top of page

ఆడపిల్ల



'Adapilla' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 31/03/2024

'ఆడపిల్ల' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


ఆడ పిల్ల లంటేను అంత చులకనెందుకు

తోడు నీడ వారలని తలువరెందుకు

తనకు జన్మ నిచ్చింది తల్లి ఆడదే

తనకు తోడ బుట్టింది చెల్లి ఆడదే

సహనానికి మారు పేరు సహజీవి ఆడదే

సహకారం అందించు సంస్కారి ఆడదే

తల్లితో సమంగ తన మేలు కోరుచుండు

ఇల్లాలు ఆడదే ఇంటామె ఆడదే

సోది చెప్పి తినిపించు తల్లి ఆడదే 

ఆదిశక్తి పరాశక్తి అన్ని ఆడదే

నీ వంశాన్ని నిలబెట్ట వశనిచ్చిన అత్త ఆడదే

మాతృమూర్తి వడిలోన మాయమౌను బాధలూ

మాతృ భాష నేర్చితేనె మనకు తెలుసు మంచి బోధలు                                            

అక్కలూ చెల్లెండ్రు అన్నలూ దమ్ములూ

చక్కనీ ఇంటికి సమ దిక్కులూ వారు

ప్రేమానురాగాలు పెంచుకొని చూస్తె

ప్రమదలందరు మనకు పంచ భూతాలు.


--సుదర్శన రావు పోచంపల్లి


49 views0 comments

Comments


bottom of page