top of page
Original.png

తెలుగు భాషాభ్యున్నతికి కృషి

Updated: Jan 9, 2025

#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #తెలుగుభాషాభ్యున్నతికికృషి, #TeluguBhashabyunnathikiKrushi, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Telugu Bhashabyunnathiki Krushi - New Telugu Poem Written By Bhallamudi Nagaraju

Published In manatelugukathalu.com On 30/12/2024

తెలుగు భాషాభ్యున్నతికి కృషి - తెలుగు కవిత

రచన: భళ్లమూడి నాగరాజు


అక్షరాలను పేర్చు కుంటూ 

తెలుగు తల్లికి గుడి కడదాం 


సాహితీ పీఠం పై 

అమ్మను ప్రతిష్టించుకుందాం


కవితాక్షరాల చీరతో 

కథానికాభరణాలతో 

అమ్మను అలంకరించుకుందాం 

ప్రాచీన సాహితీ తిలకం దిద్దుదాం 


అక్షర దివ్వెల వెలుగులో

భావ కవితా సుగంధాల్లో 

నవ్య గేయ పరిమళం తో 

భక్తి గీతాలు పాడుకుందాం 

పద్యం నైవేద్యం సమర్పించు కుందాం


భాషామృతం భావితరాలకు అందిద్దాం 

భాషాభిమానులనే గెలిపించుకుందాం 

తెలుగు బడులను తెరిపించుకుందాం 

తెలుగు కీర్తి పతాకం 

రెప రెప లాడేలా కృషి చేద్దాం 

తెలుగు భాషాభ్యున్నతికి కృషి చేద్దాం 


..భళ్లమూడి నాగరాజు

రాయగడ.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page