top of page

వర్షం కురిసిన రాత్రి

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)

'Varsham Kurisinai' Rathri - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 09/11/2023

'వర్షం కురిసిన రాత్రి' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఆకాశం మబ్బు పట్టి..చల్లటి గాలి వీస్తోంది. ప్రతాప్ పని మీద ఊరి చివర తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళి..తిరిగి వస్తున్నాడు. సగం దారిలో వర్షం మొదలైంది. తన కార్ ను మెల్లగా నడుపుతున్నాడు. కొంతసేపటికి కార్ ఆగిపోయింది. చుట్టుపక్కల చూసాడు. అల్లంత దూరాన..ఒక ఇల్లు కనిపించింది. చుట్టుపక్కల ఆ ఒక్క ఇల్లు మాత్రమే ఉంది.


ఇంటి మేడ మీద గదిలో లైట్ వెలగడం చూసి..ఎవరో ఉన్నారని కన్ఫర్మ్‌ చేసుకుని..ఆ ఇంటి వైపు అడుగులు వేసాడు. డోర్ బెల్ రింగ్ చేసాడు. లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది.


"నా కార్ ఆగిపోయింది..కొంచం వర్షం తగ్గేవరకూ షెల్టర్ ఇస్తారా?"

"ఓకే..ఇస్తాను..కానీ ఒకటే కండిషన్..మేడ మీద కు మాత్రం రాకూడదు.."

"అలాగే!"

"లోపలికి రండి!"


లోపలికి వచ్చిన ప్రతాప్ కి టవల్ ఇచ్చి సోఫా లో కూర్చోమని చెప్పింది. ఆ అమ్మాయి ని చూస్తే, ఒక పాతిక ఏళ్ళు ఉంటాయి..చాలా అందంగా ఉందని అనుకున్నాడు ప్రతాప్.


"ఇంట్లో ఎవరెవరు ఉంటారండి..?"

"నేను మాత్రమే ఉంటాను"

"మీ పేరు తెలుసుకోవచ్చా?"

"మోహిని!..అని పెద్ద గొంతు తో చెప్పింది"

"మీ పేరు చెప్పలేదు మరి!"

"ప్రతాప్..మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తుంటే, కార్ ఆగిపోయింది.."

"ఇక్కడ ఒంటరిగా ఉండడానికి భయం లేదా?"

"నన్ను చూసి, అందరూ భయపడాలి..నాకెందుకు భయం" అంది మోహిని

"మీరు ఏం చేస్తూ ఉంటారు?" అడిగాడు ప్రతాప్

"అందరినీ భయపెడుతూ ఉంటాను.."

"భలే కామెడీ చేస్తారు మీరు!"

"నేను కమెడియన్ కాదు..భయపెట్టడమే నా పని" అంది మోహిని


"వర్షం తగ్గేట్టుగా లేదు..డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంది..తినేసి పడుకోండి..రేపు మార్నింగ్ వెళ్ళండి"

"అలాగే!మో..హి..ని..గా..రు"


తెల్లవారుజామున ..మోహిని మేడ మీద రూమ్ లో లైట్ వేసి ఉండడం చూసి..కుతూహలం ఆపుకోలేక, మేడ మీద రూమ్ దగ్గరకి వెళ్ళి.. కిటికీ లోంచి తొంగి చూసాడు ప్రతాప్.."


మోహిని తెల్లటి డ్రెస్ వేసుకుని..నోట్లో రెండు కోర పళ్ళ తో..ఒక గ్లాస్ లో రక్తం తాగుతూ.. మధ్య మధ్య లో అరుస్తూ..భయంకరంగా కనిపించింది. ఒక్కసారి షాక్ అయ్యాడు ప్రతాప్. మోహిని చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. తనని చూసే అందరూ భయపడాలి అంటే ఏమిటో అనుకున్నాను! ఇదా? ఈ అమ్మాయి ఒక దెయ్యం లాగా ఉంది..వర్షం లో తడిసినా పర్వాలేదు..బతికుంటే చాలు అనుకుని, వెనకకు తిరిగి చూడకుండా..అక్కడ నుంచి పారిపోయాడు..మెయిన్ రోడ్ రీచ్ అయ్యేవరకు ఎక్కడా ఆగలేదు..


ఈలోపు మోహిని కిందకు వచ్చింది. ప్రతాప్ కోసం అంతా చూసింది..కానీ ఎక్కడా అతని జాడ లేదు..ఈలోపు ఫోన్ రింగ్ అయింది..


"హలో...మోహిని..ఎలా ఉన్నావు?"

"బాగానే ఉన్నాను అమ్మా!"

"ఏంటి బిజీ గా ఉన్నావా?"

"ఏమీ లేదు..రేపు నా ఉద్యోగం లో మొదటి రోజు..కొత్త కాస్ట్యూమ్స్ ఇచ్చారు..ట్రై చేస్తున్నాను..అని వీడియో కాల్ ఆన్ చేసింది.."

"మీ ఫ్రెండ్ ఏది?"

"అది ఊరు వెళ్ళింది..నేను మాత్రమే ఉన్నాను"

"ఏమిటే ఆ దెయ్యం వేషం..భయం వెయ్యట్లేదా?"

"దెయ్యానికి భయం వేస్తుందా? చెప్పు!..అదే కదా! నా ఉద్యోగం"

"భయపెట్టే ఉద్యోగమా?"

"అవును..ఎగ్జిబిషన్ లో చీకటి గదిలోకి వచ్చే జనాలని భయపెట్టాలి.."

"ఆ పెదాల కేమిటి ఎర్రగా.."

"అదా! ఇందాక జ్యూస్ తాగాను..అంతే!"

"ఏమిటో ఈ ఉద్యోగాలు..చెబితే వినదు..వెర్రి పిల్ల!"


*****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ



78 views0 comments
bottom of page