top of page

అభిరాముడు

#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #Abhiramudu, #అభిరాముడు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Abhiramudu - New Telugu Story Written By  - Nandyala Vijaya Lakshmi

Published in manatelugukathalu.com on 24/06/2025 

అభిరాముడు - తెలుగు  కథ

రచన: నంద్యాల విజయలక్ష్మి


 మాధవ్, పద్మ ఆదర్శ దంపతులు. ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ, నమ్మకము. ఒకరి మనసు వేరొకరు నొప్పించక నవ్వుతూ సమస్యలను ఎదుర్కొంటూ జీవితము గడుపుతూ ఉంటారు. 


‘మీ ఇరువురికీ మధ్య నాకూ చోటు ఇవ్వండి’ అంటూ వారికి బాబు పుట్టాడు. పాలుగారే బుగ్గలు, నవ్వే కళ్ళు, చిన్ని మోము తో అందరికీ చూడగానే ముద్దు వచ్చేట్లు ఉంటాడు. 


"ఏమండీ! మన బాబుకు ఏమి పేరు పెడదాము " అడిగింది పద్మ. “నా కైతే రాముడిపేరు పెట్టాలి అని ఉంది.” 


“ఇంకేమి నీ ఇష్టము.. అలాగే. నీ రాముడు అందాలరాముడా తోటరాముడా టాక్సీ రాముడా” కొంటెగా అడిగాడు మాధవ్. 


“ఏ రాముడు అనేది కొన్ని రోజులతర్వాత చెప్తా.”


నెలలు గడిచాయి. మొదటి సంవత్సరము పుట్టిన రోజు ఘనముగా చేసారు ఆ దంపతులు. అయిదో సంవత్సరము రాగానే దగ్గరలో ఉన్న కాన్వెంట్ లో చేర్పించారు. ఆ రోజు పిల్లలు ఎందుకో అరచుకుంటున్నారు. రాము సంగతి తెలుసుకున్నాడు. 

“అందరూ ఒకసారి నా మాటవినండి. ఈ స్కూలులో చదువుతున్న వాళ్ళము అందరమూ ఒక కుటుంబములోని మనుష్యులాంటివారే. మనకు ఏది దొరికినా ఎవరేమి ఇచ్చినా అందరమూ పంచుకుందాము. గొడవలు వద్దు.’


ఏ కళన ఉన్నారో అందరూ సరే అన్నారు. ఒక రోజు పద్మ రాముకి ఇష్టమని చాక్లెట్ బాక్స్, అందమైన బొమ్మల స్కూల్ బేగ్, కొత్త లంచ్ బాక్స్ ఇచ్చి పంపింది స్కూల్ కి. ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చిన రామును ఏమైంది అని కంగారుగా అడిగింది పద్మ. 


"అమ్మా! నువ్వు కోప్పడను అంటే చెప్తా. దారిలో ఒక చిన్నబాబు ఆకలి వేసి ఏడుస్తూ కనిపించాడు. వాళ్ళ అమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ అటూ ఇటూ చూస్తోంది. నాకు చాలా బాధ వేసింది. అందుకని నా బాక్స్, బేగ్.. అన్నీ ఆ బాబుకి ఇచ్చా.” అన్నాడు అమాయకముగా. 


“సరే ఇది అయితే.. ఇంకముందు నీవి నువ్వు జాగ్రత్త పెట్టుకో” అంది పద్మ. 


సంక్రాంతి పండగ వస్తోందని నాలుగు గాలిపటాలు తెచ్చాడు మాధవ్. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి "నాకూ ఒకటి కావాలి " అంటూ గొడవ చేసాడు. రామూ వెంటనే ఒకటి ఇచ్చేసాడు. 


“అదేమిటి రా ? అవి మనకోసము” అన్నాడు కోపముగా మాధవ్. 

“ఏది ఉన్నా మనము అందరికీ పంచితే మనకే మంచిది.” నెమ్మదిగా అన్నాడు. 


“మన రాముడు అందరిలాంటివాడు కాడు వాడికి రాముడి సహనము, ప్రేమ.. అన్నీ మంచి లక్షణాలే. అందుకే నా రాముడిని ఇవాళనుండీ ‘ఆదర్సరాముడు’ అని పిలుచుకుంటాను. చెప్పినది చేసే ఆదర్శమూర్తి రాముని కి ప్రతిరూపము మనబిడ్డ” అంటూ మురిసిపోయింది పద్మ.


***

వృద్ధాప్యం - తెలుగు కవిత

 

సప్తతిలో అడుగుపెడితే వృద్ధాప్యానికి తొలిమెట్టుఎక్కినట్లే. తల్లీతండ్రీ అవలీలగా ఎత్తుకుని మోసిన ఈ తనువు భారముగా మారి ఈ బరువు మొయ్యవలిసినదే అంటూ హెచ్చరిస్తోంది. చేతులు పట్టు తప్పి అంచనాలు తారుమారవడము ఈడ్చుకుంటూ, ఉసురుసుమంటూ,  తప్పనిసరి అయిన పయనమే వృద్ధాప్య జీవనయానము. 


దృష్టి మందగించి పుస్తకములోని అక్షరాలు మసకబారినట్లు కళ్ళు చదవలేమని మూసుకుపోతూ, ఏ వ్యాపకమూ లేక ఒంటరిదై మనసు గోలపెట్టడము సహజ లక్ష ణాలుగా వృద్ధాప్యము చెప్పకనే చెపుతోంది. 


తనువు అలిసి చతికిలపడినా, మనసు పరుగులు దీస్తూనే ఉంది. ఏదో చెయ్యాలి అని తపిస్తూ మౌనము నీడలో తలదాచుకుంటూ ఇంటాబయటా సుహృధ్బావ వాతావరణము నెలకొనేందుకు శతధా ప్రయత్నిస్తూ విజయానికై ఆరాటము.. వృద్ధాప్యానికి సంకేతాలు. 

***


నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

Comments


bottom of page