ఆదర్శ వివాహం - జీవనం
- P. V. Padmavathi Madhu Nivrithi
- Apr 4
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AdarsaVivahamJeevanam, #ఆదర్శవివాహంజీవనం, #TeluguChildrenStories

Adarsa Vivaham Jeevanam - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi
Published In manatelugukathalu.com On 04/04/2025
ఆదర్శ వివాహం - జీవనం - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
పెద్దోడు చిన్నోడు అన్న దమ్ములు. ఇద్దరికీ చెరో కూతురు సంతానం. ఇద్దరు కూతుళ్ళు పైచదువులు ముగించారు. ఉద్యోగాల్లో చేరారు ఒకే కంపెనీలో.
వారిరువురికి పెళ్లీడు వచ్చింది - వివాహ సమయం ఆసన్నమైంది. రెండు కుటుంబాలు కూడ - పలుక్కుని... కూతుళ్ళ ఆఫీసులోనే పని చేసే ఇద్దరు అబ్బాయిలను వారి వరులుగా నిర్ధారించారు.
ఒకే రోజు, ఒకే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు రెండు పెళ్లిళ్లకు... నాలుగు కుటుంబాలు కూడపలుక్కుని.
గిఫ్ట్ లు - బహుమానాలు తేవద్దు అని పెళ్లి కార్డు లోనే అచ్చు వేయించారు. బహుమానాలు ఇతర ఇచ్చి పుచ్చుకోవటాలు ఉండవు అని కూడా కార్డ్ లోనే తెగేసి అచ్చు వేయించారు.
-----------------
2)
పెళ్లి కార్యక్రమం ను ఇంటి పక్కనే ఉన్న పెద్ద కాళీ స్థలంలో డేరా వేసి పెట్టుకున్నారు. మామూలు కుర్చీలు వేశారు. నిజానికి, దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు రెండు జంటలు అనవచ్చు.
పెద్దలను సంతోష పరచటానికి ఒక పురోహితుడిని పిలిపించి ఓ పావు గంట లో మంత్రాల తంతు తో సాంప్రదాయ పద్దతిలో పెళ్లి ముగించారు.
పెద్ద ఆర్భాటం ఏమీ లేదు అబ్బాయిల వారినుండి - అమ్మాయిల వారి తరఫు నుండి. వచ్చిన వారికి బట్టలు పెట్టటం, గిఫ్ట్ లు ఇవ్వటం - తీసుకోవటం ఏమీ లేవు.
చాలామంది చుట్టాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వచ్చారు... ఆశీర్వదించి వెళ్లేందుకు. కానీ ఏటువంటి ఆర్భాటం, దుబారా లేదు.
భోజనాలకు కొన్ని (5-7) వెరైటీ లే చేయించారు కేటరింగ్ వాళ్ళకు ముందస్తుగా చెప్పి. ఏ తినుబండారాలు మిగిలి పోకుండా - వ్యర్థం కాకుండా. బఫ్ఫె (buffet: dishes on tables) పెట్టుకున్నారు... మరీ ఎక్కువ వ్యర్థం, మిగిలి పోవటం కు ఆస్కారం లేకుండా.
-------------------
3)
భోజనాలు అయిన తరువాత ఇరు వైపుల వధూ-వరుల తల్లి - తండ్రులు (8 మంది) ఇలా మాట్లాడారు మైకులో అందరినీ సంబోధించి - ఉద్దేశించి:
"మేము 4 కుటుంబాలు ముందస్తుగా కూడా-పలుక్కుని ఒకే ముహూర్తాన రెండు పెళ్లిళ్లు పెట్టుకున్నాం, ఖర్చులు కలిసొస్తుందని. పెద్ద ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకోలేదు. 1-2 గంటల వ్యవధిలో మొత్తం పెళ్లి కార్యక్రమం - భోజనాలు తంతు ముగించాం. గిఫ్ట్ లు, బట్టలు ఇచ్చి పుచ్చుకోవడం ఏమి చేయలేదు. ఎందుకు??? ఎవ్వరికీ ఎక్కువ ఖర్చు లేకుండా... అందరికీ... అన్ని వైపులా... పొదుపు వర్తించేలా".
"పెళ్లికి రాలేము అన్న వారికి ఆన్లైన్ లో పెళ్లి చూసే ఏర్పాటు చేసాము".
"లక్షల్లో డబ్బు పొదుపు అయ్యింది - మిగిలింది ఇరు వైపులా... అదే నాలుగు వైపులా... మా నాలుగు కుటుంబాలకు".
"ఆ డబ్బు తో మాకోసం ప్రత్యేక గదులు వేరేగా కట్టించుకుంటాం ఉన్న ఇంట్లోనే... అన్ని సౌకర్యాలతో సహా. కాస్త డబ్బు బ్యాంకులో వేస్తాం... అదీ ఎక్కువ వడ్డీ వచ్చే స్కీం లో. కాస్త నెల నెలా డబ్బు రాబడి ఉండటానికి... అంతర-కలహాలకు తావు లేకుండా".
"ఒకే చోట కలసి మెలసి ఉంటాం కానీ జోక్యం లేకుండా - నెత్తికెక్కకుండ. అంటే, ఒక రకంగా విడిగా విడిగా కానీ కలసి మెలసి".
"ముందస్తుగా చర్చించుకున్నం... కావలసినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బ్రతుకుతాం... అదీ మంచి మాటలతో చేతలతో ఆచరణతో నిర్వహణతో. అప్పుడు ఏ గొడవలకు అవకాశం - ఆస్కారం ఉండదు".
"ఇప్పుడు కానీ లేక భవిష్యత్తులో మనవలు - మనవరాళ్లు పుట్టాక కూడా ఏ మనస్పర్ధలు - గిల్లి కజ్జాలు - టెన్షన్ - బి.పి. లేకుండా బ్రతుకుతాం. ఇలా ఉంటే వృద్ధశ్రమాలకు వెళ్ళే అవసరం అస్సలు పడదు ఎవ్వరికీ".
"పిల్లలు పుట్టకుండా ఉంటే... దత్తత ప్రక్రియ అవలంభించాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. పిల్లల పుట్టుక మన మానవ చేతుల్లో లేదు కాబట్టి".
"కాలక్షేపానికి తోట పని, వంట పని, చిన్న దుకాణం, వేరే ఉద్యోగం, ట్యూషన్ లు, అభిరుచులు, పుస్తక పఠనం, వాకింగ్ ఇతరత్ర పెట్టుకుని బిజీగా ఉంటాం అందరం. మంచి సంతోషం, ఆరోగ్యం, పొదుపు మూడూ కలిసొస్తాయి అందరికి. వేరే వేరే కాపురాలు, అద్దె లు, ఇతర ఖర్చులు అనేవి మిగులుతాయి... ఇలా ముందస్తుగా 4 కుటుంబాలు ముందే చర్చించుకున్నం".
"అందరూ దుబారా... తలకు మించిన ఖర్చులు చేయకుండా, అప్పులు చేయకుండా... ఇలా పొదుపుగా పెళ్ళిళ్ళు చేస్తే... మరియు జీవిత నౌక సాగిస్తే... డబ్బు ఆదా అవుతుంది... అవసరానికి పనికి వస్తుంది".
"కలసి ఉంటే కలదు సుఖం... సహాయాలు + పొదుపు కు కూడా ఎక్కువగా ఉపయోగ పడుతుంది... అన్ని విషయాల్లో... అని మా సూచన".
"ఆగండి... ఒక్క క్షణం ఆలోచించండి... ఇదే కదా "ఆదర్శ పెళ్ళిళ్ళు" అంటే... "ఆదర్శ జీవన ప్రయాణం" అంటే ???", అంటూ ముగించారు.
-------------------
4)
అందరూ చప్పట్లు కొట్టారు చాలా సేపు. "మేము ఇలాగే చేస్తాం దుబారా - ఆర్భాటాలు లేని పెళ్ళిళ్ళు... అప్పులు చేయకుండా పెళ్ళిళ్ళు... మంచి పొదుపు జీవనం - ఆదర్శ జీవన్ శైలి " అంటూ అరిచారు నూతన ఉత్సాహంతో.
అక్కడ పెళ్లి వేడుక ప్రాంగణం తేజోవంతం గా వెలిగి పోయింది ఆ క్షణంలో. సూర్యుడు రెండింతల సంతోషంతో ఉన్నాడా - వెలిగాడా అన్నట్టు.
---- "ఆదర్శ వివాహం - జీవనం" కథ సమాప్తం --------------
నీతి:
మంచి బ్రతుకులు + సుఖమైన జీవితాలు అంటే ఏమిటి???
1) ఆర్భాటం, దుబారా, తలకు మించిన ఖర్చులు - అప్పులు లేకుండా బ్రతకటం... ఏ విషయం లోనైనా కూడా.
2) కలసి ఉంటే కలదు సుఖం అంటే ఏమిటి???
...
జోక్యం లేకుండా, నెత్తికెక్కకుండా బ్రతకాలి... అదీ పొదుపుగా.
...
ఎక్కడి మాటలు అక్కడే మార్చిపోవాలి... ఇంకో చెవి నుండి వదిలేయాలి.
...
ప్రతి విషయాన్ని ఒక "సంతోష పూరిత నిర్వహణ - ఆనంద పూరిత పరిష్కారాల తీరు - నిర్మాణాత్మక త" ప్రణాళిక - project లా తీసుకోవాలి. అంటే???
...
తప్పులు లెక్కపెట్టడం, బలి పశువు చేయటం, హాని భూత తత్వం చూపించ కుండా... ఏ వైపు కష్టం - నష్టం కలగ కుండా... నిర్వహణ చేయాలి... ఎవరికి కావలసినట్టు వారికి మంచి మాత్రమే చేయాలి (అదీ నెత్తికెక్కకుండా)
3) ఎవరి పనిలో వారు - అభిరుచుల్లో (hobbies) + మంచి పుస్తక పఠనం లో ఇతరత్ర లో... బిజీ గా ఉండాలి.
4) అవసరం అయినప్పుడు సహాయం చేసుకుంటూ బ్రతకాలి. అలా అని జోక్యం - నెత్తికెక్కకుండా లేకుండా. కేవలం మంచి మాటలతో చేతలతో ఆచరణతో నిర్వహణతో... సహాయం చేసుకోవాలి.
5) ప్రతి విషయాన్ని... సంతోష పూరిత నిర్వహణ - ఆనంద పూరిత పరిష్కారాల తీరు - నిర్మాణాత్మక త తీరు తో చూడాలి - పరిష్కరించాలి.
6) మనిషి జీవితం అంటే... అనుక్షణం... నిర్మాణాత్మక ఆలోచనా తీరు + ప్రగతిబాట + అభ్యుదయం, ఐశ్వర్యం... కలబోసినదిగా ఉండాలి.
------------ కథ - నీతి సమాప్తం --------------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
Comments