'Adhika Sampada - Somaripothuthanam' New Telugu Story
Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
(ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
మీటింగ్ మొదలైంది. మాటల శబ్దంతో మీటింగ్ హాల్ అంతా గందర గోళంగా ఉంది. ఇంతలో యం. డి కిషన్ రెడ్డి గారు మీటింగ్ హాల్ కు వచ్చేశారు. ఆయన ముఖం చూడగానే కంపెనీ స్టాఫ్ అందరూ ఒక్కసారిగా నిశ్శబ్ధంగా ఆయనకు నమస్కరిస్తూ పైకి లేచి నిల్చున్నారు.
ఆయన సంస్కారంతో ‘అందరికీ నమస్కారం’ అంటూ కూర్చోమన్నాడు. అందరూ కుర్చీలో కూర్చొని
ఏమీ మాట్లాడకుండా ఉన్నారు.
యం. డి కిషన్ రెడ్డి గారు “అందరూ బాగున్నారా?? ఎలా
సాగుతున్నాయి పనులు?” అన్నాడు.
అప్పుడు కంపెనీ స్టాఫ్ “అందరూ బాగున్నాము సార్. పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి” అంటూ సమాధానం ఇచ్చారు.
అప్పుడు యం డి కిషన్ రెడ్డి గారు “మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా?” అని అడిగారు.
అప్పుడు స్టాఫ్ అందరూ “ఏమీ సమస్యలు లేవు సార్” అన్నారు.
వెంటనే టీమ్ లీడర్ అయినటువంటి లోకనాథ్ గారు “నేను ముందుగానే ఈ ప్రశ్నను అడిగాను సార్. వీళ్ళు ఏమీ సమస్యలు లేవు అని చెప్పారు” అన్నాడు.
“సరే లోకనాథ్ గారూ! నేను ఇప్పుడు ఒక సమస్య గురించి అడుగుతాను. అప్పుడు అందరూ మాకు ఈ
సమస్య ఉంది అని అంటారు చూడండి” అన్నారు యం. డి కిషన్ రెడ్డి గారు.
ఆయన “డియర్ టీమ్.. మీకు మేమిచ్చే ట్రావెలింగ్ అలవెన్స్ అమౌంట్ సరిపోవడం లేదు కదా?” అని ప్రశ్నించారు.
అప్పుడు టీమ్ అందరూ “అవును సార్! నిజమే.. అన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు ఎక్కువ ట్రావెలింగ్
ఆలవెన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి?” అని అన్నారు.
అప్పుడు యం. డి కిషన్ రెడ్డి గారు “మీరు అడిగిన ప్రశ్న సరైనదే. కానీ మేము ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉంది. మీకు ఇంతకు మునుపు చెప్పి ఉంటాను. కానీ మరొకమారు చెపుతున్నాను గుర్తుంచుకొండి” అన్నాడు.
“సరే సార్! తప్పకుండా.. చెప్పండి” అన్నారు టీమ్ అందరూ కలిసి.
“ దక్షిణాఫ్రికాకు చెందిన ఒక పెద్ద బిజినెస్ మాన్ మరియు ధనవంతుల్లో మొదటి ఐదు స్థానాలలో ఉన్న మిలీనియర్ అయిన ఒకాయనని ఇంటర్వ్యూ చేసే టీవి ఛానల్ వాళ్ళు “మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు కదా.. మరి మీ వారసత్వంగా వచ్చే వాళ్ళు ఇంకెంత గొప్ప స్థాయిలో
ఉండబోతున్నారు???? వీళ్ళు ఇంకెంత సంపాదించగలుగుతారు????” అని ఒక ప్రశ్న అడిగారు.
“అప్పుడు ఆ మిలీనియర్, “మా వారసులంతా రోడ్లపైకి వచ్చేస్తారు” అని చెప్పాడు.
ఆ మాటలు విన్న యాంకర్ చాలా ఆశ్చర్య పడిపోయి “ఎందుకు అలా జరుగుతుంది సార్? మీకున్న ఇంత ఆస్తిపాస్తులు ఎక్కడికి వెళ్తాయి?” అని అడిగారు.
అప్పుడు ఆయన “మా ముత్తాత గారు ఏమీ లేని సమయంలో
ఒంటెలపై ఎడారిలో చిన్న చిన్న పనులు, వ్యాపారం చేసి మా నాన్నకు కొంత ఆస్తిని సమకూర్చాడు. మా నాన్న గారు బాగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి చాలా ధనం, ఆస్తులు
మాకు ఇచ్చారు. మేము వాటిని బిజినెస్ ద్వారా కొంత మొత్తంలో రెట్టింపు చేశాం. అయితే ఇప్పుడు మా వారసులకి దీనిని కష్ట పెట్టకుండా ఇచ్చేస్తున్నాము. కాబట్టి ఈ ఆస్తి పాస్తులను మా వారసులు అమితంగా ఖర్చు చేసి, ఉన్నదంతా పోగొట్టుకుంటారు.
ఎందుకంటే కష్ట పడితేనే కదా.. ఆ కష్టం నుంచి వచ్చే ఫలితాన్ని, దానికి ఉన్న విలువను తెలుసుకుని జాగ్రత్తగా ఖర్చు చేస్తాం! అధికంగా ఉన్న ఆస్తులు, అంతస్తులు సోమరిపోతులను తయారు చేస్తాయి కానీ కష్టజీవులుగా తయారు చేయవు. ఎందుకంటే అదంతా ఉచితంగా వచ్చింది కాబట్టి. అంతే కాకుండా కష్ట పడకుండా వచ్చిన
దానికి మనం విలువ ఇవ్వం అని సమాధానం ఇచ్చారు”
అంటూ యం. డి కిషన్ రెడ్డి గారు ఆ జరిగిన
సంఘటనను వివరించి, “మీరు కష్ట పడండి. ఫలితం మిమ్మల్ని వెతుక్కుంటూ దానంతట అదే
వస్తుంది. మీరు ఐదు వందలు, వెయ్యి రూపాయల కోసం కాకుండా ఉన్నతంగా ఎదగడానికి కృషి చేయండి. మీకు మంచి అవకాశాలను కల్పించే భాధ్యత నాది” అంటూ వారికి హామీ ఇస్తూ వారిలో కష్టపడే తత్వంను పెంపొందించి ఉత్సాహాన్ని నింపారు.
కంపెనీ స్టాఫ్ అందరూ ‘సరే సార్’ అంటూ తమ విధుల్లోకి ఉత్సాహంతో వెళ్ళిపోయారు..... !!!!!
సర్వే జనా సుఖినోభవంతు
కిడాల శివకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
Podcast Link
Twitter Link
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
30/10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ నవతరం రచయిత బిరుదు పొందారు.
Comments