top of page

తరగని ఆస్తి

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #TaraganiAsthi, #తరగనిఆస్తి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Taragani Asthi - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 23/05/2025

తరగని ఆస్తితెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"రంగా.. ! నీ పనే బాగుందిరా.. " అన్నాడు ఫ్రెండ్ రాజు 

"ఎందుకురా అలా అంటున్నావు?"

"ఎవరైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు, డబ్బిస్తారు, బిజినెస్ ఇస్తారు.. కానీ నీకు మాత్రం మీ నాన్న ఎప్పటికీ తరగని ఆస్తి ఇచ్చాడు.. "

"నిజమే.. నాకిచ్చిన ఆస్తి ఎప్పటికి తరగదు.. ఎంతో మందికి ఉపయోగపడుతోంది కూడా.. ముఖ్యంగా ఆడవారికి "

"నీదీ మంచి వ్యాపారమే కదా.. మీ నాన్న పోతూ నీ చేతులో పెట్టాడు.. ఎలా ఉంది వ్యాపారం?" అడిగాడు రంగా


"జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ బిజినెస్ అనే మాటే గానీ.. ఈ రోజుల్లో కొనేవారే తక్కువ అయిపోయారు. సగం మా అబ్బాయే అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటున్నాడు"


"మరి నీ చీరల వ్యాపారమో.. ?" అడిగాడు రంగా


"ఆడవారు చీరలు కట్టేదే తగ్గించేసారు.. ఎప్పుడో పండక్కో, ఫంక్షన్ కో కడుతున్నారు. మీ సీరియల్స్ పుణ్యమా అని ఇంకా చీరలు కొందరైనా కడుతున్నారు. సేల్ కానివి మా ఆవిడ కట్టేస్తోంది.. ఏదో అలా సాగుతోంది అంతే.. ! అదే నీ సీరియల్ అయితే.. ఎప్పుడూ జనాలు చూస్తూనే వున్నారు.. ఫుల్ డిమాండ్ కదా.. నీదీ మంచి బిజినెస్" 


"నువ్వు చెప్పింది నిజమే.. ఆడవాళ్లు తిండి ఐనా మానేస్తారేమో గానీ.. సీరియల్ మాత్రం మానరు.. అందుకే మాకు బాగా నడుస్తోంది. దాని వలన టీవీ సేల్స్ పెరిగాయి, యాడ్స్ వల్ల చాలా లాభం.. మేము అందుకే ఎక్కువ డిమాండ్ చెయ్యగలుగుతున్నాము. ఆడవాళ్ళు సీరియల్స్ లో మునిగిపోయి, వారి కంట్లో నీళ్ళు పొంగి వరద అవుతున్నాయని, డ్రమ్ములకి, బకెట్స్ కి బాగా డిమాండ్ వస్తోంది. వాటి సేల్స్ బాగా పెరిగాయి అని రిపోర్ట్ వచ్చింది. 


సీరియల్ మిస్ అవకూడదని కొంతమంది ఆడవారు వంట చెయ్యట్లేదు.. దానివలన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ బాగా పెరిగింది. సీరియల్స్ తియ్యడం వలన ఎన్నో లాభాలు. సీరియల్స్ వల్ల ఆడవారు బయటకు వెళ్ళడమే మానేసారు.. వెళ్తే ఎక్కడ సీరియల్స్ మిస్ అయిపోతారో అని.. దాని వలన షాపింగ్ తక్కువ చేస్తున్నారని భర్తల సంఘాలు అన్నీ మాకు సన్మానం కూడా చేసారు.. "


ఇంకా మా కష్టాలు.. బోలెడు.. కొన్ని చెబుతాను.. 


సీరియల్స్ లో చూపిస్తున్నట్టుగా కాస్ట్లీ చీరలు, ఇల్లులు చూసి అలాంటివి కొనమని కొంతమంది ఆడవారు భర్తలను వేధిస్తున్నారని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. సీరియల్స్ చూసే ఆడవారికి బీపీ ఎక్కువ ఉంటుందని, భర్తల మీద తెగ అరుస్తున్నారని కంప్లైంట్స్ వచ్చాయి. ఈ విషయమై మొన్న మా మీద దాడి కూడా జరిగింది. బిజినెస్ అన్నాక కష్టాలు ఉంటాయి మరి.. ముందుకు వెళ్ళిపోవడమే.. 


"నాకు ఒక సహాయం చేస్తావా.. ?" అడిగాడు రాజు

"చెప్పు.. "

"ఇప్పుడున్న సీరియల్స్ లో టాప్ సీరియల్ నీదే.. నీకు తిరుగే లేదు. నీ సీరియల్ ఆల్మోస్ట్ అందరూ ఆడవారు మిస్ కాకుండా చూస్తారు. నా జీడిపప్పు బిజినెస్ కి, చీరల బిజినెస్ కి ఏదైనా చెయ్యరా బాబు.. !"


"అంతేగా.. ! నెక్స్ట్ ఎపిసోడ్ లో సన్నగా ఉన్న హీరోయిన్ ఎలాగైనా అందంగా అవాలని ఆలోచిస్తుంది. ఆ హీరోయిన్ మీ షాప్ లో జీడిపప్పు కొన్నట్టు షూట్ చేద్దాము. తర్వాత మీ షాప్ లో మంచి చీర కొన్నట్టుగా చూపిద్దాము. మర్నాడు జీడిపప్పు తిన్న ఆమె, బొద్దుగా నీ చీరలో ఇంకా అందంగా కనిపిస్తుంది.. "


"నిజంగా.. ?"

"మనం వేరే అమ్మాయిని మర్చేస్తాము. ఆ పాత అమ్మాయి మానేస్తాను అంటోంది. జనాలు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత, నీ సేల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి.. నాకు కమిషన్ ఇవ్వాలి మరి"

"తప్పకుండా.. " 


"ఇంతకీ నీ సీరియల్స్ ప్రయాణం ఎలా మొదలైంది.. ఎప్పుడూ చెప్పనేలేదు?"


మా నాన్నగారు ఒక సీరియల్ తియ్యాలని అప్పట్లో అనుకున్నారు. ఒక పది లైన్లు మించి కథ రాలేదు.. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. మొదలెడితే అదే సాగుతుందని అనుకున్నారు. నేనూ అప్పుడు ఆ సీరియల్ చూసేవాడిని. మొదలైన సీరియల్.. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ చూసినా.. ఇంకా సీరియల్ అక్కడే ఉండేది.. అప్పుడు కట్టెల కోసం అడవికి బయల్దేరిన హీరో.. ఆరు నెలల తర్వాత మెల్లగా కట్టెలతో ఇంటికి చేరుకున్నాడు. 


అది ఎలాగా.. ?


మధ్యలో కొండలు, చెట్లు అలా చూపించిందే చూపించడం.. రోజు హీరో చేసే పనులు చూపించడం.. తర్వాత మెల్లగా అసలు సీరియల్ మొదలయ్యేది. అప్పట్లో రెండువేలకు పైగా తీసారు.. తర్వాత నాకు అప్పగించారు. ఇప్పుడు నేను అదే సీరియల్ కొత్త టెక్నిక్స్ తో ఇంకా పొడిగిస్తున్నాను.. ఇప్పుడు అదే సీరియల్ ఐదు వేలు ఎపిసోడ్ నడుస్తోంది.. "


"అన్ని ఎపిసోడ్స్ ఎలా? నువ్వు ఏ టెక్నిక్స్ ఉపయోగించావు?" అడిగాడు ఫ్రెండ్ 


"ప్రతీదానికి ఇంట్లో అందరి ముఖాలు ఒక నాలుగు సార్లు చూపించడం.. ఒక పెన్ను కిందన పడినా.. అందరి ముఖాల్లో విపరీతమైన ఎక్స్ప్రెషన్స్.. అలాగే తిప్పి తిప్పి అందరిని ఒక నాలుగు సార్లు చూపించడం.. అంతే!"


"మొత్తం ఒక పేజి స్టొరీ మాత్రమే రాసుకుని ఇన్ని ఎపిసోడ్స్ తియ్యడం చాలా గ్రేట్.. "


"ఏముంది.. ! అరగంటలో పది నిముషాలు సీరియల్, మిగతావి యాడ్స్. ఆ పది నిమిషాలలో రీక్యాప్ ఒక మూడు నిముషాలు.. హైలైట్ గా ఒక మెలోడీ పాట ఉంటుంది. మిగిలిందే సీరియల్.. "


"యాడ్స్ కోసం సీరియల్ లాగ ఉంటుంది అయితే.. " అన్నాడు రాజు 


"అంతేగా.. ! తప్పదు మరి!" అంటూ నవ్వుతూ అన్నాడు రంగా


********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments


bottom of page