top of page

అలారం 'Alarm' - New Telugu Story Written By Sivajyothi

Published In manatelugukathalu.com On 07/05/2024

'అలారం' తెలుగు కథ

రచన: శివ జ్యోతి


నిద్ర అల్లు అర్జున్ లా ఉత్సాహంగా వస్తుంటే, అలారం అలీలా నీరసముగా ఉంటానని అంటోంది. 


రాత్రి అయిందో లేదో.. 

పడుకుని ఉన్నాం అనుకొన్నామో కాదో.. 


ఇంతలో అంతలా అలారం అలీ గారు నేనున్నాను అని బాధ్యత, నిబద్ధత, బాధలు, ఇల్లు, పరివారం, పరిసరాలు, వంటలు, వార్పులు, గుడ్ మార్నింగ్ మెసేజ్ లు, పలకరింపులతో అదేపనిగా ప్రభాస్ లాంటి కలల రాకుమారుడిని పక్కకు తోసేసి మరీ తయారు అవుతారు నేనున్నాను అని పని పురమాయింపుతో. 


ఇహ ఆ అలారం శబ్దం ఉందే.. ఇలలో ఎంత సుప్రభాతం ఐనా కలలో ఉన్న మనకు 100 డెసిబెల్ మోత లాగా మనకు మాత్రమే వినిపిస్తుంది. మిగతా పరివారముతో నిద్రా దేవి సమంత లా మగతగా కనికరించి వినపడనివ్వదు. వారు నిద్రా దేవి ఒడిలో కలల బడిలో పట్టభద్రులు అయ్యాక గానీ బయటకు రారు. మనకు అ అలారం ఆ ఆయన అని నేర్పి బడి మాన్పి బాధ్యతల గారికి కట్టారు. 


అలారం.. నీ దౌర్జన్యాన్ని ఇక మేము ఓర్వం. ఇవాళ ఆదివారం. మొదలైంది తిరుగుబాటు పర్వం. మేము ఆడువారం. అందుకే తెలుసు గెలవడం అసాధ్యం. అలారం గారు.. మేము మీకు సర్వదా నిబద్దులమే. మా కోసం నిద్ర అనే అల్లు అర్జున్ గారు మీతో పోటీ పడి గెలిస్తే.. 


జరగ కూడదా ఒక 

మ్యాజిక్ 


వినపడ కూడదా నిశ్శబ్దం అనే మ్యూజిక్ 


తెలుసు ఇది కాదు లాజిక్ 


జీవితాంతం రభస కాదా ట్రాజిక్ 


తీసుకో ప్రేమ అనే టానిక్ 


ఎందుకు అవుతావు సైకిక్. 

***

శివ జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం:

నా పేరు శివ జ్యోతి . నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. నాకు రచనలపై ఉన్న ఆసక్తితో కథలు రాయడం కవితలు రాయటం మొదలు పెట్టాను . నాకు సమాజంలో జరిగే అన్యాయాలను ఆసక్తికరంగా రాయడం అంటే ఇష్టము. నా రచనలు పాఠకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.


99 views1 comment

댓글 1개


Nice story, All the best 👍

좋아요
bottom of page