top of page

మిస్ యూ అమ్మా.. ! పార్ట్ 1



 'Miss You Amma - Part 1/2' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 06/05/2024

'మిస్ యూ అమ్మా.. ! పార్ట్ 1/2' పెద్దకథ ప్రారంభం

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



సారిక సెల్ తీసి చూస్తే ఎవరిదో కొత్త నంబర్ నుండి కాల్ వచ్చింది. 'ఇది ఎవరయి? ఉంటారు. సర్లే చేసి చూద్దాం.. !' అని కాల్ చేసింది ఆ నంబర్ కి. 


 "హల్లో! ఎవరండీ? నా సెల్ కి కాల్ చేసింది" అంది సారిక. 


అటునుండి "నేను వసంత, నువ్వు మా ఫ్రండ్ రమణ వాళ్ల అమ్మాయివేనా.. !" అంది వసంత. 


"అవునండీ!" అంది సారిక. 


నేను.. ! మీ అమ్మ ఫ్రెండ్ ను, మీఅమ్మ.. ! నేను కలసి సిక్స్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు కలసి చదువుకున్నాం. "


 "మీ.. రు.. వసంత కదా.. ! నేను ఇప్పటి వరకు మిమ్ములను చూడకపోయినా.. మా అమ్మ, ఎపుడూ మిమ్ములను తలచుకుంటూ ఉండేది. అందువల్ల మీరు నాకు తెలుసు. "


 "కానీ.. సారి సారికా! మీఆమ్మ సూసైడ్ చేసుకుందిటా, నేను చాలా షాక్! పోయిన నెలలో ఇండియా వచ్చినప్పుడు తెలిసింది. ఇపుడు నువ్వు ఫ్రీ గానే ఉన్నావా! మాట్లాడవచ్చా?" అంది. 


 "షూర్ ఆంటీ!" అంది సారిక. 


"ఇది ఎలా జరిగింది!? సారికా.. ! మీ అమ్మ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు. " 


"అదే ఆంటీ.. ! మాకు కలగానే వుంది ఇదంతా!"


 "మీరు ఇద్దరు అమ్మాయిలట కదా!" 


"అవునాంటి! నేను, మా అక్క.. !"


"పాపం మీరు సరే! మీ నాన్నగారికి ఇది పెద్ద దెబ్బ అవునా!" 


"ఆయన అలా ఏమి? అనుకోవటం లేదు లెండి. " ఆ మాటలో కొంచం వ్యంగ్యం ధ్వనించింది. 


 ఇక సాగదీయ కూడదని వసంత, “ఇపుడు నువ్వేమి? చేస్తున్నావు!"అంది. 


"అమెరికాలో ఎంఎస్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నా.. ! ఆంటీ!"


నువ్వు ఇపుడు అమెరికాలో ఎక్కడా.. !?" అన్నది వసంత. 


"న్యూయార్క్ ఆంటీ!" అంది. 


 "నేను న్యూజెర్సీలో ఉంటాను, దగ్గరే కాబట్టి ఒకసారి మా ఇంటికిరా!"


 'ఒకసారి ఈమెను కలవాలనుకుని' మనసులో "వస్తాను ఆంటీ.. !" అంది సారిక. 


తర్వాత సారిక ఒకసారి కాల్ చేసింది. "ఆంటీ ఈ వీకెండ్ మీరు ఖాళీయేనా!" 


"రామ్మా! సారికా.. ! మేము ఎక్కడికి వెళ్ళటం లేదు” అన్నది వసంత. 


సారిక వచ్చింది సోఫా చూపించి "సారికా.. రా! కూర్చో.. !" అంది వసంత. 


సారిక వసంతను చూస్తూ 'ఈవిడ, అమ్మ దగ్గర వున్న ఫోటోలో లాగానే వుంది. కాకపోతే వయసు వల్ల వచ్చే చేంజెస్ అంతే. కొద్దిగా వళ్ళు చేశారు. కానీ, బావున్నారు ఆంటీ.. !' మనసులో అనుకుంది సారిక. 


 "కాఫీనా టీనా? ఏమి తాగుతావు సారికా!" అన్న వసంతతో "ఏదైనా పర్లేదు ఆంటీ!" 


"ఒకే కాఫీ తెస్తాను కాఫీ తాగుతూ ఇద్దరం మాట్లాడుకుందాం!" అంటూ లోపలికి వెళ్ళింది వసంత. 


ఈ లోపు ఇల్లు పరికించి చూసి 'చాలా బాగా సర్డుకున్నారు' అనుకుంది సారిక. 


 వసంత కాఫీ చేతికి ఇస్తూ! "చెప్పు సారికా.. ! ఏంటి? కబుర్లు" అంది. 


"మీరే చెప్పండి ఆంటీ.. ! మా అమ్మ గూర్చి!" ఆసక్తిగా అడిగింది సారిక. 

 

 "సారికా.. ! నువ్వు అచ్చు మా ఫ్రెండ్ రమణలాగా వున్నావు. " 


"అవునా థాంక్స్ ఆంటీ!" అంది. 


"నేను, మీ అమ్మ.. ! ఎలా వుండేవాళ్ళమో.. ? చెప్తాను. " 


అమ్మా.. ! అనగానే సారిక మొహంలో భాద కనపడటం గమనించి వసంత తనని నవ్విద్దామని. తన చెయ్యి రింగులు తిరిగే లాగా చుడుతూ.. చెప్పటం మొదలెట్టింది. 

 

"అవి మేము కాలేజ్ చదివే రోజులు. వినెక్ జాకెట్టులు "లంగా ఓణీలు వేసుకొని కాలేజికి వెళ్ళే వాళ్ళం. కాలేజ్ కి వెళ్ళే దారిలో మీ అమ్మ ఇల్లు ఉండేది. నేనూ.. !, గీత అని ఇంకో ఫ్రెండ్ వుండేది. మేమిద్దరం కలసి మీ అమ్మను పిలుచుకుని కాలేజుకు వెళ్ళేవాళ్ళం. 


 మాముగ్గురులో మీ అమ్మ బాగా చదివేది. నాకు మీ అమ్మకు చదువులో పోటీ వుండేది. అస్సలు చదవలేదంటూ! ఇద్దరం బాగా చదివి బాగా మార్క్స్ తెచ్చుకునే వాళ్లము. 


నేను బాగా నవ్వించి సైలెంట్ గా కుర్చూనేదాన్ని. పాపం మీ అమ్మా..  గీత, లెక్చరర్స్, చేత తిట్లు తినేవాళ్ళు వచ్చే దారిలో నన్ను..  మీ అమ్మా, గీత న’వ్వించవద్దు మమ్ముల్ని.. !’ అని తిట్టేవాళ్ళు. 

 

శనివారం మా కాలేజీ కి హాఫ్ డే. మధ్యాన్నం పక్కన వుండే టౌన్ లో రిక్షా ఎక్కి సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆరోజులే వేరు సారిక. మొదట నా పెళ్లి అయిపోయింది. మీ అమ్మ ఒక్కతే కూతురు. మీ తాతా, అమ్మమ్మ వాళ్లు కూలి నాలి చేసి చదివించేవారు. మీ అమ్మ అపుడు చెప్తూ.. వుండేది. నేను మంచి జాబ్ తెచ్చుకుని మా అమ్మానాన్నలను చూసుకోవాలని. 

 

 నేను మా వూరు వెళ్ళినప్పుడు మీ తాత కనపడి చెప్పాడు. మీ అమ్మకి జాబ్ వచ్చిందని, పెళ్లి అయిందనీ. తర్వాత మావారికి అమెరికాలో జాబ్ రావటం వల్ల నేను ఇటు వచ్చేసాను. మా అమ్మ వాళ్ళు కూడా ఆ ఊరిలో లేక పోవటం వల్ల మీ అమ్మ విషయాలు ఏమి తెలీదు? తర్వాత నాకు. 


 మొన్న ఇండియ వచ్చినప్పుడు నే పుట్టిన వూరు చూద్దామని వెళ్ళాను. మీ అమ్మమ్మనీ వెళ్ళి పలకరించా. అపుడు ఏడుస్తూ చెప్పింది "నాపిల్లని చంపేసారమ్మా! ఈ ఇల్లు అదే కట్టించింది. మాకు డబ్బులు కూడా పంపేది. ఇపుడు మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా?" అని ఏడిచింది. "ఎంతమంది పిల్లలు రమణకు.. !" అంటే "ఇద్దరు అమ్మా.. !" అంది. 


 పాప ఫోన్ నంబర్ ఇవ్వమంటే.. నీ నంబర్ ఇచ్చింది. నువ్వు అమెరికాలో వున్నావని చెప్పింది. అపుడు ఆనంబర్ కి నీకు కాల్ చేశా. ఇపుడు ఇంక మీ అమ్మ సంగతి చెప్పు!" అంది వసంత


 మా అమ్మకు జాబ్ వచ్చిన తర్వాత మానాన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మా అమ్మానాన్నను చూసుకుంటానని చెపితే.. మా నాన్న దానికి ఒప్పుకుంటేనే.. పెళ్లి చేసుకుంది అమ్మ. 


 నాన్నతో పెళ్లయిన కొన్నాళ్ళు సుఖపడింది అంతే అమ్మ.. !. 


 మా నాయనమ్మ వాళ్లకు మా అమ్మ అంటే..  ఇష్టం లేదు. ఆమెకు మా నాన్న ఒక్కడే అబ్బాయి. ఆమెకు పెద్ద కూతురు, కూతురుని నాన్న చేసుకోలేదని కోపం. ఇంకో కూతురు మాకు దగ్గరలోనే వుంటుంది. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. మా అక్క పుట్టిన దగ్గర నుండి అమ్మకు కష్టాలు మొదలయ్యాయి. మా నాయనమ్మ వాళ్ళు అమ్మకు అబ్బాయి పుట్టలేదని గొడవ. ఇంకా నాన్నకు అమ్మ మీద లేనిపోనివి చెప్పేవాళ్ళు. నాన్న వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అమ్మను తిడుతూ.. ! వుండేవాడు. దానికి అమ్మా.. వాళ్ళను ఏమనలేక.. మనసులోనే కుమిలిపోయేది

 

"అవును మీ అమ్మ చాలా సెన్సిటివ్. చాలా కరెక్ట్ గా వుండేది, ఎదుటి వాళ్ళు కూడా అలా వుండాలనుకొనేది. ముక్కుసూటి మనిషి. ఒక్కోసారి మనం పరిస్థితులకు మారాలి అంటే "నేను అలా మారలేను అనేది, అవసరానికి ఒక రకంగా తర్వాత ఒక రకంగా నేనుండలేనూ! అనేది. మాట మార్చే వాళ్ళను మీ అమ్మ చాలా దూరంగా వుంచేది"

 

"భలే కరెక్ట్ గా చెప్పారు ఆంటీ.. ! మా అమ్మ మెంటాలిటీ. దీన్ని నాయనమ్మ వాళ్ళు బాగా క్యాష్ చేసుకున్నారు. పని చేయించుకునే వారు. మళ్ళీ మాకు ఒక్కవసరానికి కూడ ఉపయోగపడే వాళ్ళు కారు. 

మా నాన్నకు, ఈగో కొంచం ఎక్కువ. మా తాత ఆస్థిని మా నాయనమ్మ తదనంతరం మా నాన్నకు దక్కేలా! రాశారు. దీనితో మా నాన్నకు తనకి ఆస్తి ఇవ్వదనీ వాళ్లమ్మ.. ! ఏది చెపితే, అది రైట్ అనేవాడు. 


వాళ్ళు చాలా మెత్తగా మీ ఆవిడ సంపాదించింది అంతా మీ అత్తామామలకు ఇస్తుందని చెప్పేవారు. దానితో ఆయన అమ్మను తిట్టటం. అపుడు అమ్మ "మా వాళ్ళకు నేను ఒక్కదాన్నే.. ! వాళ్ళని చూసుకుంటాను అంటే మీరు ఒప్పుకునే.. నన్ను చేసుకున్నారు. ఇపుడు మాట మారుస్తున్నారు" అని అరిచేది. 

 

 నేను మా అమ్మానాన్నలను చూసుకోలేకపోతున్నాను అని బాధ పడేది. లోన్ తీసుకొని వాళ్లకు చిన్న ఇల్లు కట్టించింది. కొంత డబ్బు పంపేది. ఇది తెలిసి నాన్న అమ్మ జీతం తనకు ఇవ్వాలని గోల చేసేవాడు. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


55 views0 comments
bottom of page