top of page

ఆఖరి ఆకలి



'Akhari Akali' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 27/01/2024

'ఆఖరి ఆకలి' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఈ సృష్టిలో ఆడ మగ, చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో శత్రువుగా ఉండేది ఏదైనా ఉందంటే అది ఆకలి మాత్రమే. 


ఆకలిని జయించటం దాదాపు ఏ మనిషికీ సాద్యం కాకపోవచ్చు. ఈరోజుల్లో అనేక మంది అవినీతి, దొంగతనాలు, దోపిడీలుతో ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేస్తూ.. చంపుకుంటూ సంపాదిస్తున్నారు అంటే.. !దానికి కారణం ఆకలే. 


ఎందుకంటే.. 

 తాము బాగా సంపాదిస్తే... కానీ తమ వారసులుకు ఆకలి బాధలు, ఆర్థిక సమస్యలు తప్పవు. లేకపోతే వారి పరిస్థితి వేరేలా ఉంటే ఆకలితో అలమంటించాల్సిన పరిస్థితి వస్తుందని, అందుకే ఏం చేసైనా పెద్దగా ఆస్తులు, డబ్బు పోగేసుకుని తద్వారా భవిష్యత్ లో తమ వారిని ఆకలి కేకల నుండి తప్పించవచ్చని. 


ఇలాంటి ఆలోచనలు ఉన్న ఈ సమాజంలో కూడా కొందరు ఆహారాన్ని వృధా చేయటం చూస్తూనే ఉంటాం. 


ఇక ధనవంతులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాత్రం రుచిగా లేకపోయినా తినే అహారం పై కోపాన్ని ప్రదర్శించి మరీ విసిరేసే సందర్భాలు లేకపోవు. 


మణి ధనవంతులు ఇంటిలో పుట్టి పెరిగాడు. వడవడిగా ఐదో తరగతిలోకి అడుగుపెట్టాడు. ఆఫీసు పనితో బిజీగా గడిపే ఈరోజుల్లోని తల్లిదండ్రులకు పిల్లలకు మంచి బుద్దులు నేర్పించటం ఎలా వస్తుంది.. ?


పోనీ.. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు ఉంటే బాగున్ను కానీ.. ! ఏం చేస్తాం వాళ్ళకి దూరం పెట్టి భార్య పిల్లలతో మాత్రమే బతికే సమాజం అయిపోయింది. 


అయితే మణికి మాత్రం నాన్నమ్మ శారద రూపంలో మంచి విషయాలు చెప్పే మనిషి ఉంది. మణి నిజంగా చిన్నతనం నుండే చాలా పెంకితనంతో ఉండేవాడు. వాడు ఏది కావాలంటే అది తెచ్చి పెట్టాలి. లేదంటే వాడి అల్లరి అలాంటిది, ఇలాంటివి కాదు. ఏది పడితే అది విసిరేస్తు రచ్చరచ్చ చేస్తాడు. 


వాడి అల్లరికి తల్లిదండ్రులు మహేష్, శ్యామలలే సహనం కోల్పోతు.. మణి అసలు అల్లరి చేయకుండా ఏం కావాలంటే అది ఇచ్చేసే వాళ్ళు. మణికి పన్నెండేళ్ళు వచ్చినా ఎప్పుడు సరిగ్గా చేతులు పెట్టె బోజనం చేయడు. రుచిగా లేదని విసిరేస్తుంటాడు. అవన్నీ శారద ఓపిగ్గా ఓర్చుకుంటూ ఎప్పుడూ మణికి మంచి విషయాలు చెప్తు వాడిలో మంచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 


ఇంత చేస్తున్నా కూడా కన్న కొడుకు కానీ.. కోడలు శ్యామల కానీ ఏనాడూ శారదాకు గౌరవించలేదు. సరికాదా ఆమె ఇంట్లో ఉండటమే వాళ్లకు ఇష్టం ఉండేది కాదు ఎలాగో నెట్టుకొస్తున్నారు. మణిని చూసుకుంటుంది అని కానీ.. ఇప్పుడు మణి తల్లిదండ్రులు ఆఫీసుకి వెళ్ళినా... అతడు మరి చిన్నపిల్లడేమి కాదు. అందుకే తల్లిని వదిలించుకునేందుకు వారికి ఆసక్తి పెరిగింది. 


ఇదిలా ఉంటే ఒక రోజు ఆదివారం మహేష్ శ్యామలలు ఏదో ఫంక్షన్ కి వెళ్ళారు. ఇంట్లో మణి శారదాలు మాత్రమే ఉన్నారు. 


బోజనం పెడుతుంటే మణి రుచిగా లేదని అన్నాన్ని విసిరేశాడు. అన్నం చెల్లాచెదురుగా పడింది. శారదా మౌనంగా ఆ అన్నాన్ని ఊడ్చి మరలా పళ్లెంలో వేసి ఆ పళ్ళేన్ని, మణిని తీసుకుని బయటకు వచ్చింది. అలా కొంతదూరం వెళ్ళగా ఆకలితో పస్తులు ఉంటూ ఏ ఆధారం లేక రోడ్లపై బికారంగా తిరుగుతున్న పిల్లలకు ఇచ్చింది. ఆ అన్నాన్ని వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆత్రతగా అన్నం కడుపులోకి వెళ్ళగా ఆనందంతో వచ్చే కన్నీళ్ళని తుడుచుకుంటూ తింటున్నారు. 


మిగతాది గుడి ముందు ఉన్న బిచ్చగాళ్ళకి పెట్టగా వారు చేతులు జోడించి మరలా మణి తల పై చెయ్యి వేసి దీవించారు. ఈ రెండు సంఘటనలు మణిని తీవ్రంగా కలచివేశాయి. నాన్నమ్మ ఒక్క మాట కూడా అనకుండానే మణి తనలో తనకు తెలియకుండా తన మనసు కరిగిపోయింది. 


"బాబు మణి, ఏంటీ ఆలోచిస్తున్నావు. రుచిగా లేదని నువ్వు పారేసిన అన్నాన్ని వాళ్ళు ఎలా తిన్నార్రా... ? అన్ని ఉండి కూడా కావాల్సింది తినకుండా ఇలాంటి వంకలు పెడుతున్నాం. కానీ.. ! ఏమీ లేని వాళ్ళు చూడు రుచులతో పనే లేకుండా ఏది దొరికితే అది తింటూ కడుపు నింపుకుంటున్నారు. అన్నం రుచిగా లేదని పారేసే మనం అది కూడా లేని ఇలాంటి అభాగ్యులను చూసైనా మారాలి. 


ఉన్నవాళ్ళు తిన్నది అరగక తిరుగుతుంటే.. 

లేనివాళ్ళు కడుపు నింపుకోటానికి తిరుగుతున్నారు. 


నీకు ఎక్కువ అయి పారేసే ఎంగిలి కూడు, ఏమీ లేనివారికి ఒక విందు భోజనంలా ఉంటుంది. ఇకనైనా పద్దతిగా అల్లరి చేయకుండా ఉండు. అలాగే ఆకలి అనే గమ్యంను చేరుకోవాలంటే అభాగ్యులు ఎంత కష్టపడుతున్నారో.. ఆలోచించు. ఆకలి అందరికీ శత్రువే. ఈరోజు నువ్వు పారేస్తే రేపు నీకు ఆ అన్నం దొరకకపోవచ్చు. పదా " అంటూ తీసుకుపోయింది. 


ఇంటికి వచ్చి అన్నం వేసిన పళ్లెం ముందు కూర్చుని 

"దేవుడా! ఎవరు పండిస్తే ఈ అన్నం నాకు దొరుకుతుందో వారి కుటుంబం ఆనందంగా ఉండేలా చూడు " అని ప్రార్ధించడం శారదకు తృప్తినిచ్చింది. అక్కడితో శారదా, మణీల బంధం సరి. 

అవును. శారద ఆ తర్వాత రోజు నుండి తమ ఇంట్లో లేదు. మణి అడిగితే బంధువులు ఇంటికి వెళ్ళింది అని చెప్పారు. అలా శారదను మణి మర్చిపోయాడు. 


ఇప్పుడు మణి పెద్దవాడు అయ్యాడు. చదువు కొనసాగిస్తున్నాడు. మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. అంతేకాదు, తల్లిదండ్రుల సంపాదనలో కొంత ఏ ఆధారం లేని అభాగ్యులకు ఉచితంగా అన్నాన్ని పెడుతు వారి ఆకలి తీరుస్తున్నాడు. 


ఒకరోజు కాలేజీ క్యాంపు నుండి అందరూ విద్యార్థులుతో మణి ఒక వృద్దాశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. 

అక్కడకు వెళ్ళగా మణికి గుండె కలుక్కుమంది. అవును! బంధువుల దగ్గరకు వెళ్ళిందనుకున్న నాన్నమ్మ, విశాలమైన బంగ్లా లాంటి ఇళ్ళు, ఆస్తులు, కొడుకు, కోడలు మనుమడు ఇలా అందరూ ఉండే నాన్నమ్మ, ఏ ఆధారం లేని వాళ్ళకి నిలయమైన ఈ వృద్దాశ్రమంలో ఉండటంతో మణి కళ్ళలో కన్నీరు సముద్రాన్ని తలపించింది. ‘నాన్నమ్మా’ అంటూ శారదా ఒడిలో వాలిపోయి బిగ్గరగా ఏడ్చాడు. మణిని ఓదార్చటం శారదా, మరియు స్నేహితులు వల్ల సాద్యం కాలేదు. 


కొడుకు, కోడలు, మనుమడుతో.. ఉన్నంత కాలం సరదాగా గడిపాలని ఏ తల్లికి ఉండదు.. ! 

 శారదకి వాళ్ళని వదిలే ఉండటం ఇష్టం లేకపోయినా కొడుకు కోడలే స్వయంగా ఇక్కడికి చేర్చటంతో ఇంట్లో తాను ఉండటం వారికి ఇష్టం లేనప్పుడు వారి ఇష్టానికి అనుగుణంగా నడుస్తు తన ఆనందాన్ని మనసులోనే సమాధి చేసుకుంటూ బతుకుతుంది శారదా. 


మణి వేరే ఆలోచన చేయకుండా నాన్నమ్మను ఇంటికి తీసుకెళ్ళాడు. ఆఫీసు నుండి వచ్చిన తల్లిదండ్రులు శారదని చూసి షాక్ అయ్యారు. 


"అమ్మా.. నువ్వు ఎప్పుడు వచ్చావు".. ? ప్రశ్నించాడు మహేష్. 


లోపలి నుండి మణి వస్తు.. 

" ఈ రోజే నాన్న.. మీరు ఏ బంధువుల ఇంటికి నాన్నమ్మనీ తీసుకెళ్ళారో... ఆ బంధువుల ఇంటికి ఈరోజు నేను వెళ్ళాను. చాలా రోజులు అయింది కదా అందుకే తీసుకొచ్చా " అన్నాడు వెటకారం చేస్తూ


ఆ మాటలకు తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇంకా తేరుకోనే లేదు. 


"చూడండి, నాకు జన్మనిచ్చారు. కానీ.. ! నాకంటే ఎక్కువ సమయం మీరు ఆఫీసు పనికే కేటాయించారు. అన్ని తానై పాఠశాలలో కూడా నేర్పని ఎన్నో మంచి విషయాలను నేను నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. అలాంటి నాన్నమ్మను, నన్ను దూరం చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. రేపు నేను కూడా మీకు అలా చేస్తే మీరు ఎంత క్షోభ అనుభవిస్తారో.. 


నాన్నమ్మకు మీరంటే ఎంత ఇష్టం. అది మీకు తెలియని విషయం కాదు. తాను చివరి శ్వాస వరకు ఈ ఇంట్లోనే ఉండాలి. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేస్తే నేను ఊరుకోను. 

చివరగా ఒక్క మాట.. మిమ్మల్ని వదిలేసి ఉండలేని ఏ మనుషులనైనా నిర్ధాక్షిణ్యంగా వదిలివేయకండి" అన్నాడు. 


నాన్నమ్మ సహాయంతో, మనసు మార్చుకున్న తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇప్పుడు మణికి ఒకటే ఆకలి. అది తన కంటికి ఏ ఒక్కరు ఆకలి బాధతో కనపడకూడదని. అది తన ఆఖరి ఆకలి కూడా.. అంటే చివరి శ్వాస వరకు ఈ ఆకలి తీరదన్న మాట. 

****** ****** ****** ******


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం






52 views0 comments
bottom of page