తల్లిదండ్రులు ఘనులు
- Gadwala Somanna
- Dec 25, 2024
- 1 min read
Updated: Jan 1
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #తల్లిదండ్రులుఘనులు, #Thallidandrulu Ghanulu

Thallidandrulu Ghanulu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 25/12/2024
తల్లిదండ్రులు ఘనులు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
అమ్మానాన్నల కంటే
చూడ స్వర్గమెక్కడుంది!
వారి త్యాగానికి మించి
భువిని శ్రేష్టమైనదేది!
కనిపించే ఇలవేల్పులు
కనిపెంచే మహనీయులు
తల్లిదండ్రుల సేవలు
చేసుకుంటే దీవెనలు
సదనంలో రవిచంద్రులు
బాధ్యత గల కన్నవారు
అమూల్యమైనవి ప్రేమలు
ఎవ్వరూ సాటిరారు
తల్లిదండ్రులు మనసులు
కష్టబెట్ట కూడదోయ్!
అవసాన సమయంలో
అలక్షం చేయరాదోయ్!
-గద్వాల సోమన్న
Comments