top of page

టికెట్


'Ticket' New Telugu Story

Written By Bhagavathula Bharathi

'టికెట్' తెలుగు కథ

రచన: భాగవతుల భారతి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఇదేమిటీ ఇలా జరిగిందీ! ఇప్పుడేం చేయటం? బస్సు ఎక్కాలంటే డబ్బులేవీ? అన్నయ్య అప్పుడే అన్నాడు, ఒంటరిగా వెళ్ళోద్దని.... ఇప్పుడుఎలా?


అవును ! పుట్టింటి తరుఫు వాళ్ళ ఫంక్షన్ గుంటూరులో పెట్టారు. ఈయనకి సెలవు లేదు. నన్ను వెళ్ళమన్నారు. చంటిపాపతో వెళ్ళాను. వచ్చేటప్పడు సరాసరి రైలుంది. దానికి రావచ్చనుకున్నా.... అక్కడి కార్యక్రమం లేటయింది. ట్రైన్ మిస్సయింది.


"ఆగు... రేపటి ట్రైన్ కి పంపుతాలే! ? ఖమ్మం చేరి, అక్కడినుండి రఘునాధపాలెం వెళ్ళేసరికి పొద్దుగూకుతుంది, చీకట్లో! ....” అన్నాడు అన్నయ్య.


అయినా సరే వెళ్ళిపోతానని... అక్కడ విజయవాడ వెళ్ళే బస్ ఎక్కా.... అంతవరకూ బానేఉంది.

నాకు బస్ వాసనపడదు. పాపను పక్క సీటులో పడుకోబెట్టి, కళ్ళుమూసుకున్నాను మధ్య మధ్యలో బస్సులోంచి తల బయటపెట్టి వాంతి చేసుకుంటూ, ఎలాగోలా విజయవాడ జేరా... ఖమ్మం బస్సు ఎక్కా.


విపరీతమైన జనం తొక్కిసలాట. చంటిపిల్ల తల్లినిగదా! సీట్ దొరికింది.

కూర్చుని టికెట్ తీసుకుందామంటే... హ్యాండ్ బ్యాగ్ లేదు. గుండె గుభేలుమంది. దిగి బస్టాండ్ మొత్తం పిచ్చెక్కినట్లు తిరిగా.


'నా పిచ్చిగానీ, దొంగతనం చేసినవాడు ఇక్కడ బ్యాగ్ తో ఎదురుగా ఉంటాడా? ఇదిగో నేనే తీసా! తీస్కోమని చేతికందిస్తాడా? '

బస్ బయలుదేరుతుండగా... ఏదయితే అది అయింది అని ఎక్కేసా...


ఇక ముచ్చెమటలు పోస్తున్నాయ్. వాంతులు అవటంవలన నీరసం వచ్చేస్తోంది. పిల్లఏడుపు.. ఏదైనా కొందామన్నా డబ్బులన్నీ అందులోనే పోయాయ్.

అమ్మో! నగలూ... బట్టల బ్యాగ్ తీసి తడిమి చూసా... హమ్మయ్య ఉన్నాయ్.

టికెట్...టికెట్... కండెక్టర్ తన సీటులోంచి లేచి, బయలుదేరాడు....


ఎన్నో డబ్బులూ ఉంటాయ్! నగలూ ఉంటాయ్. ఇళ్ళూ ఉంటాయ్. కానీ ఒక్కోసారి ముష్టివాళ్ళమై నిలబడతాం.. అదే విధివిలాసం.


ఎవరినన్నా అడగాలన్నా... పిల్లని చేతిలో పట్టుకుని అందమైన అలంకరణలో అడుక్కోవటం ఇదో ట్రెండా? అని నవ్వుతారేమో! నగ అమ్మాలన్నా "ఎక్కణ్ణించి కొట్టుకొచ్చావ్ ?" అనడిగితే?

భగవంతుడా? ఏమిటీ పరీక్ష నాకు. కండెక్టర్ కే విషయం చెప్పేస్తే?


మధ్యలో దింపేస్తే.... అటూఇటూ కాకుండా ఎటుపోవాలి?... ఇంటికి ఫోన్? అదికూడాఅందులోనే! పోనీ లగేజి బ్యాగ్ లో పెట్టానా?

చేయిపెట్టా! చేతికి వచ్చింది... గుంటూరు నుండి, విజయవాడ టికెట్.


ఇదీ.... ఐడియా! కండెక్టర్ టికెట్ అన్నప్పుడు, తీసుకున్నానని ఇది చూపిస్తే సరి! ...

ఖమ్మం చేరగానే రఘునాధపాలెం డైరెక్టు ఆటో మాట్లాడుకుని, ఇంటికి చేరాక ఎంతైతే అంత సొమ్ము ఇచ్చేస్తే సరి.

దేవుడి మీదభారంవేసి... మెుండి ధైర్యంతో... తలవంచుకు కూర్చున్నా....


"అమ్మా టికెట్ తీసుకున్నావా? " దగ్గరగా వచ్చాడు కండక్టర్. అయిపోయింది నాపని.. ...చెమట తుడుచుకుంటూ...ఎడమ అరచేయి తెరిచి...చూపించా.

కండక్టర్ టికెట్ తన చేతుల్లోకి తీసుకుని, నా ముఖంలోకి అదోరకంగా చూసి, నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు.


హమ్మయ్య! కష్టం గట్టెక్కింది. సీటు వెనుకకు వాలి, టెక్షన్ తగ్గిపోయిన ఫీలింగ్ తో కళ్ళు మూసుకున్నాను. పాపకూడా నిద్రపోతోంది.

రాత్రయి పోయింది. ఖమ్మం బస్టాండ్ లో అందరూ దిగుతున్నారు. పాపను తీసుకుని ఆఖరుకి నేను దిగుతుండగా...


కండక్టర్ "ఏమ్మా! ఖమ్మమేనా వేరేచోటికి పోవాలా?” అన్నాడు

భయంగానే "రఘునాధపాలెం వెళ్ళాలి" అన్నాను.

"ఇంతరాత్రిలో డబ్బుల్లేకుండా ఎలావెడతావ్? ఇంద.. ఈ వంద తీసుకుని వెళ్ళు " అని వంద తీసిచ్చాడు.


నమ్మలేనట్లు చూసా.

"నీ టికెట్ గుంటూర్ టు విజయవాడ. కానీ నువ్వు మోసగత్తెవు కావూ, ఓ మంచికుటుంబం నుండే వచ్చావని, పర్సు ఎవరో కొట్టేసారని అర్ధమయింది. త్వరగా ఇల్లుచేరమ్మా. అసలే రోజులు బాగాలేవు" అన్నాడు.


ఆ సమయంలో ఆ కండెక్టరేగా దేవుడు! దేవుడి లాంటి ఆ కండక్టర్ కి నమస్కారం పెట్టటంతప్ప ఏం చేయగలను?

----------------------

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.

https://www.manatelugukathalu.com/profile/bharathi/profile


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








51 views0 comments
bottom of page