top of page

యమబాల - పార్ట్ 3'Yamabala - Part 3/4' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 15/06/2024

'యమబాల పార్ట్ 3/4' పెద్ద కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


జరిగిన కథ:


విరాట్ శక్తి సామర్థ్యాలను తన స్వార్థానికి వాడుకుంటాడు నయాజిత్.


అతను తనను వంచించిన విషయం గ్రహిస్తాడు విరాట్.


నయాజిత్ ను, ఆటవికులు వేషాల్లో వచ్చిన అతని అనుచరులను సంహరిస్తాడు.


విరాట్ ని తప్పించుకునే ప్రయత్నంలో చురకేర్ చనిపోతాడు.


నయాజిత్ ప్రజలనుంచి దోచుకున్న ధనాన్ని తిరిగి వారికే ఇవ్వాలనుకుంటాడు విరాట్.

స్వర్గం నుండి భూలోకానికి వచ్చిన యమబాల విరాట్ మేనత్త గుండమ్మ ఇంటికి వస్తుంది.

విరాట్ కి ప్రాణ గండం ఉన్నట్లు ఆమెకు తెలుస్తుంది.


ఇక యమబాల పెద్దకథ మూడవ భాగం చదవండి..


ఇన్విస్టిగేషన్ డైమెండ్ సాయి శ్రీ ని కలిసాడు. 

నయాజిత్ గురించి అడిగాడు. 


సాయిశ్రీ "యస్ సార్. నయాజిత్ నెలకు ఇరవై రోజుల పైగా ఈ హోటల్ లోనే ఉండేవాడు. అతను ఈ నడుమ విరాట్ అనే వ్యక్తిని తీసుకువచ్చాడు. ఇద్దరూ ఒకరోజు బయటకు వెళ్ళారు. ఆపై వారిద్దరూ హోటల్ కు రా లేదు. ఆ తర్వాత నయాజిత్ చంప బడ్డాడని పేపర్ లో చూసాను. 

 నయాజిత్ కు మా హోటల్ ఓనర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. పదిరోజుల హోటల్ బిల్, ముందుగానే నయాజిత్ నుండి అడ్వాన్స్ గా మా ఓనర్ తీసుకునేవాడు. అందుకే అతను చనిపోయాడని తెలి సినా మా ఓనర్ పెద్దగా ఫీల్ కాలేదు. నాలుగు రోజుల పాటు అతని వారెవరన్నా వస్తారా అని చూసి, ఆ తర్వాత నయాజిత్ ఉన్న రూం తలుపు తాళాలు తీసి

రూం ని స్వంతం చేసుకున్నాం. " డైమెండ్ తో అంది సాయశ్రీ. 


" రూం లో ఏమన్నా ఉన్నాయా? అతనికోసం ఎవరన్నా వచ్చారా?" సాయిశ్రీని అడిగాడు డైమండ్. 


"రూం లో అయితే ఏం దొరకలేదు. నయాజిత్ కోసం ఒకసారి విరాట్ యే వచ్చి వెళ్ళాడు. " అంది సాయిశ్రీ. 


" విరాట్.. అతను నీకు తెలుసా " డైమండ్ అడిగాడు. 


" ఓ బాగా తెలుసు. విరాట్ గారిది మాది ఒకటే ఊరు. ఈ పట్టణంకు కూత వేటు దూరంలో ఉన్న శ్రీనివాస పురం. వారిది సంపన్న కుటుంబం. వారిని వారి మేన త్తలు పెద్ద గుండమ్మ, చిన్న గుండమ్మ లే పెంచి పెద్ద చేసారు. మా కుటుంబం కూడా వారి ఆర్థిక సహాయం మీదనే ఎదిగింది. " అంది సాయిశ్రీ. 


"మీరెంతకాలం నుండి ఈ హోటల్ లో వర్క్ చేస్తు న్నారు?" డైమండ్ సాయిశ్రీ ని అడిగాడు. 


"టూ ఇయర్స్ నుండి నేను ఈ హోటల్ లోనే రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. " అంది సాయిశ్రీ. 


"శ్రీనివాస పురం. " అని మనసులో అనుకున్నాడు డైమండ్. 


 గడ్డిమోపుల బండి ద్వారా వచ్చిన మనీని ల్యాండ్ ఒనర్స్ కు తదితరులకు ఇవ్వవలసిన వారందరికీ ఇచ్చేసాడు విరాట్. 


"అవసరమైనప్పుడల్లా మనీ నువ్వు లేదా నేనే తీసుకురావాలి. మన నాలుగు డాగ్స్ సహాయం తప్ప మరో మనిషి సహాయం తీసుకోకూడదు. " వికటతో అన్నాడు విరాట్. 


 "ఓ. కే. ఓ. కే. మరి మిగతా మనీ అంత ఏం చేద్దాం? "విరాట్ ను అడిగాడు వికట. 


 "ఇంతకు ముందే చెప్పాను కదా? నయాజిత్, చురకేర్ ఈ చుట్టు ప్రక్కల వారినే అదిలించి బెదిరించి వారి కష్టార్జితాన్ని దోచుకున్నారు. ఈ చుట్టు ప్రక్కల వంద గ్రామాలకు పైగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఇళ్ళు లేనివారు చాలా మంది ఉన్నారు. ఆ ధనంతో వారంద రికి గృహవసతి కల్పించుదాం. ఆ తర్వాత ప్రతి ఊరిలో బడిని, గుడిని, వైద్యశాలను కట్టిద్దాం. అలాగే ప్రతి ఊరికి నీటి వసతిని, రోడ్డు వసతిని కల్పిద్దాం. చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకుంటున్న నిరుద్యో గులకు ఆర్థిక సహాయం అందిద్దాం. కాలేజీలను కట్టి ద్దాం. ఇలా ప్రజల అవసరాలను తీరుద్దాం. 


 నయాజిత్ అభ్యుదయం పేరుతో బడాబాబు లను, మద్య తరగతివారిని బెదిరించి సంపాదించిన సంపదే ఇదంతా.. దీనిని ప్రభుత్వానికి అప్పగిస్తే పేదల పేరు చెప్పి వారు దోచేస్తారు. కాబట్టి మనమే దీనిని సద్వినియోగం చేద్దాం. అయినా నయాజిత్ ను, చుర కేర్ ను చంపే ఆ రోజు, నాకు అంత శక్తి ఎలా వచ్చిందో నాకే అర్థం కావడం లేదు వికట " అన్నాడు విరాట్. 


 "నీలో నీకే తెలియని గాడ్ ఫవర్ ఉంది గురూ. అందుకే ఆ రోజు అలా చేసేసావు. నువ్వు చాచి పెట్టి చెంప మీద ఒకటిచ్చావంటే ఏ పన్ను ఎక్కడ రాలిందో వెతుక్కోవడానికి ఏడురోజులు పడుతుంది. నీ శక్తి నీకు తెలియదు గురూ.. " విరాట్ తో అన్నాడు వికట. 


 గడ్డి వాము కు మరొక ప్రక్కన ఉండి విరాట్ మాట లన్నీ విన్న యమబాల ఆ రోజును జ్ఞాపకం చేసుకుంది. 


 ఓడలో శత్రువులతో తలపడుతున్న విరాట్ ను ఆకాశం నుండి చూచిన యమబాల విరాట్ లోని సురశక్తిని గమనించింది. అతని సాహసానికి మెచ్చి తన సురశక్తిని మరికొంత విరాట్ కు ధారపోసింది. అప్పుడే చేప నోట్లో పడ్డ విరాట్ యమబాల ప్రసాదించి న సురశక్తి ప్రభావాన చేప చెవులనుండి బయట పడ్డాడు. 


 "అదిసరే గురూ ఈ యమబాల, చిత్రబాల ఎవరు?" విరాట్ ను అడిగాడు వికట. 


 "అదే నాకూ అర్థం కావడం లేదురా. వీరు మన నడుమ మనుషుల్లా ప్రవర్తిస్తున్నా, నిజానికి శాప వశాత్తు భువికి వచ్చిన దేవ కన్యల్లా ఉన్నారు. వీరి మీద ఒక కన్ను వేసి ఉంచాలి. " చిరునవ్వుతో అనుకుంటూ విరాట్ ముందుకు నడిచాడు. 


'అవును ఒక కన్ను వేసి ఉంచాలి' అంటూ వికట విరాట్ ను అనుసరించాడు. 


 యమబాల విరాట్ వెళుతున్న వైపు చూసింది. 

అతని వెనుక అతనిని అనుసరిస్తున్న భయంకర విష నాగును యమబాల చూసింది. యమబాల కాలనాగు లా మారి కళ్ళు ఎర్ర చేసింది. విషనాగు బుసలు కొడుతూ కాలనాగు రూపంలో ఉన్న యమ బాల ను చూచి రైయ్యిన పైకి లేచి యమబాల ముఖం ముందు పడగ విప్పి నిలబడింది. యమబాల కళ్ళలోని తీక్షణ తకు కాలనాగు బూడిదైపోయింది. విరాట్ వికట వారి వెనుకన జరిగిన ఈ భయంకర సంఘటనను గమనించ లేదు. 


 "ఎవరిదీ విషనాగు ప్రయోగం?" యమబాలను అడిగింది చిత్రబాల. 


 విరాట్ దగ్గర ఆ ధనం ఉన్నంత కాలం ఇలాంటి విషప్రయోగాలు చేసే శత్రువు లు ఉంటూనే ఉంటారు. ఆ ధనం అతని దగ్గర నుండి దూరమైతే ఇక ఏ ప్రమా దం ఉండదు. అతడు ఆ ధనాన్ని చక్కగా సద్విని యోగం చేస్తున్నాడు. కాబట్టి అతనికి అంతా మంచే జరుగుతుంది. 


 అతనికి ఎవరు ఎన్ని ప్రమాదాలు తల పెట్టిన తప్పించుకోగలడు కానీ నా యమ పాశం నుండి మాత్రం తప్పించుకోలేడు. దానికి ఇంకా కొంచెం టైం ఉంది. " చిత్రబాలతో అంది యమబాల. 

 సాయిశ్రీ తన తలిదండ్రులు నాగ సైదులు, నాగ సత్యంలతో తమ్ముడు విచక్షణ్ తో పెద్ద గుండమ్మ, చిన్న గుండమ్మ ల దగ్గరకు వచ్చి వారి పాదాలకు మొక్కి వారి ఆశీర్వాదం తీసుకుంది. పెద్ద గుండమ్మ చిన్న గుండమ్మ సాయిశ్రీ యోగ క్షేమాలగురించి అడిగారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగం గురించి అడిగారు. 


 సాయిశ్రీ తాను ఉద్యోగం వదిలి కొంత కాలం ఇంటి దగ్గరే ఉండబోతున్నట్లు ఇద్దరు గుండమ్మలకు చెప్పింది. ఇద్దరూ సంతోషించారు. అప్పుడే అక్కడకు వచ్చిన విరాట్, వికటలకు సాయిశ్రీ నమస్కరించింది. విరాట్ ప్రతి నమస్కారం చేసాడు. అలాగే అక్కడకు వచ్చిన యమబాల, చిత్రబాలలను చిన్న గుండమ్మ సాయిశ్రీకి పరిచయం చేసింది. 


 యమబాలకు తోడుగ ఉండి ఊరి విషయాలన్నిటిని తెలుపమని పెద్ద గుండమ్మ సాయిశ్రీకి చెప్పింది. సాయిశ్రీ అలాగే అంది. విరాట్ తను వంద గ్రామాలలో కట్టించ బోతున్న ఇళ్ళ గురించి చెప్పి, అవసరం అయినప్పుడు తనకి కూడా సహాయ పడమని సాయిశ్రీని అడిగాడు. 

 సాయిశ్రీ విరాట్ దగ్గరకు "అలాగే "అంటూ వెళ్లి, 


" మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి "అని విరాట్ కు వినపడేటట్లు నెమ్మదిగా అంది. 


 సాయిశ్రీ విరాట్ తో నెమ్మదిగా మాట్లాడటం యమబాల గ్రహించింది. యమబాల సాయిశ్రీ వదనాన్ని ప్రత్యేకంగా చూసింది. ఆమె వదనంలో కదలాడుతున్న విషనాగుల పుట్టను చూసింది. 

 సాయిశ్రీ తోట బంగ్లా లో ఉన్న గదిలో విరాట్ ను కలిసింది. సాయిశ్రీ తన దగ్గరకు డైమండ్ వచ్చిన విష యం విరాట్ కు చెప్పింది. రేపో మాపో అతనిక్కడికి రావచ్చన్న విషయం కూడా విరాట్ కు చెప్పింది. సాయిశ్రీ మాటలను విన్న విరాట్ "డైమండ్ ఇక్కడకు వస్తే, అతనికి కావల్సిన సదుపాయాలన్నీ నువ్వే చూడు. అతనికీ మన గురించి పూర్తిగా తెలియాలి కదా?" సాయిశ్రీతో విరాట్ అన్నాడు. 


" యమబాల చిత్రబాల మాటలు, వేషధారణ చిత్రాతి చిత్రంగా ఉన్నాయి. అసలు వాళ్ళెవరు?" విరాట్ ను సాయిశ్రీ అడిగింది. 


" వాళ్ళు ఎవరో నాకూ తెలియదు. వారు మా మేనత్తల ఆదరణ పొందారు.. నా పనుల్లో నేను బిజీగా ఉండటం వలన వారి గురించి ఆరా తీయలేదు. " సాయిశ్రీతో అన్నాడు విరాట్. 


"సరే.. నేను వారి గురించి ఆరా తీస్తాలే. " విరాట్ తో అంది సాయిశ్రీ. 


 సాయిశ్రీ విరాట్ దగ్గర సెలవు తీసుకుని తోట బంగ్లా నుండి బయటకు వచ్చింది. తోట బంగ్లాకు అల్లం త దూరంలో మామిడి కొమ్మ మీద కూర్చున్న యమ బాల, చిత్రబాలలను చూచి నెమ్మదిగా సాయిశ్రీ చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టుకు ఒక ప్రక్కన వారికి కనపడ కుండా నిలబడింది. 


 "యమబాల మీ తండ్రి గారి అనుమతి మేర నువ్వు విరాట్ ప్రాణం తీసికెళ్ళడానికి భూలోకం వచ్చావు. మీ తండ్రి గారు విరాట్ ప్రాణం తీసుకురమ్మని నిన్ను పంపిం చడానికి ప్రధాన కారణం మీ తండ్రి యమ ధర్మరాజు గారిని దున్నపోతు తన్నడం అని అందుకే వారు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారని కొందరు దేవతలు అనుకుంటు న్నారు. అదెంతవరకు నిజం?" యమబాలను అడిగింది చిత్రబాల. 


"ఏది నిజం? ఏది అబద్దం? అనే విషయాన్ని పక్కన పెడితే మనం భూలోకానికి రావడమన్నది నిజం. మా నవ కాలమాన లెక్క ప్రకారం నువ్వు నిండూ నూరేళ్ళు భూమి మీద ఉండి, నీ జనకుడు ఆదేశించిన పని చేసి,. ఆపై యమలోకం వెళ్ళు అని నన్ను చంద్రుడు శపించ డం నిజం. నా మనసు విరాట్ మీదకు వెళ్ళిందన్నది నిజం. " చిత్రబాల తో అంది యమబాల. 


యమబాల మాటలను చాటుగ ఉండి విన్న సాయిశ్రీ ఈమె యమధర్మ రాజు కుమార్తె యమబాల అన్న మాట. ఇక చిత్రబాల చిత్రగుప్తుని కుమార్తె అయ్యి ఉంటుంది. యమబాల... విరాట్... డైమండ్... చూద్దాం ఏమవుతుందో? కాగల కార్యము గంధర్వులే తీరుస్తా రన్నట్లు మన కార్యం వీరే తీర్చేటట్లు ఉన్నారు. " అని అనుకుంటూ సాయిశ్రీ అక్కడి నుంచి నెమ్మదిగా నిష్క్రమించింది. 

 డైమండ్ పెద్ద గుండమ్మ ను చిన్న గుండమ్మ ను కలిసాడు. తను ఒక దొంగను వెతుక్కుంటూ ఇటు వచ్చానని చెప్పాడు. 


దొంగను పట్టుకోవడానికి మీరెంతకాలమైన ఇక్కడ ఉండవచ్చునని చిన్న గుండమ్మ డైమండ్ కు చెప్పింది. డైమండ్ కు విరాట్ ను పరిచయం చేసింది. 


"యస్.. నయాజిత్ మహా కౄరుడు. మహా దుర్మా ర్గుడు. ప్రజలను, ప్రభుత్వాన్ని భయపెట్టి లెక్కలే నంత సంపాదించాడు. కుక్కచావు చచ్చాడు. అతగాడు కుక్కచావు ఎవరి చేతిలో చచ్చాడన్నది మాత్రం ఇంత వరకు ఎవరికి తెలియడం లేదు. అతను చావడం ఎంత ఆనందమో అతని దోచుకున్నదంతా ప్రభుత్వానికి చెందాలన్నది అంత న్యాయబద్దం. నయాజిత్ ను చంపిన వాడు వందకు వంద శాతం సూపర్. కానీ ఆ సంపదనంతా ప్రభుత్వానికి అప్పచెప్పకపోవడం మాత్రం నేరం; అందుకే అతనిని పట్టుకోవాలి. " విరాట్ తో డైమండ్ అన్నాడు. 


"మా యింట్లో నలుగురు కనపడే దేవతలు ఉన్నారు. వారు యమబాల, చిత్రబాల. వీరిద్దరూ ఏదో పల్లెటూరి పరిశోధన మీద వచ్చారట. చూడటానికి ఇద్దరూ దేవ కన్యలవలే ఉంటారు. ఇక మా ఇద్దరు మేనత్తలు పెద్ద గుండమ్మ, చిన్న గుండమ్మ. ఈవూరివారంత వారిని అన్నపూర్ణ అనీ శ్రీమహాలక్ష్మి అనీ రకరకాల దేవతలతో పోలుస్తారు. వారి నలుగురు సాక్షి గా చెబుతున్నాను. 

మీరు చేసే ఇన్విస్టిగేషన్ లో నిజంగా నిజాయితీ ఉంటే మీ కోరిక తప్పక నెరవేరుతుంది. " డైమండ్ తో అన్నాడు విరాట్. 


"తొక్క నెరవేరుతుంది అంటే బాగోదు కానీ నేరవేర దన్నది నిజం. ఈ లోకానికి వచ్చాక రఫ్ లాంగ్వేజ్ అప్పుడప్పుడు పెరిగిపోతుంది. రాజుల సొమ్ము రాళ్ళ పాలు. దొంగల సొమ్ము దొరల పాలు. " పక్కనే ఉన్న గది కిటికీ దగ్గర నిలబడి విరాట్ మాటలను విన్న యమ బాల అనుకుంది. 


 వికట అరణ్యంలోని కొండ గుహ దగ్గరకు వెళుతున్నాడు. అతని జేబులోని సెల్ మోగింది. వికట సెల్ తీసాడు. " నిన్నెవరో పదిమంది అగంతకులు అనుసరిస్తున్నారు. " సెల్ ఫోన్ లో వికటతో విరాట్ అన్నాడు. 


 "గ్రహించాను. అందుకే రూట్ మార్చాను. మరో క్షణంలో డాగ్స్ వస్తున్నాయి. " అంటూ వికట పక్కనే ఉన్న మామిడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. 


 పదిమంది అగంతకులు మీద నాలుగు డాగ్స్ పడినవి. పదిమందిని రక్కి రక్కి ప్రాణాలు తీసాయి. అప్పుడే అక్కడకు వచ్చిన ఎడ్ల బండి మీద అగంతకుల శవాలను వికట వేసాడు. ఎడ్ల బండి ముందుకు కదిలి పోయింది. 


 యమబాల, చిత్రబాల పల్లెటూరి లో ఉన్న బడి దగ్గరకు వెళ్ళారు. అక్కడ వారికి విచక్షణ్ కనపడ్డాడు. 👑 కిరీటధారీ, గదాధారి అయిన యమబాల విచక్షణ్ కు కనపడింది. మీరు నాటకాలలో వేషాలు వేస్తారా? అని విచక్షణ్ యమబాలను అడిగాడు. తనలోని సుర అంశ విచక్షణ్ కు కనపడింది అని యమబాల మనసులో అనుకుంది. 


 అలాంటిదేం లేదు. బాలవాక్కే కాదు బాల చూపు కూడ బ్రహ్మ చూపు అంటాను. అదిసరే నువ్వు బాగా చదువుతావని ఈ పల్లెటూరి లో చాలా మంది చెప్పగా విన్నాను. మీ గురువు గారు చెప్పే పాఠాల్లో నీకెలాంటి సందేహాలు రాలేదా?" విచక్షణ్ ని అడిగింది యమబాల. 


"ఎందుకు రాలేదు. మా గురువు గారు పితృదేవో భవ, మాతృ దేవో భవ తండ్రి మాటను వ్యతిరేకించ కూడదు. తల్లి మాట వ్యతిరేకించకూడదు. వారేం చేసిన తలవంచాలి అని అంటారు. 


 మా నాన్న బాగా తాగి వచ్చి మా అమ్మ ను చితకబాదుతాడు. మా అమ్మ మా నాన్న జేబులో డబ్బులు కొట్టేసి దొంగతనాన్ని నా మీదకు నెట్టాలని ప్రయత్నిస్తుంది. అలాంటప్పుడు నేను తలిదండ్రులను ప్రశ్నిస్తే తప్పేమిటి?" యమబాలను విచక్షణ్ అడిగాడు. 


" ఎలాంటి తప్పు లేదు. మీ మానవులు పురాణ కథలను తమకనుకూలంగ ఇష్టం వచ్చినట్లు మార్చేసి మీకు చెబుతున్నారు. నిజానికి పురాణాలు నాడు జరిగి నవి జరిగినట్లు చెప్పాయి. తప్పుచేసిన తండ్రయిన హిరణ్యకశిపునే ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. చిన్న పొర పాటు చేసిందని తండ్రి ఆనతి మేర తల్లియైన రేణుకా దేవి తలనే నరికాడు పరశురాముడు.. ఇలా చెప్పు కుపోతే మన వేద పురాణేతి హాసాల లో అనేక సంఘ టనలు ఉన్నాయి. వారి వారి తప్పులను కప్పిపుచ్చు కోవడానికి కొందరు అవకాశవాద పండితులు వేద పురాణేతి హాసాల రూపురేఖలనే మార్చివేసారు. కాబట్టి నువ్వు పితృ దేవో భవ, మాతృ దేవో భవ, గురు దేవో భవ అని కాకుండా సుపితృ దేవో భవ, సుమాతృ దేవో భవ, సుగురు దేవో భవ అని చదువుకో " విచక్షణ్ తో అంది యమబాల. 


"అలాగే "అంటుఅక్కడినుండి వెళ్ళిపోయాడు విచక్షణ్.

 

యమబాలకు అల్లంత దూరంలో ఉండి ఆమె మాటల ను విన్న డైమండ్ యమబాల దగ్గరకు వస్తూ, "మీరు ఏ పండితుడు మాట్లాడలేని విధంగా చాల చక్కగా సశాస్త్రీ యంగా, ఆలోచనాత్మకంగా మాట్లాడు తున్నారు" అన్నాడు. 


" వేద పురాణేతిహాసాల ధర్మం, యమ ధర్మం ఇలాగే ఉంటుంది. అయితే అది అవకాశవాద మానవ మేథ స్సులో పడి రకరకాలుగా రూపాంతరం చెందింది. " డై మండ్ తో అంది యమబాల. 


"అది సరే మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు?" యమబాల ను అడిగాడు డైమండ్. 


" పల్లెటూర్లలో ఉత్తమ పల్లెటూర్లు ఎలా ఉంటాయి? పల్లెటూర్లలో పెద్ద గుండమ్మ గారి లాంటి పాకశాస్త్ర నైపుణ్యం గలవారు ఎంతమంది ఉంటారు? " అనగానే చిత్రబాల" పెద్ద గుండమ్మ గారికి తెలిసినన్ని వంటలు మాకు తెలిసి ఇంకెవరికీ తెలియవనే చెప్పాలి. అవన్నీ ఆరోగ్యకరమైన వంటలే. అనారోగ్యాలను తెచ్చిపెట్టే వంటలు కాదు" అన్న చిత్రబాలతో " నిజమే మేం పట్టణాల్లో ఎంత సంపాదించినా ఆరోగ్యకరమైన వంటలను తినలేకపోతున్నాం. " అన్నాడు డైమండ్. 


" ఇక చిన్న గుండమ్మ గారి ఋజువర్తనతో కూడిన కార్య నిర్వహణా సామర్ధ్యం గురించి చెప్పాలంటే అదొక గ్రంథం అవుతుంది. " అంది యమబాల. 


" అదీ నిజమే మన కవులు పల్లెటూర్లు అనగానే ఏదేదో వ్రాసేస్తారు. ఈ తరానికి కావల్సినవి విపులంగా రాయ రు. " అన్నాడు డైమండ్. 


" అలాంటి మేనత్తల పెంపకంలో పెరిగాడు కాబట్టే విరా ట్ పరోపకారి కాగలిగాడు. సంపూర్ణ ఆరోగ్య వంతుడు కాగలిగాడు. ఒక్క దెబ్బతో వంద మందిని చావచితక కొట్టగల కండపుష్టి కలవాడు కాగలిగాడు. నీటిలో మునిగినా పైకి లేవగలిగిన సామర్థ్యం కలవాడు కాగలి గాడు. " అంది యమబాల. 


" విరాట్ ఒక్క దెబ్బతో వందమందిని చావచితక కొట్ట గలడా! నీటిలో మునిగి పైకి లేవగలడా! అవన్నీ మీరు చూసారా?" యమబాలను అడిగాడు డైమండ్. 

" చూసాం.. కానీ ఇక్కడ కాదు. " అంది యమబాల. 

" ఎక్కడ?" అడిగాడు డైమండ్. 

" ఎక్కడ అంటే ఆ ప్రదేశం పేరు నాకు తెలియదు " అంది యమబాల. 

" చిత్రపటంలో చూస్తే ఆ ప్రదేశాన్ని గుర్తు పట్టగలరా?" అడిగాడు డైమండ్. 

" అంత బాగా కాకపోయినా కొంత గుర్తు పట్టగలను. " అంది యమబాల. 

" చిత్ర పటాలతో మిమ్మల్ని కలుస్తాను. " అని డైమండ్ సాయిశ్రీ యింటికి వెళ్ళాడు. 

" మీకు చిత్రపటాలు గీయటం బాగా తెలుసనుకుంటా ను?" సాయిశ్రీని అడిగాడు డైమండ్. 

"తెలుసు. నాకంటే మా డాడీ అన్ని రకాల చిత్రాలు బాగా గీస్తారు. " అంది సాయిశ్రీ. 

" మీరూ, మీ డాడీ మీరు చూసిన ప్రాంతాల చిత్రాలన్నీ గీయాలి. ఇది డిమాండ్ కాదు. రిక్వెస్ట్. ఎంత ఖర్చు అ యినా ఫర్వాలేదు. అంతా నేను చెల్లిస్తాను. ఇది నేను మీకూ, మీ డాడీ కి ఇచ్చే చిరు ఉద్యోగం అనుకోండి లేదా మీ ప్రతిభను ప్రపంచానికి ఎరుక పరుస్తున్నాను అను కోండి. మీరెలా అనుకున్నా ఫర్వాలేదు. పని మాత్రం జరగాలి. "సాయిశ్రీ తో అన్నాడు డైమండ్. 

" తప్పకుండా... నా చిత్రపటం యమబాల చిత్రపటం తోనే ప్రారంభిస్తాను. " అంది సాయిశ్రీ. 

యమబాల, చిత్రబాలలు ఇద్దరూ వంటశాలలో ఉన్నా రు. పెద్ద గుండమ్మ వారికి నేతి బొబ్బట్లు పెట్టింది. 

యమబాల వాటిని తింటూ, " ఆంటీ మీరేది చేసిన సూపర్ గ ఉంటుంది. "అని అంది. 

" మన లోకం లో అమృతం తప్ప ఇంత రుచికరమైన పదార్థాలు ఏం లేవు. మానవులు మహా తెలివి కల వారు. రకరకాల వివిధ రుచుల పదార్థాలను సృష్టించు కుని హాయిగా తినేస్తున్నారు. మనం ఆ అమృతంలోనే పడిచస్తున్నాము. దానితోనే సరిపెట్టుకుంటున్నాం ‌. పెద్ద గుండమ్మ ఆంటీ ని మన లోకం తీసుకువెళ్ళి ఈ వంటలన్నీ అక్కడ చేయించుకుని తింటే బాగుంటుంది అనిపిస్తుంది. " చిత్రబాల యమబాలతో నెమ్మదిగా అంది. 

వారిరువురు మాట్లాడుకొనుచుండగా చిన్న గుండమ్మ అక్కడకు వచ్చింది. " మీ పరిశోధనలు ఎంతవరకు వచ్చాయమ్మ?" అని యమబాలను అడిగింది.

=======================================================================

ఇంకా వుంది.. 

=======================================================================

వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు13 views0 comments

Comments


bottom of page