top of page

తల్లి హితబోధ

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ThalliHithabodha, #తల్లిహితబోధ, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 119


Thalli Hithabodha - Somanna Gari Kavithalu Part 119 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 17/09/2025

తల్లి హితబోధ - సోమన్న గారి కవితలు పార్ట్ 119 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


తల్లి హితబోధ

----------------------------

గర్వానికి ఫలితము

పరికింపగ పతనము

కల్గియున్న వినయము

దక్కునోయ్! గౌరవము


స్వయం కృషి ఆభరణము

జీవితాన అందము

అలవడితే మాత్రము

భవితే బంగారము


వదిలితే బద్ధకము

అభివృద్దే సాధ్యము

కష్టపడితే గనుక

జీవితాన విజయము


మేలు దృఢ సంకల్పము

మనోసిద్ధి కారకము

నిరంతర సాధనే

గెలుపుకు సోపానము


ree














పల్లెకు ఆహ్వానం

---------------------------------------

మా పల్లె అందాలు

ముడివేయు బంధాలు

చూసేందుకు చాలవు

మా రెండు నయనాలు


అందమైన పొలాలు

తలఊపే తరువులు

కదిలించు హృదయాలు

పారే సెలయేరులు


స్వచ్ఛమైన ప్రేమలు

కల్తీలేని మనసులు

మా పల్లెకు సొంతము

అక్షరాల వాస్తవము


అంతటా పచ్చదనము

చూడుము చక్కదనము

మ పల్లెకు ఒకమారు

రమ్మని ఆహ్వానము

ree
















సుభాషిత రత్నాలు

--------------------------------------

శుద్ధమైన హృదయము

దేవునికి మందిరము

జాగ్రత్తగా దానిని

చూడుము నిరంతరము


శ్రేష్టమైన తలపులు

నిస్వార్థపు సేవలు

దైవానికి ఇష్టము

సాయపడే చేతులు


ఆధ్యాత్మిక చింతన

మనశ్శాంతికి వంతెన

మోక్షానికి ద్వారము

మోదానికి తీరము


ఆపదలో ఆప్తులు

ఆత్మీయ బంధువులు

ఉండాలోయ్! తప్పక

ఆదరించు మిత్రులు

ree









అక్షరాల ఆకాంక్ష

-----------------------------------------

నమ్మకం కోల్పోకు

దైన్యంలో పడిపోకు

ఊటలా ఉబికి ఉబికి

రారమ్ము పైపైకి


నిరాశ రానియ్యకు

ధైర్యాన్ని వదిలేయకు

క్రుంగుబాటుతనంతో

భవిత పోగొట్టుకోకు


గురిని వీడనాడకు

మధ్యలో ఆపేయకు

పోరాడుము సతతము

గెలుపు వచ్చు వరకు


మెదడుకు పదును పెట్టు

ఫలితాలు చూపెట్టు

నీకున్న జ్ఞానంతో

అనుకున్నది రాబట్టు

ree










బామ్మ ముచ్చట్లు

---------------------------------

సత్పురుషుల సహవాసము

ఎల్లవేళలా క్షేమము

అభివృద్ధి సోపానము

జీవితమిక సుఖాంతము


మహనీయుల దారిలో

వారు చేయు బోధలో

ఎన్నెన్నో లాభాలు

కన్నవారి నీడలో


స్నేహితుల మాటల్లో

వారు చూవు ప్రేమల్లో

ప్రవహించు ఆనందము

వారి గుండె కోవెలలో


పసి పిల్లల నోటిలో

ప్రవహించే ఏటిలో

ఉపయోగం మెండుగా

అనురాగపు కోటలో

-గద్వాల సోమన్న

Comments


bottom of page