వెన్నెల నవ్వింది - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna

- Dec 17, 2025
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Vennela Navvindi, #వెన్నెల నవ్వింది, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న "వెన్నెల నవ్వింది" పుస్తకావిష్కరణ ఎమ్మిగనూరులో
Vennela Navvindi - Book Unveiling ceremony At Emmiganur - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 17/12/2025
వెన్నెల నవ్వింది - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జడ్పీ హైస్కూల్లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు శ్రీ గద్వాల సోమన్న విరచిత 85వ పుస్తకం "వెన్నెల నవ్వింది" పుస్తకావిష్కరణ 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా, వి. హెచ్ పి యస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విచ్చేసిన కర్నూలు డి. యస్పీ (స్పెషల్ ఫోర్స్ )మహబూబ్ బాషా, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ జి. నారాయణ స్వామి, వి. హెచ్. పి. యస్ సలహాదారులు పందికోన ఈరన్న,ఎమ్మిగనూరు నియోజకవర్గం అధ్యక్షులు కె. రామాంజనేయులు మరియు ప్రముఖుల చేతుల మీద శ్రీ మాచాని సోమప్ప మెమోరియల్ హాల్, ఎమ్మిగనూరులో జరిగిన సభలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యం. సి గిడ్డయ్య, ముగతి ప్రతాప్, దివ్యాంగులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. అతి తక్కువ సమయంలో 85 పుస్తకాలు వ్రాసి ప్రచురించిన బహు గ్రంథకర్త, కృతికర్త గద్వాల సోమన్నను శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు ఉపాధ్యాయులందరూ అభినందించారు.
-గద్వాల సోమన్న






















Comments