top of page

ఉండు వారు...

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Unduvaru, #ఉండువారు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 118


Unduvaru - Somanna Gari Kavithalu Part 118 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 16/09/2025

ఉండు వారు - సోమన్న గారి కవితలు పార్ట్ 118 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ఉండు వారు...

----------------------------

నిజాయితీ ఊపిరిగా

సింహంలా ధైర్యంగా

ఉండు వారు మగధీరులు

ప్రకాశించు రవిచంద్రులు


చిరునవ్వులు బహుమతిగా

స్నేహానికి అధిపతిగా

ఉండు వారు శ్రీమంతులు

జీవితాన బహు ధన్యులు


ఆశయం ఆయుధంగా

విలువలే ఉన్నతంగా

భావించు వారు మాన్యులు

భువిని ఆదర్శవంతులు


పోరాటం ధ్యేయంగా

ఆరాటం అధికంగా

ఉండు వారు విజేతలు

నడిపించే నిజ నేతలు


ree













ఉండుము అగ్ర స్థానంలో

---------------------------------------

ప్రేమానురాగాలలో

ఆత్మవిశ్వాసంలో

ఉండుము నిండు కుండలా

చల్లని మంచు కొండలా


సాటిలేని సుగుణాల్లో

ఆధ్యాత్మిక విషయాల్లో

ఉండుము రవికిరణంలా

వికసించిన పుష్పంలా


శ్రేష్టమైన స్నేహంలో

సమైక్యత రాగంలో

ఉండుము శిఖరాగ్రంలా

దండలోని దారంలా


స్ఫూర్తినిచ్చు మాటల్లో

కీర్తితెచ్చు కార్యాల్లో

ఉండుము అజేయంగా

భూమిపై సజీవంగా

ree



















తాతయ్య పలుకులు

--------------------------------------

పిల్లలలాంటి పలుకులతో

మల్లెలలాంటి మనసులతో

అందరినిల అలరిద్దాం

ఆదర్శంగా జీవిద్దాం


చక్కనైన ప్రవర్తనతో

మేటియైన పరివర్తనతో

సూర్యునిలా ప్రకాశించాలి

చంద్రకాంతిలా మారాలి


పవిత్రమైన బంధంతో

వెలుగులీనే జ్ఞానంతో

పదిమందికి సాయపడాలి

వారి గుండెల్లో నిలవాలి


పనికొచ్చే యోచనలతో

గుర్తుండే మంచితనంతో

ఆణిముత్యమే కావాలి

మానవత్వమే మెరియాలి

ree








అమ్మ చెప్పిన మేటి మాటలు

-----------------------------------------

తట్టుకుని పరిస్థితులు

నెట్టుకుని రావాలోయ్!

ఎట్టి పరిస్థితిలోనూ

వట్టి మాటలు వద్దోయ్!


హద్దులోనే ఉంటూ

శ్రద్ధగా బ్రతకాలోయ్!

శుద్ధమైన హృదయంతో

బుద్ధిమంతుడు కావాలోయ్!


ఉద్దరించు పనులతో

ఉద్దీపన కావాలోయ్!

అద్దంలో రీతిలో

ముద్దుగా సాగాలోయ్!


మొక్కలా మనమంతా

మెట్టు మెట్టు ఎదగాలోయ్!

చక్కని తలంపులతో

చుక్కలా వెలగాలోయ్!

ree












తాతయ్య ప్రబోధ గీతి

---------------------------------

బాగుంటే తలపులు

బాగుండును బ్రతుకులు

లేకుంటే మాత్రము

అగును భవిత ఛిద్రము


స్వచ్ఛమైన హృదయము

భగవంతుని ధామము

దైవానుగ్రహంతో

పెల్లుబుకును మోదము


విలువైనది ధ్యానము

చేయాలి దినదినము

మనసంతా శాంతము

జీవితమే పదిలము


సాటిలేని జ్ఞానము

ఆర్జించుము అమితము

సమాజంలో అదే

ఇస్తుంది గౌరవము

-గద్వాల సోమన్న

Comments


bottom of page