెండిటి కోసం దూరం పోవాల్సి వస్తోంది..డబ్బుల కోసం అన్నీ ఒప్పుకున్నాక తప్పుతుందా?"


"ఎవరి అవసరాలు వారివి మరి..తప్పదు. ఇంతకీ లవ్ ప్రపోజల్ ఏమైంది? ఎవరైనా పరిచయమయ్యారా?"


"లేదు రా.."


"నువ్వు ఎంత ట్రై చేసినా..నిన్ను డెలివరీ బాయ్ లాగే చూస్తారు..తెలుసుకో"


"నిజమే..." అన్నాడు అఖిల్. 


"మరి ఇంకేంటి..? వాటర్ బాటిల్ ఆర్డర్ చెయ్యరా అఖిల్..దాహం వేస్తోంది.."


"వాటర్ బాటిల్ పేరు ఎత్తకురా బాబు..అదే గుర్తొస్తోంది.." అన్నాడు అఖిల్ ముఖం అదోలా పెడుతూ.


"ఏమైందో చెప్పు..వినాలని ఉంది"


"మొన్న తెల్లవారుజామున..ఒకడు ఆర్డర్ పెట్టాడు. పాపం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కోసం అని తొందరగా వెళ్లాను. ఆ లొకేషన్ కోసం ఎంతో దూరం పోవాల్సి వచ్చింది. ఇంతా చేస్తే ఆ లొకేషన్ చెట్ల వెనుక చూపించింది"


"చాలా ఇంటరెస్టింగ్ గా ఉందే. ఇంతకీ ఏమిటో ఆర్డర్ చేసింది?"


"ఒక వాటర్ బాటిల్, కొన్ని టిష్యూ పేపర్స్, ఒక సోప్.."


"అయితే, తిన్నాక..వాష్ చేసుకోవడం కోసం అయి ఉంటుంది. పిక్నిక్ కి వెళ్ళాడేమో?"


"నాదీ అప్పుడు అదే ఫీలింగ్.."


అతను, చెట్ల వెనుక నుంచి లుంగీ సర్దుకుంటూ బయటకు వచ్చాడు. ఒకటే కంపు..ఫ్రెష్ గా అన్లోడ్ చేసినట్టున్నాడు. చేతికి బాటిల్ అందించమన్నాడు.. ఇచ్చాను. తర్వాత సోప్ ఓపెన్ చేసి ఇచ్చాను. దానితో కడుక్కున్నాడు. బయటకు వచ్చిన తర్వాత టిష్యూస్ తీసుకుని తుడుచుకుని పక్కన పడేసాడు..అప్పుడు పేమెంట్ చేసాడు".


"అయితే చెట్లకి ఎరువు వేసాడనమాట. పేమెంట్ కోసం బాగానే సర్వీస్ చేసావు..టిప్ బాగా ఇచ్చి ఉంటాడే.."


"నా మొహం! అలసిపోయి వచ్చావేమో..ఆ మిగిలిన వాటర్ బాటిల్ నీళ్లు నాకు ఇచ్చి..మొహం కడుక్కోమన్నాడు. పైగా జస్ట్ టెన్ మినిట్స్ డెలివరీ సూపర్, టైం కి వచ్చావు అన్నాడు".


"ఛి..ఛి..కొంపదీసి కడుకున్నావా ఏమిటి ? "అని అందరూ ఒకటే నవ్వు. అయినా, అడ్రస్ చూసుకుని వెళ్ళాల్సింది కదా."


"మాకు లొకేషన్ ముఖ్యం అంతే..డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాం..ఎక్కడికైనా సరే."


"అయితే నీ ఖర్మ..! ఈ సమ్మర్ లో అసలే సిటీ అంతా వాటర్ ప్రాబ్లెమ్ ఉంది..ఎక్కువ డెలివరీ చెయ్యాలేమో చూసుకో మరి! మంచి మాస్క్ ఒకటి కొనుక్కో.. ఆల్ ది బెస్ట్..ఎంజాయ్ యువర్ జాబ్.." అంటూ అక్కడనుంచి అందరూ జంప్.

**********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments


bottom of page