top of page
Original.png

ఉండాలి తప్పకుండా!

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ViluvainaVakkulu, #విలువైనవాక్కులు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 157

Undali Thappakunda - Somanna Gari Kavithalu Part 157 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 31/12/2025

ఉండాలి తప్పకుండా! - సోమన్న గారి కవితలు పార్ట్ 157 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ఉండాలి తప్పకుండా!

----------------------------

కష్టమైన ఏదైనా

ఇష్టంగా భావించు

శరణంటే ఎవరైనా

పూర్తిగా సహకరించు


బ్రతుకున నిజాయితీగా

జీవించి చూపించు

అందరిలో హుందాగా

ఉండేలా వ్యవహరించు


పదిమందికి దీపంగా

ప్రేమకు ప్రతిరూపంగా

ఉండాలి తప్పకుండా

అవనిలో ఆదర్శంగా


పరుల గుట్టు గోప్యంగా

సంస్కారమే గొప్పగా

ఉండాలి జీవితంలో

చూడ తేజోమయంగా









అమ్మ అమృత పలుకులు

-----------------------------

భగవంతుని నామాన్ని

మహోన్నత రూపాన్ని

ధ్యానించుము నిష్టతో

పవిత్రమైన మనసుతో


పనికిరాని కార్యాలు

అనవసరపు విషయాలు

ఆదిలోనే వదిలేయి!

అదెంతో మంచిదోయి!


మంచి జరుగు మార్గంలో

గురువు పంచు జ్ఞానంలో

జీవితాన్ని దిద్దుకో!

సూర్యునిలా వెలిగిపో!


చేయాలి సత్కార్యాలు

మానాలి వైషమ్యాలు

నలుగురికి ఉపయోగము

కావాలీ జీవితము


















నాన్న గారి మేలి మాటలు

----------------------------------------

గుండెలోని కలతలు

ఆదిలో తరమాలి

నోటితో శుభములు

సతతమ్ము చెప్పాలి


మాటలతో మోసము

చేస్తారు వంచకులు

జాగ్రత్త అవసరము

లేకుంటే కష్టము


దుష్టులతో స్నేహము

ఎప్పుడైనా నష్టము

ఉండాలోయ్! దూరము

లేక బ్రతుకు ఘోరము


చూపిస్తారు నరకము

రాతి వంటి మనుషులు

కరుణార్ధ హృదయులు

భగవంతుని స్వరూపులు
















ఉండాలి--పండాలి

-----------------------------------------

తమ స్వార్థం కోసము

ఒకరిపై నొకరిని

ఉసిగొల్పే ధోరణి

అత్యంత ప్రమాదము


ఉన్నత ఆశయాల

సాధనలో ఓపిక

అవసరమే చాలా

దానికి మించి లేదిక


పగబట్టే స్వభావము

కాదు కాదు మంచిది

విష సర్పం గుణమది

చూడగా మచ్చ అది


ప్రేమించే తత్వము

క్షమించే సుగుణము

ఉండాలి మనిషిలో

పండాలి మనసులో













పెద్దయ్య చురుకైన సూచనలు

-------------------------------------------

దయాదృష్టి గలవాడు

పేదోళ్లకు స్నేహితుడు

ఒక్కింత దాతృత్వము

వారిపై చూపువాడు


దౌష్ట్యమును విత్తువాడు

కీడు అను పంట కోయును

చెప్పుడు మాటలు వినువాడు

ఖచ్చితంగా చెడిపోవును


కోపచిత్తునితో చెలిమి

అత్యంత హానికరము

అట్టి వాని పరిచయము

చేయును మనసుకు గాయము


ఓర్వలేని వానితో

చేయొద్దు సహవాసము

ఎదుగుదలకు అవరోధము

హరించును ఆనందము

గద్వాల సోమన్న







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page