top of page
Original.png

విధిలీల

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Vidhi Leela, #విధిలీల, #TeluguStories, #తెలుగుకథలు


Vidhi Leela - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 01/02/2026

విధిలీల - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

రాత్రి పది...ఫోన్ మోగింది.

"హలో ఎవరు ?"

"నేను భాస్కర్"

"ఎలా ఉన్నారు?"

"బాగానే ఉన్నాను కానీ..."

"కానీ..?"

"వారం నుంచి ఫీవర్...హాస్పిటల్ లో చూపించాలి. అయినా ఏం పర్వాలేదు తగ్గిపోతుంది...కంగారు పడకు"

"టేక్ కేర్ బావగారు!" 


మర్నాడు ఉదయం...


"మేము ఫేమస్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజు ఉదయం భాస్కర్ గారు మా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అతనికి సీరియస్ గా ఉంది. మీరు అతని ఫ్రెండ్ కాబట్టి, కాల్ లిస్టు లో మీ నెంబర్ చూసి చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ కి చెప్పండి. డాక్టర్ గారు మాట్లాడాలి"


"నేను భాస్కర్ ఫ్యామిలీ కి చెబుతాను...వాళ్ళు వస్తారు"


"హలో భావన గారా! భాస్కర్ గారు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. మీరు వెంటనే వెళ్ళండి. మీ ఫోన్ కలవకపోతే, నాకు కాల్ చేసారు" అన్నాడు రవి 


భావన వెంటనే హాస్పిటల్ కి వెళ్ళింది అమ్మాయిని తీసుకుని. 


"హలో డాక్టర్! మా ఆయనకి ఏమైంది?"


"కంగారు పడకుండా వినండి. మీ ఆయనకి చాలా సీరియస్ గా ఉంది..ఆయనకి షుగర్ ఎక్కువ ఉంది. బీపీ కూడా చాలా ఎక్కువ ఉంది. కంట్రోల్ అయితే గానీ, సర్జరీ చెయ్యలేము..సర్జరీ చేసినా, గ్యారంటీ లేదు. దీనికి మీరు సంతకం పెట్టండి"


"అయ్యో..! సడన్ గా ఈయనకి ఏమైంది..?"

"సడన్ గా కాదు..స్కానింగ్ చేస్తే, ఒంట్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది..ముందే హాస్పిటల్ కి వచ్చి ఉంటె, బాగుండేది"


వెంటనే తన అన్నయ్య రఘు కి కాల్ చేసింది...


"హలో అన్నయ్యా.! బావగారికి బాగోలేదు తొందరగా రా.."


"నిన్న నైట్ మాట్లాడాను...నో ప్రాబ్లం అన్నారు"


"ఏమో మరి!"


"నువ్వు కూడా ఆయనతోపాటే చెన్నై లో ఉండి...బావగారిని జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేది. ఫ్యామిలీ కోసం ఎప్పుడూ అప్ అండ్ డౌన్ చెయ్యడం... తిండి, నిద్ర సరిగ్గా లేక, డాక్టర్కి చూపించుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పు?"


"నాదే తప్పు అన్నయ్యా..! కానీ ఇప్పుడు ఏం చేస్తాను?"


"దేవుడు ఎలా రాస్తే, అలాగే జరుగుతుంది..ధైర్యంగా ఉండు. సర్జరీ అయిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అప్పుడైనా నువ్వు బావగారితో  కలిసి ఉండు"


"హలో కమల్! మా ఆయనకు సీరియస్ గా ఉంది"


కమల్ భాస్కర్కి ఫ్రెండ్.


"పది రోజుల కిందట...మెయిన్ రోడ్ మీద కలిసాడు. ఇద్దరమూ కాఫీ కూడా తాగాము. నాకు షుగర్ ౩౦౦ ఉంది తెలుసా?" అని అన్నాడు 

"షాక్ అయ్యాను. జాగ్రత్త పడాలి..మందులు వేసుకోవాలి.." అని చెప్పాను 

"నాకన్నా ఎక్కువ షుగర్ ఉన్నవాళ్లు ఎందరో ఉన్నారు...నాకేం కాదు. నాకు ఇంకా యాభై...నాకేం కాదు" అని చెప్పి వెళ్ళిపోయాడు

"ఏమో కమల్...! ఈ రోజు ఉదయం సడన్ గా బాగోలేదంటే, హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు"

"అయ్యో..! నేను వస్తున్నాను"


బంధువులు అందరూ హాస్పిటల్ కు చేరుకున్నారు.


"భాస్కర్ గారు ఇక లేదు..సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని హాస్పిటల్ డాక్టర్ బయటకు వచ్చి చెప్పాడు"


"అయ్యో...!" అంటూ షాక్ లో భావన బీపీ డౌన్ అయి పడిపోయింది అంతే...రెండు గంటల తర్వాత మళ్ళీ భావనకు స్పృహ వచ్చింది. ఆమెను కంట్రోల్ చెయ్యడము ఎవరికీ సాధ్యం కాలేదు. ఆమె బాధ ఇంతా అంతా కాదు. మా అన్నయ్య చెప్పింది కరెక్ట్. ఆయనతో నేను ఉండి, జాగ్త్రతగా చూసుకోవల్సింది. ఉద్యోగం కోసం ఎక్కడో చెన్నై లో ఆయనని వదిలేసి నేను ఇక్కడ హైదరాబాద్ ఉండడం,  ప్రేమగా చూసుకునే వారు లేక ఆరోగ్యం నిర్లక్ష్యం చేసేసారు..అంతా నాదే తప్పు" అని చేతులతో తలను గట్టిగ కొట్టుకుంది.  చుట్టూ ఉన్నవారు ఆమెను ఆపారు.


"జరగాల్సింది జరిగిపోయింది...ఇప్పుడు చేసేదేం ఉంది...? అమ్మాయి కోసం నువ్వు ధైర్యంగా ఉండాలి" అని అందరూ ధైర్యం చెప్పారు.


రెండు వారాలు గడిచాయి..


"అన్నయ్యా...! బావగారి చెన్నై లో ఉన్న రూమ్ కి వెళ్లి, ఆయన సామానులు తేవాలి"


"అలాగే...అడ్రస్ ఇవ్వు భావన"


చెన్నై లో భాస్కర్ రూమ్ కి వెళ్ళిన రఘుకి సామానులతో పాటు, ఒక లెటర్ దొరికింది. అందులో...


"హలో రఘు..! నువ్వు ఏదో రోజు ఇక్కడకు వస్తావని, ఈ లెటర్ చదువుతావని నాకు తెలుసు.."


ఉత్తరం ఇంకా ఆత్రంగా చదవడం కొనసాగించాడు రఘు... 


"గత వారం రోజుల నుంచి తల నొప్పి రావడం, డాక్టర్ నన్ను టెస్ట్ చేయించుకోమన్నారు. కానీ నాకు ఇష్టం లేదు..ఈ జీవితమే నాకు ఇష్టం లేదు. మీ చెల్లెలు నా మాట వినదు. అమ్మాయి నా మాట అసలే వినదు. ఎప్పుడూ మీ చెల్లితో నాకు గొడవలే. తన మాటే నెగ్గాలి అనుకుంటుంది. 


నేను షుగర్ కి, బీపీకి కూడా మందులు వేసుకోవడం మానేస్తున్నాను. ఎంత కాలం బతికితే అంతే! నా పేరు మీద కోట్ల డబ్బు ఇన్సూరెన్స్ చేసి ఉంచాను...భావనకి ఉపయోగపడుతుంది. ఆమెకు డబ్బే కావాలి. ఈ జీవితం ఇక బతకడం దండగ. ఏదో రోజు నా అనారోగ్యమే నన్ను తినేస్తుందని నాకు తెలుసు. అందుకే, ఈ లెటర్ ముందే రాసి ఉంచాను...నన్ను క్షమించు!"


***********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page