విచలితుడి విచిత్రమైన రోజు

Vichalithudi Vichitramaina Roju - Telugu Comedy Story | Kulakarni Pavana Dattasai
విచలితుడి విచిత్రమైన రోజు - తెలుగు హాస్య కథ | కులకర్ణి పవన దత్తసాయి
Published in manatelugukathalu.com on 18/10/2026
విచలితుడి విచిత్రమైన రోజు ఒక సరదా తెలుగు హాస్య కథ. చిన్న చిన్న విషయాలకే అతిగా సంతోషపడటం, వెంటనే నిరాశ చెందటం వల్ల ఎదురయ్యే విచిత్రమైన సంఘటనల ద్వారా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ వినోదాత్మకంగా తెలియజేస్తుంది.
విచలితుడు అనే ఒకడు ఉండేవాడు. దేనికైనా త్వరగా సంతోషపడతాడు; అంతే తొందరగా నిరాశ చెందుతాడు.
అతని మనసు 'ఎల్ నినో' (El Niño) ప్రభావానికి లోనైన వాతావరణం లాంటిది... ఒక్క నిమిషంలో ఎండ, మరొక నిమిషంలో వర్షం!
ఒకరోజు విచలితుడు తన బైక్‌పై వెళ్తుండగా, ఓ అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది. మనసులో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఆమె దిగేటప్పుడు, "థాంక్స్ అన్నయ్యా!" అని చెప్పి వెళ్లిపోయింది.
అంతే! ఆనందం ఆవిరై, కోపం మొదలైంది.
"అన్నయ్యా?!" అని గొణుక్కుంటూ కోపంలో బండి నడిపాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుద్దేశాడు.
అదృష్టమో దురదృష్టమో అది ఒక ఆంబులెన్స్! విచలితుడికి చికిత్స అవసరమవడంతో, అతడిని అదే ఆంబులెన్స్‌లో ఎక్కించుకుని ఆసుపత్రికి బయలుదేరారు.
కొంతదూరం వెళ్లగానే ఆంబులెన్స్ ఆగిపోయింది... పెట్రోల్ అయిపోయింది! అయితే అది పెట్రోల్ బంక్ ముందే ఆగడంతో డ్రైవర్‌కు ప్రాణం లేచివచ్చింది.
"హమ్మయ్య, పక్కనే బంక్ ఉంది!" అంటూ పెట్రోల్ తెచ్చేందుకు వెళ్లాడు. కానీ అక్కడ "ఇరాన్‌తో యుద్ధం కారణంగా పెట్రోల్ నిల్వలు లేవు" అనే బోర్డు కనిపించింది. ఎలాగోలా డ్రైవర్ బ్లాక్‌లో పెట్రోల్ సంపాదించి ట్యాంకులో పోశాడు.
"ఇక బయలుదేరొచ్చు!" అని అందరూ అనుకునేలోపే ఆంబులెన్స్ ఎంతకీ స్టార్ట్ కాలేదు. పరిశీలించగా, కంగారులో డ్రైవర్ పెట్రోల్‌కు బదులు డీజిల్ పోసినట్టు తెలిసింది.
"ఇంక నేను ఈరోజు ఆసుపత్రికి వెళ్లేలా లేను," అని విచలితుడు నిట్టూర్చాడు.
అంతలో కొంతమంది యువకులు వచ్చి, "మేము ఆంబులెన్స్‌ను తోస్తాం!" అంటూ కొంతదూరం తోశారు.
అంతలో ఎవరో, "పక్క వీధిలో శ్రీలీల షాప్ ఓపెనింగ్‌కి వస్తోందట!" అని అరిచారు. యువకులంతా ఆంబులెన్స్‌ను రోడ్డు మధ్యలో వదిలేసి అక్కడికి పరుగెత్తారు.
ఆంబులెన్స్‌లో ఉన్న విచలితుడు నీరసంగా కళ్లు మూసుకున్నాడు. కాసేపటికి ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ ట్రక్‌తో వచ్చారు.
"పోనీలే, వీళ్లైనా ఆసుపత్రికి తీసుకెళ్తారేమో," అని ఆశపడ్డాడు. కానీ వాళ్లు ఆంబులెన్స్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారని తెలిసి, బాధపడటానికి కూడా ఓపిక లేక అలాగే పడుకున్నాడు.
విషయం తెలుసుకున్న విచలితుడి లవర్ (Lover) పూచీకత్తు (జామీను) ఇచ్చి అతడిని విడిపించింది.
"లవర్ ఉండటం ఎంత ఉపయోగమో ఇప్పుడు అర్థమైంది!" అని విచలితుడు ఆనందంగా అన్నాడు.
అయితే వెంటనే ఆమెకు కళ్లు తిరిగి కిందపడిపోయింది. విచలితుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు చేసిన డాక్టర్, "మీ లవర్ యొక్క లివర్ (Liver) బాగా దెబ్బతింది, వెంటనే చికిత్స మొదలుపెట్టాలి," అన్నాడు.
"అయ్యో! నా వల్లేనా?" అని విచలితుడు కంగారుపడ్డాడు.
డాక్టర్ నవ్వుతూ, "మీ వల్ల కాదు. ఆమె చాలాకాలంగా మందులు వాడుతోంది, కానీ పరీక్షలు చేయించుకోలేదు. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే చికిత్సతో కోలుకునే అవకాశం ఉంది," అని వివరించాడు.
విచలితుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఈసారి మాత్రం అతను అతిగా సంతోషపడలేదు, వెంటనే నిరాశపడనూ లేదు. డాక్టర్ చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నాడు. అవసరమైన పరీక్షలు, చికిత్స కోసం ప్రేయసికి తోడుగా నిలిచాడు.
ఇంటికి వెళ్లేటప్పుడు ఆమె నవ్వుతూ, "నువ్వు ఈరోజు చాలా మారిపోయావు," అంది.
"అవును," అన్నాడు విచలితుడు. "ఇకపై ఎవరు 'అన్నయ్య' అన్నా కోపపడను... ముందు రోడ్డు చూసుకుంటాను!"
ఆ మాటకు ఇద్దరూ నవ్వుకున్నారు.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
కులకర్ణి పవన దత్తసాయి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: కులకర్ణి పవన దత్తసాయి
నమస్కారం.. నేను కులకర్ణి పవన దత్తసాయి.
వృత్తి రీత్యా AG office Hyderabad లో auditor గా పని చేస్తున్నాను. ప్రవృత్తి రీత్యా సాహితీ ప్రియుడిని.








Comments