top of page

వందనం అభివందనం

Updated: Dec 16, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #VandanamAbhivandanam, #వందనంఅభివందనం


Vandanam Abhivandanam - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 02/12/2024

వందనం అభివందనం - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


కడుపు నింపు రైతులకు

సరిహద్దు సైనికులకు

వందనం అభివందనం

ఇల జన్మ దాతలకు


ప్రాణమిచ్చు మిత్రులకు

ఆపదలో ఆప్తులకు

వందనం అభివందనం

విద్య నేర్పు గురువులకు


పారిశుద్ధ్య కార్మికులకు

మహిలో మహనీయులకు

వందనం అభివందనం

ఘన ఆదర్శ మూర్తులకు


ఫలాలిచ్చు తరువులకు

గొంతు తడుపు చెరువులకు

వందనం అభివందనం

పంట పండు పొలములకు


నింగిని సూర్యచంద్రులకు

సాయపడు చేతులకు

వందనం అభివందనం

ప్రేమ పంచు మనసులకు


ఇంటిలోని వనితలకు

మింటిలోని తారలకు

వందనం అభివందనం

కథలు చెప్పు తాతలకు


వైద్యం చేయు వైద్యులకు

సేవ చేయు సేవకులకు

వందనం అభివందనం

నడిపించే నాయకులకు


బాధ్యత మోయు తండ్రికి

త్యాగమూర్తి తల్లికి

వందనం అభివందనం

చల్లగ చూచు దేవునికి


-గద్వాల సోమన్న



Comments


bottom of page