'Terichina Pusthakam' New Telugu Story
Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
(ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః”
“అన్నారు పెద్దలు” అని అన్నాడు బాలు.
“అవును, అంటారు. ఎందుకు అంటే నిజమే కాబట్టి. సరే కానీ నువు అల్లరి చేయకుండా వెళ్లి చదువుకో. పరీక్షలకు సమయం తక్కువగా ఉంది” అన్నాడు శశిధర్.
“వాడు వెళ్తాడులే గానీ నువ్వెందుకు అంతలా ఆవేశపడుతున్నావ్?” అన్నాడు సత్య.
“అంటే పరీక్షలకు సమయం తక్కువగా ఉంది కదా! అందుకే. అందులోనూ వాడు కొంచం డల్ స్టూడెంట్ కదా.. అందుకే నా ఆవేశం” అన్నాడు శశిధర్.
అరే.. వీడు ఇంకా అప్డేట్ అయినట్లు లేడురా. వీనికి కాస్త వివరంగా నిజాలను చెప్పండి రా” అన్నాడు రమేష్.
“ఏమి నిజాలు తెలుసుకోవాలి రా> నువ్వు చదువుకో” అన్నాడు శశిధర్.
“కోప్పడకురా! ఈ సారి మన కాలేజ్ లో చీటీలు అందిస్తారట. నీకు తెలుసునో లేదో అనీ” అన్నాడు రమేష్.
“ఆ విషయం నాకు ముందే తెలుసు, ఒకవేళ చీటీలు ఇవ్వకపోతే ఏమిటి పరిస్థితి?” అన్నాడు శశిధర్.
"అరే.. మీరిద్దరూ ఇంకా అప్డేట్ కాలేదురా. అసలు చీటీలు కాదురా.. మొత్తం బుక్ తీసుకెళ్ళి చూస్తూ రాయవచ్చు. అందుకే నా ఆనందం అంతా” అన్నాడు బాలు.
“అరే.. వీడు ఏమైనా కల కన్నట్లున్నాడు. మీరు వెళ్లి చదువుకోండి రా” అన్నాడు శశిధర్.
“లేదురా.. కావాలంటే చూడు.. న్యూస్ పేపర్ లో వచ్చిన స్టేట్ మెంట్. ఇంకా న్యూస్ ఛానల్ లో కూడా వచ్చింది రా, కావాలంటే చూడు” అన్నాడు బాలు.
“నిజమే కదరా.. ఇటు ఇవ్వు, నేను చదువుతాను” అన్నాడు శశిధర్.
“ఏమి ఉందిరా.. ఎందుకు ఆ విధంగా స్టేట్ మెంట్ ఇచ్చారు?” ప్రశ్నించాడు సత్య.
ఏమీ లేదురా.. వాళ్లకు చదివి రాయడం కంటే పుస్తకాలను చూస్తూ రాయడం కష్టం అట. అందుకే ఆ విధంగా స్టేట్ మెంట్ ఇచ్చారు” అన్నాడు శశిధర్.
“ఎలా కష్టం రా.. బుక్ లో ఉన్నది చూసి రాయడానికి ఏమి అంత కష్టం” అన్నాడు రమేష్.
"అంటే పరీక్షలకు సమయం కేటాయిస్తారు కదా, ఆ సమయంలోనే బుక్ లో ఉండే సమాధానాలను వెతికి రాయడానికి సమయం ఎక్కువ అవుతుంది కదా! పుస్తకాలలో ఉండే పూర్తి సమాచారం అంతా విద్యార్థుల మెదడులో ఉండాలి అట. అప్పుడే మెత్తం అన్నీ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది అనీ వారి ఆలోచన” అన్నాడు శశిధర్.
“అరే వాళ్ళ తెలివి మండ.. విద్యార్థులు అందరూ తలా ఒక ప్రశ్నకు సమాధానం కనుక్కొని పేపర్లు నింపితే 15 ప్రశ్నలకూ సమాధానాలు దొరుకుతాయి కదా! అది అంతా కేవలం 10 నుంచి 15 నిమిషాల సమయం తీసుకుంటుంది. అంతే కదా” అన్నాడు బాలు.
“అరే వీడికున కాస్త బుర్ర కూడా ఈ విధానం తీసుకొచ్చినవాళ్ళకి లేకపాయే కదరా..!! ఏమి చేస్తాం విద్యార్థులను యెక్క మేధస్సును విద్యా మార్పులే సగం దెబ్బ తీస్తున్నాయి అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదేమో అనిపిస్తుంది నాకు’ అన్నాడు శశిధర్.
“ఏమో లేరా.. మరునాడు కళాశాలలో సార్ ని అడుగుదాం ఈ విధానం అమలు చేస్తారా లేదా.. చేస్తే ఏ విధమైన పరిస్థితులు ఏర్పడవచ్చునో అడిగి తెలుసుకుందాం” అని అందరూ అనుకున్నారు.
అనుకున్న విధంగానే మరుసటి రోజున కాలేజ్ కి వచ్చారు. వాళ్ల సార్ గారి దగ్గరికి వెళ్లి ఇచ్చిన స్టేట్ మెంట్ గురించి అడిగారు.
అపుడు వాళ్ళ సార్ గారు “నిజమే కానీ ఆ విధానం అమల్లోకి వస్తే ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పలేము” అన్నాడు.
మరి భవిష్యత్తులో మా జీవితాలు, రానున్న విద్యార్థుల జీవితాలు ఎలా ఉండవచ్చు సార్?” అని అడిగారు విద్యార్థులు.
“ఏమో మరి! మేము చదువుకున్నప్పుడు పుస్తకాలను మాత్రం పరీక్షా హాల్ వరకు కూడా తీసుకురానిచ్చేవారు కాదు. అందువల్లే మేము కొంతవరకు పరిజ్ఞానం కలిగి ఉన్నాము. ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకోగలిగాము. ఇంకా చెప్పాలంటే ఆ పద్ధతే బాగుండు అనిపిస్తుంది నాకు.
"మరి మీ పరిస్థితి గురించి ఆలోచిస్తే పుస్తకాలను పరీక్షా హాల్ వరకు తీసుకురావడమే కాకుండా తెరిచి మరీ రాయిస్తున్నారు అంటే తెరిచిన పుస్తకం లా ఉంటాయేమో మీ జీవితాలు కూడా.. తలుచుకుంటేనే భయమేస్తోంది నాకు” అన్నాడు మాస్టర్ గారు.
“అలా ఎందుకు అవుతుంది సార్” అన్నారు విద్యార్థులు.
"ఏముందిరా.. మరి అలా కాకుండా ఎలా ఉంటాయి అని చెప్పగలం? ఎందుకంటే మేము పాఠ్యాంశాలను చెపుతున్నామ్. ప్రాక్టికల్స్ లో హెల్ప్ చేస్తున్నాం. పరీక్షలు నిర్వహించి మార్కులు పెంచేందుకు ప్రయంతిస్తున్నాము తప్ప, తగ్గించడానికి ప్రయత్నం చేయడం లేదే..!! ర్యాంకు బాటకు ప్రయత్నిస్తున్నామే గానీ మీ మేదస్సును పరిరక్షించడం లేదు. మార్కులది ఏమందిరా.. మూర్ఖులకు కూడా వస్తాయి. తెలివితేటలు, పరిజ్ఞానం రావాలి అంటే వేరే విధంగా ఉండాలి విద్యావ్యవస్థ. నిజానికి చెప్పాలంటే మీ మెమోరిని ఇంతవరకు పరీక్షించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. విధి వైపరీత్యం! ఏమిచేస్తాం, సరే మీరు క్లాస్ లకు వెళ్ళండి, టైం అయ్యింది. ఏమి జరగాలని ఉంటే అదే జరుగుతుంది. మన చేతుల్లో లేదు కదా” అన్నాడు మాస్టర్.
"సర్వే జనా సుఖినోభవంతు"
కిడాల శివకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
Podcast Link
Twitter Link
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
30/10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ నవతరం రచయిత బిరుదు పొందారు.
Comments