top of page
Original.png

వృత్తి విద్య

#తెలుగుకథలు, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #VrutthiVidya, #వృత్తివిద్య

ree

Vrutthi Vidya - New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 16/09/2025

వృత్తి విద్య - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 


"ఒరేయ్ చిన్ని ఇటు రా" అని పిలిచాడు తండ్రి.


"ఏంటి నాన్న ఆస్తమాను ఏదో ఒకటి పని చెప్తావు? నన్ను ఆడుకోనివ్వవు"


"ఒరేయ్ ఈ చీర మీద ఈ ప్రింట్ వేయరా, అన్నయ్య చూడు చక్కగా ఏ పని చెబితే అది చేస్తాడు, అమ్మ కూడా ఎప్పుడు చేనేత మగ్గం మీద పని చేస్తూ ఉంటుంది"


"ఏంటి నాన్న నన్ను ఎప్పుడు ఆడుకోనివ్వవు. చూడు పిల్లలందరూ ఆడుకుంటున్నారు.. ఎప్పుడూ మగ్గం మీద పని చేయమంటావు నాకు విసుగు వస్తుంది" అంటూ విసుక్కున్నాడు చిన్ని.


"పోనీలెండి వాడిని ఆడుకోనివ్వండి. పెద్ద అయితే వాడే అన్ని నేర్చుకుంటాడు” అంటుంది తల్లి పద్మావతమ్మ.


పెద్దవాడు శేఖరు పనిలో నిమగ్నమై ఉంటాడు ఎప్పుడూ. 


సాంబయ్య చేనేత బట్టలు తయారు చేస్తాడు.

అతని మగ్గం కింద నలుగురు పనివాళ్ళు ఎప్పుడు పని చేస్తూ ఉంటారు.


పెద్దవాడు రవి మొదటి నుండి తండ్రికి సాయం చేస్తూ మగ్గం మీద చేనేత బట్టలను తయారు చేయడం నైపుణ్యాన్ని సంపాదించాడు. 


20 సంవత్సరాలు ఉంటాయి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. అక్కడ పని వాళ్ళందరి చేతా చక్కగా పని చేయిస్తుంటాడు.


రామాపురంలో చేనేత బట్టలకు చాలా ప్రఖ్యాతి ఉంది. పట్నం నుంచి వ్యాపారస్తులందరూ ఇక్కడ చీరలు లుంగీలు దోతీలు అన్నీ కొనుక్కొని పట్టుకెళ్తూ ఉంటారు.


చేనేత వ్యాపారానికి బాగా లాభాలు లేకపోయినా చక్కగా జరుగుతోంది.


ఇది తాత ముత్తాతల నుంచి వచ్చిన కళ, నైపుణ్యము. సాంబయ్యకు చాలా ఇష్టమైన పని. 


కొడుకులిద్దర్నీ కూడా ఇందులో పెడదామని అతని ఆశ.


చిన్నవాడు శేఖర్కి ఈ పని మీద ఏమాత్రం ఇష్టం లేదు సరి కదా తన స్నేహితులతో తన తండ్రి పని గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటాడు.


"మీ నాన్న ఏం పని చేస్తా”డని స్నేహితుల అడిగితే చేనేత మగ్గం మీద పనిచేస్తాడని చెప్పుకోవడానికి సిగ్గు.


తెలివైన పిల్లవాడు, మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ లో సీటు తెచ్చుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు.


సెలవులకు వచ్చినప్పుడు తండ్రి వాడికి కూడా కొంత పని నేర్పాలని ఆరాట పడుతూ ఉంటాడు. శేఖరు తండ్రి మాట అసలు వినడు.


"ఎంత చదువుకున్నా వృత్తి పనులు కూడా తెలుసుకొని ఉండాలి రా. అవసరమైనప్పుడు ఇదే మనకి కూడుపెడుతుంది" అంటూ తండ్రి చెప్తూ ఉంటాడు.


"అయినా మన చేనేత వస్త్రాలకి అనాదిగా ప్రఖ్యాతి పొందింది. మన భారతీయులు చేసిన చక్కటి చీర అగ్గిపెట్టెలో పెట్టేంతగా నైపుణ్యంగా తయారు చేశారు. విదేశీయులు కూడా ఎంతో మెచ్చుకున్నారు "అంటూ గర్వంగా చెప్తాడు తండ్రి.


"చదువు సంధ్య లేక ఈ వృత్తి విద్యల గురించి పాటుపడేవారు. ఇప్పుడు మనకేమి కర్మ.. హాయిగా చదువుకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవచ్చు” అంటూ కొట్టి పారేస్తాడు శేఖరు.


శేఖర్ ఇంజనీరింగ్ కు చదివి కంపెనీ ఉద్యోగంలో చేరాడు పట్టణంలో. పొద్దున ఆఫీస్ కి వెళ్తే రాత్రి పదింటి వరకు పని చేయించేవారు. ఈ విధంగా రెండు సంవత్సరాలు చేసేసరికి శేఖర్కి ఆ పని మీద విసుగు అయిపోయింది. శాలరీ కూడా పెరుగుదల లేదు.


ఇంతలో తండ్రి నేసే బట్టలకి చాలా గిరాకీ వచ్చింది. అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. అన్నగారు వ్యాపారం బాగా చూస్తున్నాడు. బట్టల మీద మంచి మంచి డిజైన్లు నాణ్యమైన నూలు, రంగులు వలన సాంబయ్య బట్టలకి బాగా గిరాకీ పెరిగింది. 

అతని కింద ఇప్పుడు పదిమంది నేత పని వాళ్లు పనిచేస్తున్నారు.


ఇంతలో శేఖర్ కంపెనీ సరిగా నడవకపోవడం వల్ల మూతబడింది. శేఖర్ ఉద్యోగం పోయింది. దాంతో అతనికి విసుగయ్యింది. చేతిలో నైపుణ్యం పెట్టుకొని ఈ ఉద్యోగాల వేట ఏమిటి అని అతనికి మనసులో అనిపించింది.


శేఖరు తండ్రి దగ్గరకు వచ్చి, "నాన్నా. నేను కూడా ఈ నేత పనిలో ఇక్కడే పని చేస్తాను మీ దగ్గరే. ఈ వ్యాపారాన్ని నేను అభివృద్ధి చేస్తాను. నీవు నేసిన బట్టలు విదేశాలకు పంపితే మనకి బోలెడు డబ్బు వస్తుంది.


నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది మన చేతిలో ఉన్న నైపుణ్యం వదులుకొని ఎవరికిందో పనిచేయవలసిన అవసరం ఏమిటి.. మన కళలను మనము గౌరవించుకోవాలి. ఇకనుంచి అన్నయ్యతో పాటు నేను కూడా చేనేత పనిలో సహకరిస్తాను” అన్నాడు ఎంతో విశ్వాసంగా, 


తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో ఆనందించారు శేఖరులో వచ్చిన మార్పు గమనించి. 


వృత్తి విద్యలను ఎప్పుడూ గౌరవించుకోవాలి. కాపాడుకోవాలి.

అది తల్లి వంటిది. కడుపునిండా తిండి పెడుతుంది. 


***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments


bottom of page