top of page

ఆదర్శం ముఖ్యం

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AdarsamMukhyamu, #ఆదర్శంముఖ్యం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 68


Adarsam Mukhyam - Somanna Gari Kavithalu Part 68 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 28/04/2025

ఆదర్శం ముఖ్యం - సోమన్న గారి కవితలు పార్ట్ 68 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ఆదర్శం ముఖ్యం

----------------------------------------

గౌరవించు మనిషిని

పంచిపెట్టు మంచిని

కలనైనా ఎవరికి

తలపెట్టకు హానిని


లోపాలను వెదకకు

అవహేళన చేయకు

పరుల గుట్టు మాత్రం

దండోరా వేయకు


చేతనైతే గనుక

ప్రేమతో సరిచేయుము

వట్టి మాటలు వదిలి

ఆచరణ గావించుము


ఆదర్శం ముఖ్యము

సంస్కారం చాటుము

కృతజ్ఞత భావంతో

ree








అనుమానం...పెనుభూతం

----------------------------------------

రానియ్యకు అనుమానం

అదే పెద్ద పెనుభూతం

ఆవరిస్తే మాత్రం

బ్రతుకిక అతలాకుతలం


మానసిక వ్యాధితో సమం

అదే రేపును ఉన్మాదం

మనశ్శాంతి పోగొట్టును

పిచ్చి వాన్ని చేసేయును


దానితో ఆగడాలు

ఎన్నెన్నో లోకంలో

ఛిద్రమాయె కుటుంబాలు

కళ్లెదుటే సాక్ష్యాలు


ఆదిలోనే తరిమికొట్టు

దరి చేరక దూరం పెట్టు

ఉగ్రవాదం అనుమానం

కాపురాలు తుడిచిపెట్టు

ree













స్థిరమైనది స్నేహం!

----------------------------------------

గాలి వీస్తే దీపం

ఆరిపోక తప్పదు

రోజు గడిస్తే పుష్పం

వాడిపోక ఉండదు


నిదుర లేస్తే స్వప్నం

చెదిరిపోక మానదు

జారి విడిస్తే అద్దం

ముక్కలవక ఆగదు


ఎట్టి స్థితుల్లోనూ

మారనిదోయ్! స్నేహం

ఆపద వేళల్లో

అండ నిలిచేది స్నేహం


స్నేహానికి ద్రోహం

చేయకూడదు నేస్తం!

పవిత్రమైనది స్నేహం

చేయాలోయ్!న్యాయం

ree









కడలి సాక్షిగా!!

----------------------------------------

సునామీలు వచ్చినా

సుడిగుండాలెర్పడినా

సంద్రానికి భయంలేదు

కెరటాలే ఎగిసినా


రోజంతా ఘోషించినా

ఓడలెన్నొ పయనించినా

సాగరమే చలించదు

ఆటుపోట్లు దండెత్తినా


ధైర్యానికి సాక్షి కడలి

స్ఫూర్తినిచ్చేది కడలి

కష్టాలు ఎదురైనా

పోకూడదోయ్! హడలి


సముద్రాన్ని గమనించు!

దాని స్ఫూర్తి స్వీకరించు!

గడ్డుకాలం ఏతెంచినా

ఎదుర్కొన సాహసించు!

ree









ఆశయ సాధన ముఖ్యం

----------------------------------------

మంచి పేరు రావడానికి

చాలా సమయం పడుతుంది

దాన్ని కోల్పోవుడానికి

ఒక్క క్షణమే పడుతుంది


గాలిలో మేడలు కట్టడం

చాలా చాలా సులభతరం

కార్యాచరణే కష్టం

దాని ఫలితం అమోఘం


ఆశయమే లేకుంటే

సాధన ఎలా జరుగుతుంది

కాసింత ఆలోచించు

విజయమెలా వస్తుంది


జీవితంలో లక్ష్యం

తప్పకుండా ఉండాలి

దాని సాధన కోసం

అనిశం పోరాడాలి


-గద్వాల సోమన్న


Comments


bottom of page