top of page

విలువెక్కడ గురువా..



 'Viluvekkada Guruva' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 04/09/2024

'విలువెక్కడ గురువా..' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఈరోజు నుండి లెక్కలోకి తీసుకుంటే.. సమాజంలో ఎన్నో నేరపూరితమైన సంఘటనలు జరుగుతునే ఉంటున్నాయి. అవి ముఖ్యంగా పదిహేనేళ్ల క్రితం నుండి మరీ ఎక్కువ. అంటే ఇంచుమించు రెండు దశాబ్దాల నుండి క్రమక్రమంగా ఈ నేరాలు పెరుగుతున్నాయి. వీటి తీవ్రం ఎలా ఉన్నాయంటే.. దేశ సరిహద్దుల్లో సంచరంచే ఉగ్రవాదులు కన్నా దేశంలో ఉంటు యదేచ్చిగా నేరాలు చేసే వాళ్ళే ప్రమాదం అన్నట్లు.. 


హింసాత్మక నేరాల్లో ముఖ్యంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, దాడులు, సైబర్ నేరాలు ఇలాంటివి దేశంలో రోజుకి వందల సంఖ్యలో జరుగుతున్నాయి. ఏంటీ ఇలాంటి మనుషులు.. అనుకునేంతగా తయారయింది ఈ సమాజం. 


 ఒకప్పుడు అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులు ‘చదువుకుంటే గొప్ప సమాజాన్ని నిర్మించగలం’ అని చెప్పారు. నేడు పాఠశాలకు వెళ్ళని పిల్లవాడు లేడు. అయినా.. !


వాళ్ళు చదువుకు వెళ్తున్నారో, సంబరాలకు వెళ్తున్నారో చదువు చెప్పే ఉపాధ్యాయులకే తెలుస్తుంది. ఎందుకంటే.. ! చదువుకోవటానికి వచ్చే పిల్లలు నిజంగా చదువుతున్నారా.. ? చదువు చెప్పే ఉపాధ్యాయులను గౌరవిస్తున్నారా.. ? అనేది వారికే తెలుస్తుంది. సమాజంలో గౌరవం లేకపోయినా పోరంబోకులా తిరగ్గలం. కానీ.. ! పిల్లలు గౌరవించకుండా, భయపడకుండా కేవలం పాఠాలు చెబుతు పిల్లలను గొప్పవాళ్ళని చేయటం దాదాపు అసాధ్యం. 


ఏ ఇంట్లో అయితే ఆడది కన్నీరు పెడుతుందో ఆ ఇల్లు వల్లకాడుతో సమానం అంటారు. మరీ.. ! ఏ పాఠశాల, ఏ కళాశాలలో ఉపాధ్యాయులు అగౌరవించబడతారో.. అది కూడా వల్లకాడుతో సమానం ఎందుకు కాదు.. ? 


తల్లిదండ్రులు కూడా ఒక మాటున ఆలోచించాలి. కొట్టకుండా, తిట్టకుండా పిల్లలను మార్చగలమా.. ? దారిలోకి తీసుకురాగలమా.. ? అనే విషయం వారికి బాగా తెలిసి ఉంటుంది. ఎలా ఆంటే కేవలం సెలవు రోజు అది కూడా మహా అయితే ఇంట్లో ఇద్దరు పిల్లల అల్లరిని భరించలేక ఎప్పుడు స్కూల్ పెడతారా.. ! అని ఎదురుచూస్తు పిల్లలను ఆడిపోసుకుంటారు. అలాంటిది వందలమంది పిల్లలను వారు చేసే అల్లరిని ఓర్పుతో, సహనంతో, ప్రేమతో భరిస్తూ చదువు చెప్పే ఉపాధ్యాయులను పిల్లలకు ఒక్క దెబ్బ వేశారంటే తిట్టడానికి, కొట్టడానికి మీరెవరంటూ పాఠశాలకు మంది మార్చలంతో వచ్చేస్తున్నారు. ఇది సమంజసమా.. ? 


పిల్లలను కొడితే హడావుడి చేసే తల్లిదండ్రులు కనీసం పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కి అయినా వస్తారా.. రారు. సరికదా.. ఆ రోజు పాఠశాలలో ఏమీ చెప్పరు కదా.. పాఠశాలకు వెళ్ళ వద్దులే అనే ప్రభుద్దులు కూడా ఉన్నారు. ఎక్కడో ఒకరిద్దరు ఉపాధ్యాయులు చేసే తప్పులను మొత్తం ఉపాధ్యాయులకే ఆపాదించటం ఏ మాత్రం హర్షించదగినది కాదు. సారొస్తే రానీ మనకేంటీ.. ? అనేటట్లు ఈరోజు పిల్లలు తయారయ్యారు. పిల్లలు చదవకపోయినా పర్వాలేదు. కానీ కొట్టకండి, తిట్టకండి ఇది కొందరు పేరెంట్స్ డిమాండ్. కొట్టకుండా.. , కనీసం మందలించకుండా.. ప్రేమతో సాగనంపాలంటే ఎలా.. ? అదేదో ఇంట్లోనే చేయోచ్చు కదా.. 


పిల్లలను దండించటం తప్పా.. ? తప్పే అయితే రెండు దశాబ్దాల ముందు ఇలాంటి తప్పు ఎందుకు లేదు.. ?


ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను వారి గురువులు దండించలేదా.. ? దండించకపోతే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఊరికే అబద్దం చెబుతారా.. ?


రాముడంతటి వాడిని గురువు వశిష్ఠుడు దండించలేదా.. ? 


నవసమాజ నిర్మూలకు రేపటి పిల్లలను భవిష్యత్ వారధిగా చెప్పుకునే సమాజమా సిగ్గుపడాలి. గురువంటే భయం లేదు, గౌరవం లేదు ఇంకా చదువు, సంస్కారం ఎట్లా అబ్బుతాయి.. ?


ప్రాధమిక విద్య పూర్తవకముందే పిల్లల్లో రకరకాల స్టైల్స్, మానసిక స్థితిలో మార్పులు వస్తున్నాయంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణం కాదా.. ? 


తమ పిల్లలు, రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ, నేరాలు చేస్తు జైలుపాలవుతుంటే అప్పుడు తెగ బాధపడుతుంటారు. బడిలో భయం ఉంటే పిల్లల నడవడిక ఖచ్చితంగా మారుతుంది. ఒకప్పుడు ఉపాధ్యాయులు ఎంతగా దండించేవాళ్ళు. ఏ రోజు కూడా ఉపాధ్యాయులను అగౌరవపర్చలేదు అప్పటి పిల్లలు. ఇంకా ఆ విషయం ఇంట్లో చెప్పేవారు కాదు కూడా. 


పాఠశాలకు వచ్చి తరగతి గదిలో కూడా తమకు ఇష్టమొచ్చినట్లు తాము చేస్తామంటుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉపాధ్యాయులు ఉండిపోతున్నారు. గౌరవం లేని బందువుల ఇంట్లో నువ్వు అయితే మాత్రం ఒక్క రోజైనా ఉండగలవా.. ? పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇది వర్తించదా.. ? అయినా వాళ్ళు ఎంతో చక్కగా పాఠాలు బోధిస్తారు. 


పిల్లల్లో మార్పు తీసుకొచ్చి వారిని సరైన దారిలో పెట్టడం కేవలం ఉపాద్యాయులతోనే సాధ్యం. సమాజంలో ఉపాధ్యాయులు గౌరవించబడితే నూతన సమాజం ఏర్పడుతుంది. ఆ నూతన సమాజంలో తమ తప్పులను తామే తెలుసుకునే మనుషులు అవిర్భవిస్తారు. నేరాలే లేని నవ శకం ఆ నూతన సమాజం. 


మనకు దేవుడు కనిపిస్తాడో లేదో కానీ, కనిపించే దైవం గురువే. నిజంగా ప్రతి మనిషికి అన్ని తెలిసినట్లు అయితే.. పిల్లలకు బడికి పంపటం ఎందుకు.. ? వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు కదా.. ! గురువు అవసరమే లేనప్పుడు ఈ విద్యావ్యవస్థలు మనకెందుకు.. ? గురువు అవసరం మనకు ఉన్నప్పుడు వారికి గౌరవించటంలో మనకు వచ్చే అభ్యంతరం ఏమిటి.. ? 


ఓ గురువా.. !. నీకు విలువెక్కడ.. ? దండించకుండా గొప్ప వ్యక్తులు ఎలా తయారవుతారు.. ?


ఒక విలన్ ఉంటేనే ఇంకొకడు హీరోగా పిలవబడుతున్నాడు. అలాగే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడంటే అతడి వెనుక గురువు ఖచ్చితంగా ఉంటాడు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. మనమంతా చదువుల్లో రాణిద్దాం, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉందాం. సానుకూల ఆలోచనలు చేద్దాం. గురువును గౌరవించని వారెవరు ఇతరులను గౌరవించలేరు. తరగతిలో నాలుగు గోడల మధ్యనే దేశ భవిష్యత్, పిల్లల భవిష్యత్ ఉందని గ్రహించాలి. 


గురు బ్రహ్మ, గురు విష్ణు

గురు దేవో మహేశ్వరహ

గురు సాక్షాత్ పరబ్రహ్మ

తస్మై శ్రీ గురవే నమః

*** *** *** *** *** *** ***


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


31 views0 comments

Comments


bottom of page