top of page
Writer's picturePitta Govinda Rao

ఓటరు గెలుపు


'Voter Gelupu' New Telugu Story

Written By Pitta Gopi


'ఓటరు గెలుపు' తెలుగు కథ


రచన: పిట్ట గోపి



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


పూర్వం ఏ పని అవ్వాలన్నా కష్టాన్ని, సమయాన్ని నమ్ముకునే వాళ్ళు. ప్రస్తుతం అది మారింది ఎంత దారుణంగా అంటే.. ఏ పని పూర్తవ్వాలన్నా పాలిటికల్ సపోర్ట్ ఉండాల్సిందే. అయితే అందరికీ ఆ సపోర్టు ఉండదు కదా.. సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఆలోచించక్కర్లేదు. అలాంటి కాలం ఇప్పుడు కొనసాగుతుంది. రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యాన్ని కోరుకునే కొందరు ఈ రాజకీయాలను, వాళ్ళని ఎన్నుకునే ఓటర్లు ను ఎప్పుడూ తిట్టుకుంటారే తప్ప, ధైర్యంగా ‘మేం నిజాయితీగా పని చేస్తాం. మాకు ఓటు వేయం’డని ముందుకొచ్చేవారు లేరు. ఎందుకంటే నిజాయితీగా ఉన్న వారి కంటే డబ్బు ఉన్నోడే ఇక్కడ నాయకుడు కాగలడని వారి నమ్మకం. అలాగే నిజాయితీ పరులుకు కాకుండా డబ్బు ఇచ్చేవాడికే ప్రజలు ఓటు వేస్తారని వాళ్ళకు తెలుసు. అలాంటి వారిలో సురేందర్ ఒకడు. సురేందర్ తెలివైన నితి నిజాయితీ కల్గిన వ్యక్తి. అయితేనేం ఆ విషయం అందరికీ తెలియాలిగా.. ఎలక్షన్ సమయంలో ప్రజల చెంతకు వచ్చే నాయకులు తర్వాత బిజీ పేరు తో ఒక్కసారి కూడా ముఖం చూపించరు. పోని ప్రజలు కోసం పనిచేస్తున్నారా అంటే అది లేదు. అందుకే సురేందర్ తాను ఒక పార్టీ తరుపున పోటి చేయాలన్న కోరిక నెరవేరింది. డబ్బు పంచకపోతే గెలవనని తెలిసినా.. డబ్బు పంచటానికి ఇష్టపడలేదు. కానీ.. ఈసారి కి ఎలాగైనా గెలిస్తే.. తర్వాత ఓటర్లు కి బుద్ధి చెప్పవచ్చు అని డబ్బు పంచే ఏర్పాట్లు తన కార్యకర్తలకు అప్పజెప్పాడు. ప్రచారంలో ఊహించినట్లే.. "నీకు ఓటేస్తే.. మాకు ఏమిస్తావ్ " అనే ప్రశ్నలు పలువురు నుంచి వచ్చాయి. వీళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఇది కాదని సురేందర్ "మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా" అన్నాడు. దీంతో "తమ ఓటు మీకే " అన్నారు ఓటర్లు. ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో సురేందర్ గెలుపొందాడు. అయితే ప్రజలు కష్టాలు చెప్తారని ముఖం చాటేయడానికి ఇక్కడ విలువలు లేని వాడు కాదు కదా.. గెలిచి నెల రోజుల్లోనే ప్రజల చెంతకు చేరాడు సురేందర్. పింఛను రావటం లేదని ఒక అవ్వ, సొంత గూడు లేదని ఒకతను, ఊరికి రోడ్లు లేవని మరికొందరు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేవని ఇంకొందరు సమస్యలు చెప్పుకొచ్చారు. "అదేంటీ.. ఈ సమస్యలు అన్నీ నాకు చెప్తున్నారు".. ఆశ్చర్యం గా అడిగాడు సురేందర్ తెల్లముఖం వేశారు అక్కడ జనం. "ఓట్లు మీకు వేశాం. మీరు గెలిచారు. మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పా”లన్నాడు ఒక పెద్దాయన. బుద్ధి చెప్పే సమయం ఇదే అని సురేందర్ నిర్ణయించుకున్నాడు. "ఓట్లు నాకు వేసి గెలిపించాం అంటున్నారు సరే.. మీరు ఏమీ ఆశించకుండా ఓటు వేయలేదు కదా పెద్దాయన గారు " అన్నాడు సురేందర్. "అంటే.. " అనడిగాడు పెద్దాయన. "మిమ్మల్ని నేను డబ్బుతో కొని ఎలక్షన్ లో గెలిచానే తప్పా.. మీరు నిజంగా నన్ను నమ్మి డబ్బు తీసుకోకుండా ఓటు వేయలేదు కదండీ.. ఈ ఒక్క కారణమే సమస్యలు గూర్చి నాకు చెప్పే అర్హత మీకు లేకుండా చేసింది" అన్నాడు సురేందర్. మాట్లాడ్డానికి జనంలో ఒక్కరు కూడా ముందుకు రాలేదు. "నేను తెలివైన వాడిని, నిజాయితీ పరుడుని, నన్ను గెలిపించండి అంటే.. ఓటు వేస్తే.. మాకు ఏమీ ఇస్తావ్ అని అడిగారు కానీ.. డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తాం, ఐదేళ్లు మా సమస్యలు తీరుస్తూ, కష్టాలు వింటూ, మమ్మల్ని చూసుకోవాలని ఒక్కరూ అగడలేదు కానీ.. గెలిచాక సమస్యలు అంటూ వస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి".. ప్రశ్నిస్తాడు సురేందర్. "బాబు.. మాకు ఓటు విలువ ఇప్పుడు తెలిసింది. ఐదేళ్లు నాటకాలు ఆడే నాయకులకు ఐదేళ్లుకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తాం. ఏ నాయకుడికైనా డబ్బు వద్దు. గెలిచాక మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వారికే ఓటు వేస్తాం" అంటాడు మరో పెద్దాయన. "మంచిదండి.. కానీ ప్రస్తుతం భయపడకండి.. నేను మోసగాడిని కాదు.. కాయకష్టం చేసుకునేవాడి కడుపులో పుట్టిన వాడిని. మీ కష్టసుఖాలు లో పాలుపంచుకుంటాను.. మీకు బుద్ధి రావాలనే ఇలా చేశాను" అంటాడు. మరలా.. "ఓటుకి నోటు ఇవ్వటం, ఓటు కి నోటు తీసుకోవటం నేరం. అలాంటి వాళ్ళని పోలీసులు కు అప్పగించాలి. ఐదేళ్లు మీ సమస్యలను కాగితాలను డస్ట్బిన్ లో పడేసి కాలుమీద కాలేసుకుని ఉండే నాయకులు ఎలక్షన్ టైం లో మీ కాళ్ళమీదకు పడతారు. ఎందుకు.. ఆలోచించండి. వాళ్ళ బతుకు కోసం తప్ప మన బతుకులు మార్చేందుకు కాదు. అభివృద్ధి అంటే ఒకసారి పని చేస్తే సరిపోదు. సమస్యలు మళ్ళీ మళ్ళీ పుడుతుంటాయి. వాటిని పరిష్కరిస్తూ పోయేవాడే నిజమైన నాయకుడు. వాళ్ళకే మన ఓటు. అప్పుడే నాయకుడితో పాటు ఓటరు గెలిచినట్టు”.. సురేందర్ చెప్పగా.. మంచి నాయకుడు దొరికాడని చప్పట్ల తో సురేందర్ పేరు ఆ ప్రాంతమంతా మారుమోగింది.

శుభం

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.












35 views1 comment

1 Comment


Hindu Dharma Margam • 1 hour ago

కథ బాగుంది. మీరు చదివిన తీరు ఇంకా బాగుంది.

Like
bottom of page