top of page

బ్రమ్మమొక్కటే'Brammamokkate' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 23/01/2024

'బ్రమ్మమొక్కటే' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


భిన్నత్వంలో ఏకత్వం అని మన దేశానికి పేరే కానీ.. ! ఆచరణలో మాత్రం మచ్చుకైనా కనపడదు. 


 బ్రమ్మమొక్కటే. కానీ.. 

ఈరోజుల్లో ఎక్కడ చూసినా.. కుల, మత కొట్లాటలు లేని ప్రాంతం కనపడదు. 


బ్రహ్మం అంటే ఏమిటి.. ? ఆత్మ. ఆత్మనే పరమాత్మ అని కూడా అంటారు. ఈ ఆత్మ అన్ని శరీరాల్లో కూడా ఉంటుంది. 

 ఆ ఆత్మే పరబ్రహ్మము. ఇది నశించనిది, క్షిణించనిది‌, మరియు చచ్చిపోనిది. అలాంటి భేదాలు చూపకూడని ఈ సృష్టికి కులం, మతము అంటూ మనుషులను విడదీస్తూ మనసులను దూరంగా నెట్టేస్తూ బతుకుతున్నారు


 ఈరోజుల్లో ఒక వ్యక్తి ఎక్కడకి వెళ్ళినా.. ఏ పని చేయాలన్నా ముందు అతడి కులము, లేదా మతము తెలియాల్సిందే, ఆరాతీయల్సిందే. అంతగా ఈ దేశం కుల మతాలతో ముడిపడిపోయింది. చివరకు మనం చేసే ఉద్యోగం కూడా కులం చూసి మతం చూసి ఇవ్వటం, అంగీకరించటం అందరికీ తెలిసిందే. 


స్వతంత్రం రాకముందు మరియు స్వాతంత్య్ర పోరాట సమయంలో మన దేశంలో ఏ కుల కొట్లాటలు లేవు. ఏ విభేదాలు లేవు. ఏ అహంకారం లేకుండా ఒకే కంచంలో అన్నాన్ని ఒక్కో ముద్ద పంచుకుని తిని భేదం అనే మాటకు అర్థం తెలియనంతగా ఉండేవారు. వారంతా అలా కలిసి పోరాడటం వలనే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. 


అయితే.. స్వతంత్రం వచ్చాక రాను రాను మన దేశంలో మనుషుల మధ్య వైర్యం పెరిగిందనేది జగమెరిగిన సత్యం. 


 ప్రస్తుతం మన దేశంలో సమానత్వం అనేది ఎక్కడ కూడా కనపడని, దొరకని ఒక ఆయుర్వేదం లాంటిది. 


జీతాలు పెంచలేదని ధర్నాలు చేసి రచ్చ రచ్చ చేసే ఈ మనుషులు బ్రమ్మమొక్కటే, పరబ్రహ్మము ఒకటే అని గొంతెత్తి చెప్పరెందుకు.. ?


ఈ భూమి పై ముఖ్యంగా బ్రమ్మమొక్కటే ప్రజలంతా సమానమే అని చాటి చెప్పగలిగే కొన్ని రంగాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి

 ఉపాధ్యాయు రంగము, వైద్యరంగము న్యాయ రంగము 


ఈ సృష్టిలో అందరు మనుషుల భాషలు వేరే కానీ భావం ఒక్కటే అని, మనుషులు వేరే అయినా మనసులు ఒక్కటే అని బోధన ద్వారా, మరియు అందరు విద్యార్థులను ఒకేలా చూస్తూ కలుపుకుపోయి ఇదే విషయాలు ప్రతి విద్యార్థికి చెప్పి తద్వారా సమానత్వాన్ని పెంపొందించవచ్చు. కానీ నేటి ఉపాధ్యాయుల తీరులో, పాఠ్యాంశాలలో సమానత్వం చూపించగలిగే అంశాలు దాదాపు లేవు. 


ఇక కులాలు, మతాలు వేరైనా.. అందరి రక్తం ఒక్కటే అని, ఏ కులపు మనుషులైనా.. ఏ మతపు మనుషులైనా తారతమ్యం లేకుండా వైద్యం చేసి వారి ప్రాణాలు నిలపగలిగి అందరూ సమానమనే బావనను పదిమందికి కలిగేలా చేసే సత్తా ఉంది. కానీ... ఈ రంగం కూడా భేదం చూపుతు వైద్యం చేస్తుండటం బాధాకరం. 


పేద, ధనిక, కులం, మతం తేడాలు లేకుండా అందరికీ ఒకేలా న్యాయం చేసి అందరిలో మార్పు తీసుకురాగలరు కానీ.. ఈ రంగం కూడా వాటిని తుంగలో తొక్కి డబ్బు ఇచ్చేవాడికి ఒక న్యాయం, ఇవ్వని వాడికి ఒక న్యాయం చేస్తూ సమానత్వం అనే మాటను భ్రష్టు పట్టించాయి. 


ఇక 

సమానత్వం అనే పదాన్ని నిర్లక్ష్యం చేసే వాటిలో నేటి రాజకీయాలు తొలి స్ధానంలో ఉంటాయి. 


ప్రభుత్వాలు మనుషులను వివిధ వర్గాలుగా విభజించి పాలిస్తాయి. 


నాయకులను కూడా కులం మతం భేదాలు చూసి ఎన్నుకుంటున్నారు. 


విద్యావ్యవస్థలో కూడా ఈ విధానాన్ని రూపుమాపలేకపోతున్నారు


కొందరు విద్యార్థులను అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉపాధ్యాయుల చేష్టలు మేధావులకు ఆశ్చర్యం కలిగించక మానవు. 


ఒకప్పుడు ఇళ్ళు కడితే బయట అందరూ వచ్చి కూర్చోటానికి అరుగులు వేసేవాళ్ళు. అప్పట్లో ఏ దొంగలు వచ్చేవారు కాదు. 

నేడు మాత్రం ఇంటికి తోటివారు ఎవరూ రాకుండా గేట్లు వేసుకుంటున్నారు. కానీ.. ! దోపిడీ దొంగలును మాత్రం ఆపలేకపోతున్నారు. 


బ్రమ్మమొక్కటే... పరబ్రహ్మము ఒక్కటే అని ఆలోచించకుండా బతికే ఈ మనుషులు అసలు ఎవడు పండించే పంటను తింటున్నారు.. ? 


అంటరాని వాళ్ళని వెలివేసే అహంకారులు ఆ అంటరాని వాళ్ళు కూడా నడిచే ఈ నేలపైనే ఎందుకు నడుస్తున్నారు. 


ఒక నాయకుడికి అన్యాయం జరిగితే ఆ నాయకుడి కులం అందరికీ అన్యాయం జరిగినట్లు రగిలిపోయే మనుషులు.. నిజంగా నాయకుడు వాళ్ళకి కూడు పెడతాడా..... ! పెట్టడు. 


ఏ కులానికి ఆ కులం ఉపాధ్యాయులు, ఏ కులానికి ఆ కులం వైద్యులు, ఏ కులానికి ఆ కులం న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉండనపుడు మనుషులు మధ్య ఈ తారతమ్యం ఎందుకు.. ? 


కులము కూడు పెట్టదు. , 

మతము మరణాన్ని ఆపదు. 

బ్రమ్మమొక్కటే. మనుషులారా.... ! కులము మతము అనే ఆయుధాలు లేకుండా బతుకు అనే యుద్ధం చేద్దాం. ఆ యుద్ధంలో మనందరం గెలుస్తాం. ఆ యుద్ధంలో మన గమ్యం మానవత్వం. 


****** ****** ****** ******


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


43 views1 comment
bottom of page