top of page

వీడిన మబ్బులు


'Vidina Mabbulu' New Telugu Story


Written By Kidala Sivakrishna


(ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

దశరథ్ కు ఉమ అంటే చాలా ఇష్టం, ఉమకు దశరథ్ అంటే అంతగా ప్రేమ లేదనే చెప్పాలి, ఎందుకంటే ఉమ కళ్యాణ్ ని ప్రేమిస్తుంది కాబట్టి.


అయితే ఉన్న విషయం చెప్పకుండా ఉమ దశరథ్ తో ప్రతి రోజు చరవాణిలో మాట్లాడుతుంది, చరవాణిలో వర్తమానం పంపుతుంది. ఈ విధంగా ఉమ దశరథ్ తో మాట్లాడటం మరియు నమ్మించి మోసం చేయ తలచింది.


ఈ విషయానంతటిని శ్యామ్ ఉమ ద్వారానే తెలుసుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న శ్యామ్ “నీవెందుకు ఇంకా దశరథ్ జీవితంతో ఆడుకుంటావు, నిజం చెప్పి దశరథ్ జీవితం నుంచి తప్పుకోవచ్చును కదా?” అన్నాడు.


అప్పుడు ఉమ “నేను దశరథ్ కు నిజం చెప్పను. ఎందుకంటే వాడు నా వెంట కుక్కలా తిరుగుతున్నాడు. నా అవసరం తీరాక వాడిని వదిలేసి వెళ్ళిపోతాను” అని చెప్పింది.


ఈ విషయాన్ని శ్యామ్ దశరథ్ కు పూస గుచ్చినట్లు చెప్పినా కూడా ఉమ మైకంలో ఉన్న దశరథ్, శ్యామ్ మాటలను నమ్మలేదు. అంతే కాకుండా శ్యామ్ ని దుర్బాషలాడాడు. అయినప్పటికీ శ్యామ్ “నేను చెప్పేది నమ్మకపోయినా సరే.. కానీ నీవు ఉమ చరవాణిని మొత్తంగా పరిశీలించి చూస్తే అక్కడ నీకు నేను చెప్పింది నిజమేనని తెలుస్తుంది. అప్పుడు నాతో మాట్లాడు” అంటూ శ్యామ్ వెళ్ళిపోయాడు.


వెంటనే దశరథ్ ఉమను పిలిపించి జరిగిన సంఘటనను గురించి చర్చలు జరిపాడు. ఆ సమయంలో ఉమ శ్యామ్ మీద దూషణలు చేస్తూ దశరథ్ ను మాయ చేయసాగింది. అప్పుడు ఒక్క సారిగా దశరథ్ “నీ చరవాణిని ఇటు ఇవ్వు” అంటూ తన చేతికి తీసుకున్నాడు.


తీసుకున్న వెంటనే కళ్యాణ్ తో ఉమ జరిపిన వర్తమానాలు చూసి దశరథ్ కృంగిపోసాగాడు.


“నీమీద నమ్మకంతో నా ప్రాణ స్నేహితుడిని కూడా దూరం చేసుకున్నాను” అంటూ కమ్ముకుంటున్న చీకటి లోకంలో ఒంటరిగా మిగిలిపోయాడు.


ఈ విషయాన్ని తెలుసుకున్న శ్యామ్ వెంటనే దశరథ్ దగ్గరకు వచ్చి “నీకు అండగా నేనున్నాను” అంటూ భరోసాని ఇవ్వడంతో వీడిన మబ్బుల తర్వాత వచ్చే వర్షంలా ఆనంద భాష్పాలు కార్చాడు దశరథ్.



"సర్వే జనా సుఖినోభవంతు"

కిడాల శివకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


Podcast Link






Twitter Link


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


30/10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ నవతరం రచయిత బిరుదు పొందారు.





42 views0 comments
bottom of page