top of page

మృగాలు

#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #మృగాలు, #సగటుమనిషి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Mrugalu - New Telugu Poem Written By  - Nandyala Vijaya Lakshmi

Published in manatelugukathalu.com on 06/06/2025 

మృగాలు - తెలుగు కవిత

రచన: నంద్యాల విజయలక్ష్మి


మృగాలు అడివిలో ఉండక ఊరు మీదపడితే అందరికీ భయం భయం

మనలో ఒకడుగా ఉంటూ మృగముగా మారినవాడిని శిక్షించాలంటే భయం భయం

పసిపాపలను కూడా మృగాలుగా వేటాడే దానవుడిని

వెంటనే తెగ నరకడానికి కోర్టు లు కేసులు ఎందుకు?

కలుపు మొక్కని తీసివేస్తేనే కదా పంట బాగుండేది

మానవమృగాలను తరిమికొట్టండి .

దొరికితే నరికి పోగులు పెట్టండి .

భయం భయం అనే ముసుగులో ఉండకండి .

అందరము ఒకటై పోరాడుదాము.

ఆకతాయిల ఆట కట్టిద్దాము.















సగటుమనిషి

------------------

సగటుమనిషి

వాడిని అలానే ఉండనీయండి.

ఉచితాల పేరుతో ప్రలోభపెట్టకండి.

శ్రమలో ఆనందాన్ని వెతుక్కోనీయండి.

రేపుగురించి ఆలోచించనీయండి.

అందనివాటిని ఆశ పెట్టి స్వశక్తిని మరుగుపడేలా చేయకండి.

కలల ప్రపంచాన్ని నిజమని భ్రమపడేలా చేయకండి.

కులవృత్తిని కించపరచక ఎవరి పని వారిని చెయ్యనీయండి.

మానవత్వాన్ని పరిమళించనీయండి.

సగటు మనిషి సంతృప్తిని పొందనీయండి .

ఉన్నదానితో అందలము ఎక్కలేక

అసంతృప్తితో వ్యధచెందే

సగటు మనిషికి వాస్తవాన్ని తెలియజేయండి .

సమాజాన్ని కొంతైనా సంస్కరించడానికి ప్రయత్నించండి.

దాగి ఉన్న ముళ్ళకంపలను నరుకుతూ

రాజమార్గములో సగటుమనిషి ని

ఆత్మవిశ్వాస ముతో మనుగడసాగించనీయండి.

***

నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

2 comentários


swamyraja0330
06 de jun.

మృగాలు కవిత ప్రస్తుత సమాజ తీరును, పెరుగుతున్న అత్యాచారాలకు అద్దం పడుతోంది.

సగటు మనిషి కవితలో ఉచిత ప్రలోభాల ప్రభావం సగటుమనిషి అస్థిత్వాన్ని ఎలా మార్చేస్తోందో రచయిత్రి చక్కగా వివరించారు

Curtir

professorcsgk
06 de jun.

చక్కని కవితలు. భావ యుక్తం గా వున్నాయి

Curtir
bottom of page