top of page
Original.png

ఆకలి కథ

Updated: Feb 4, 2025

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #Akali Katha, #ఆకలికథ, #Hunger

Akali Katha - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma

Published In manatelugukathalu.com On 29/01/2025

ఆకలి కథతెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


జానెడు పొట్ట కోసమే కదా 

ఈ బాధలు

రెండు మెతుకులు కోసమే కదా 

ఈ తాపత్రయం

బిచ్చగాడు లక్షాధికారి

ఇద్దరు తినేది ఒక నోటి తోనే

ఒక్కో చోట ఒక్కోలా

పరమాత్మ స్వరూపం లా 

అన్నం రొట్టె బ్రెడ్

నూడుల్స్ పిజ్జా 

గమ్యం కడుపులోకే

కడుపు నిండితె కదా

కవిత్వం పుట్టేది

ఆకలి తీరితె కదా

కేకలు ఆగేది

నా కంచం చుట్టూ 

లక్షల చీమలు ఆకలితో

అన్నిటినీ ఊదేసి నలిపేసి

నా అన్నం నేను స్వాహా

కథ కంచికి...



-బులుసు రవి శర్మ 




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page