top of page

ఆ నాదము

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆనాదము, #మన సైనిక పాటవము, #Omkaram #ఇష్టపది

గాయత్రి గారి కవితలు పార్ట్ 26

Aa Nadamu - Gayathri Gari Kavithalu Part 26 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 06/06/2025

ఆ నాదము - గాయత్రి గారి కవితలు పార్ట్ 26 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


ఆ నాదము

(ఇష్టపది )

**********************************

యుగములకు ముందుగా నుద్భవంబొందింది

జగతిలో శబ్దమై సర్వత్ర నిండింది 


ఓంకారమై ధరణి కూపిరిని పోసింది 

ఆకారమును దాల్చి యక్షరంబయ్యింది


మానవాళికి జతగ మహిలోన వరలింది 

నానాటికీ క్రొత్త నడకలను నేర్చింది 


వివిధ రీతులలో విద్యార్థులను జేరి 

ప్రవిమలంబగు విద్యగ వర్థిల్లసాగింది 


అక్షరంబును జేత నాయుధంబుగ మార్చి 

దక్షతను జూపించి ధైర్యవంతులు పోరి 


రక్షణంబును జేసి రాజ్యాలు స్థాపించ 

లక్షణంబుగ బాష రమ్యమై చెలగింది 


జ్ఞానామృతమును పంచి శాశ్వతమై నిలిచి

ఈ నాటికీ నేల నేలుతూ గెలిచింది


బీజరూపంబుగా వేదార్థ రూపిణిగ

తేజోమయంబగుచు దిశలందు మెరిసింది.//

************************************

మన సైనిక పాటవము

(కవిత)














మనదేశ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనమీ రాకెట్లు 

ఘనులగు సైనికుల మిషనుగన్లలో నురికెడి బుల్లెట్లు


వీరులై జవానులు తొడుగుతారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు

పరాయి దేశం పెట్టుకుంటోందిప్పు డేడుస్తూ తాకట్లు


మనదేశ మురిమి చూస్తే చాలు వైరులకు క్రమ్ము చీకట్లు

మన సైనిక పాటవానికి చిత్తయినాయి విదేశీ కనికట్లు


కుతంత్రపు రాజ్యంలో మొదలైనాయి తీర్చలేని ఇక్కట్లు

జత గూడిన వేర్పాటు వాదులు పెట్టారచ్చట కుంపట్లు


 త్రవ్వుకున్న గోతిలోపడిన శత్రువుల కళ్ళల్లో మిరుమిట్లు

నివ్వటిల్లు భారత దౌత్య నీతికి సర్వత్రా లభించె చప్పట్లు.//


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page