top of page

వడి (డ) దెబ్బ

#పెనుమాకవసంత, #PenumakaVasantha, #AmmaDaPodam, #అమ్మాదాపోదాం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు



Vadi Debba - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 18/4/2024

వడి దెబ్బ - తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



ఇంటికి వచ్చిన అనిల్, భార్య ఇంట్లో కనపడక పోవటంతో దొడ్లోకి వెళ్ళాడు. అక్కడ పడివున్న భార్య మీద నీళ్లు కొట్టి లేవదీసి డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు.


"డాక్టరు.. మా ఆవిడని కాస్త చూడండి."


"ఏమైంది?" నెత్తికి తడిగుడ్డ కట్టుకున్న ఉమని చూస్తూ అన్నాడు.


“మోషన్స్, వాంతులు” అన్నాడు అనిల్ ఆదుర్దాగా.


డాక్టరు రమణ ఆవిడను పరిశీలించి "ఎప్పటినుండి ఇలా?" అని అడిగాడు.


"ఇవాళ నేను పొద్దున నేను ఆఫీసుకు వెళ్తుంటే బాగుంది. సాయంత్రం చూస్తే దొడ్లో వడియాలు పెట్టే పట్టా పక్కన సొమ్మసిల్లి పడి ఉంది."

 

"ఓ అవునా! ఇది ఈ మధ్య శరవేగంగా ఓన్లీ స్త్రీలలో పాకుతున్నది. దీని పేరు వి స్ట్రోక్. తెలుగులో వడి దెబ్బ. చూడండి అటువైపు ఎంతమంది వున్నారో?" అంటూ అక్కడ అంతకు ముందుగానే కుర్చీల్లో కూచున్న ఆడవాళ్లను చూపిస్తూ అన్నాడు. అందరూ మూలుగుతూ తలకు

స్క్రాపులు కట్టుకుని కనపడ్డారు.


"దీనికి మందులు లేవా?" అన్న అనిలుతో "ఎందుకు లేవు? ఈ మందులు వాడండి రెండురోజుల్లో తగ్గుతాయి. అక్కడ బోర్డు పెట్టాను చూసి చదవండి.”

 

భార్య ఉమతో అనిల్ "అక్కడ బోర్డు చూడు!" అంటూ చూపించాడు.


ఆ బోర్డు మీద వడి స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


ఉదయం ఆరులోపు వడియాలు పెట్టాలి. స్కార్ఫును ధరించి పెట్టండి. కోల్డ్ వాటరు పక్కన ఉంచుకుని మొహం మీద కొట్టుకోండి. కొబ్బరినీళ్ళు మూడుపూటలా తాగండి. పల్చటి మజ్జిగ తాగండి.


"నువ్వు పెట్టే వడియాలు ఏమో గాని వెయ్యి రూపాయలు వదిలింది. అదే పికిల్స్ చేసే వాళ్ళ దగ్గర ఈ డబ్బులతో వాటిని కొనుక్కుంటే సరిపోయేది. ఈసారి వడియాలు అన్నావంటే ఇంకేమీ లేదు?" అంటూ ఉమని విసుకున్నాడు అనిల్.


వి స్ట్రోక్ అంటూ టివిలో వస్తున్న న్యూసును చూస్తూ ఆశ్చర్యపోయింది ఉమ.


రెండు రాష్ట్రాల్లో వి స్ట్రోక్ కు గిలగిల లాడుతూ కింద డామ్మనీ కింద పడుతున్న స్త్రీలు..


ముఖ్యమంత్రి స్త్రీలకు వడి స్ట్రోక్ కొట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని అధికారులను హెచ్చరించారు.


అధికారులు ఫోన్లలో అందరికీ మెసేజు పంపారు. మీకు దగ్గరలోని మున్సిపాలిటీలో మీ ఆధార్ కార్డు తీసుకుని సంప్రదించండి. అమ్మవడియం పధకం కింద ఇంటికి ఒక పోలీసును ప్రతి ఇంటికి వడియాలు పెట్టటానికి వేకువనే పంపుతాము. మీరు అన్ని సిద్ధం చేస్తే మీ మేడలపై వాళ్ళు పెట్టేస్తారు. 


అమ్మ వడియం పథకం కింద వడియాలు పెట్టే కార్యక్రమం దిగ్విజయముగా పూర్తయినందుకు స్త్రీలందరూ తమ ఓట్లు వేసి ప్రభుత్వాన్ని గెలిపించారు.


కొత్త ప్రభుత్వమును స్త్రీలు ఇంకా కొన్ని కోరికలు కోరారు.

"మేము ఎక్కవ మంది మీకు అమ్మవడియం పథకం కింద ఓట్లు వేసి గెలిపించాం. ఇపుడు పచ్చళ్ళు, ఊర మిరపకాయలు కూడా మీ అధికారులు పెట్టేలా చూడండి. అలా అయితే మేము ఈసారి మీ ప్రభుత్వాన్ని మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపిస్తాం."


ముఖ్యమంత్రి మీటింగ్ ఏర్పాటు చేసాడు. 


"ఏం చేద్దాం? మీరు సిద్ధమేనా?"


అధికారులు "మా వల్ల కాదు సార్. మేము ఉద్యోగాలకు రిజైన్లు చేస్తాం. ఎందుకంటే పోయిన సారి ఇంటింటికి వడియం పెట్టే పథకంతో మాకు వాచిపోయింది.


మా పెళ్ళాలు బయట జనాలకు బాగా వడియాలు పెడతారు. మాకు ఎందుకు పెట్టరు? అని మా ఇంట్లో కూడా పెట్టించారు. అపుడు మాకు వడి దెబ్బ తగిలింది. ఇపుడు ఈ పచ్చళ్ళ పథకంతో మా నడ్డి విరుగుతుంది. బయటా పెట్టీ ఇంట్లో పెట్టీ మా వల్ల కాదు సార్! ఇంకా కొంత మంది ఆడవాళ్లు వడియాలు సరిగా రాకపోతే మళ్ళీ మళ్ళీ పెట్టించారు బతికుంటే వెంట్రుకలకు బూరలు అమ్ముతాం" అంటూ అధికారులందరూ రిజైనులు చేశారు.


ముఖ్యమంత్రి ఇంకా ముప్పయి ఏళ్ళు తమ ప్రభుత్వం సాగాలని అమ్మపచ్చళ్ళు అనే పధకం ఏర్పాటు చేసాడు. దానికోసం స్త్రీలను ఉద్యోగంలోకి తీసుకోవటంమొదలు పెట్టాడు. ఇంతకీ ఆ స్త్రీలూ రిజైన్స్ చేసిన సదరు అధికార్ల భార్యలు.


ఈ అధికార్లు వాళ్ళ భార్యలకు అవకాయకు మామిడికాయలు కొట్టిపెడుతూ వాటికి డబ్బులు కలెక్ట్ చేస్తూ హాయిగా ఉన్నారు.


చిన్న ‘వడి’ దెబ్బకు ఎంత పురాణం నడిచింది చూసారుగా?


సమాప్తం


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


1 Comment


@జయసుధకోసూరి

•12 hours ago

మీ వడిదెబ్బ కథ చాలా బావుందక్కా 😂

Like
bottom of page