top of page

మిస్ యూ అమ్మా.. ! పార్ట్ 2



 'Miss You Amma - Part 2/2' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 10/05/2024

'మిస్ యూ అమ్మా.. ! పార్ట్ 2/2' పెద్దకథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



జరిగిన కథ:

సారిక తన తల్లి స్నేహితురాలు వసంతను కలుస్తుంది.

సారిక తల్లి రమణ ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది వసంత.

తల్లి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు చెబుతూ ఉంది సారిక. 



ఇక మిస్ యూ అమ్మా.. ! పార్ట్ 2 చదవండి.    


ఈ గోలల్లో అక్కది డిగ్రీ అయింది నేను బిటెక్ లో వున్నాను. మా అక్కను రెండో అత్త కొడుకుకు ఇవ్వాలని మా నాయనమ్మ పేచి పెట్టింది. మా అమ్మ వాళ్ళకి పెద్దగా చదువు లేదనీ.. ! వద్దంది. వాళ్లకు అన్నీ అవలక్షణాలని వాళ్లకు ఇచ్చి చేస్తే.. ! ఇప్పటికే నేను వాళ్ళతో వేగలేక పోతున్నా! అక్కా.. ! వాళ్ళతో వేగలేదని అమ్మ ఆలోచన. 


 నాన్నకి అక్కని బావ కీచ్చి చేస్తే నాకు ఎటూ.. !కొడుకులు లేరు మా అమ్మ నా కిచ్చేది వాళ్లకీ ఇస్తే.. ఆస్తి బయట వాళ్లకి వెళ్లదని.. మా నాన్న ఆలోచన. ఆయన ఏది చేసినా! రెండు రకాలుగా లాభం వుంటేనే.. ! చేస్తాడు. 


 మా నాన్న ఎపుడు ఆఫీస్ వర్క్ తో బిజీ మమ్మల్ని పెద్దగా ముద్దు చేసింది లేదు. అన్నీ! అమ్మే.. ! చూసుకునేది. మానాన్న జీతంలో లోను తీసుకొని ఇల్లు, కారు కొన్నాడు. వాటిని తీర్చటం మిగతా వాటితో ఆయన బట్టలు, చెప్పులు, సెల్ కొనుక్కోవడం చేసేవాడు. ఆయన వరకు ఆయన హ్యాపీగా ఉండేవాడు


 ఇంటికి కావాల్సినవి తెస్తూ.. మాకు బట్టలు ఇంకా ఏమి కావాలంటే అవి కొనేది అమ్మ. తనకంటూ ప్రతేకంగా ఏమి కొనుక్కొనేది కాదు. మా అక్క మొదట్లో బానే వుంది అమ్మతో. 


 నాయనమ్మ నాన్నతో నీ పిల్లను నీ అక్క కొడుక్కి ఇస్తేనే.. ఆస్తి ఇస్తా.. అనటంతో నాన్నా.. ! అక్కను ముద్దు చేయటం ఏవి అడిగితే అవి కొనిస్తూ "బావను పెళ్లి చేసుకో.. !" అని చెప్పేవాడు. 


 మా అత్తవాళ్లు మీ అమ్మకు.. ! మేము ఇష్టం లేదు జాబ్ చేస్తుందని మమ్ములను తక్కువ చూస్తుందనీ.. ! చెప్పేవాళ్ళు అక్కతో. అమ్మకు పద్ధతిగా! లేకపోతే ఎప్పటి పని అపుడు చేయక పోయినా అక్కను తిట్టేది. 


 మా పక్కనే వుండేది మా నాయనమ్మ. ఇప్పటికీ నేనూ.. ! మీ అత్తవాళ్లకి ఒక పని చెప్పలేదు. మీ అమ్మ మీకు ఏమి? పనులు చెపుతుంది" అనేది. 

దానితో అది నానమ్మ, అత్తవాళ్ళు, మంచి వాళ్ళనుకుని వాళ్లతో మాట్లాడేది. మా అమ్మా.. ! మా అక్క

 వాళ్ళతో మాట్లాడుతుందని తిట్టేది. 


 అపుడు నాన్న ఎంటరయి, "దాన్ని తిట్టకు? అని అక్కను ముద్దుచేస్తూ.. ! మీ అమ్మకు నువ్విష్టం లేదు మీచెల్లి అంటే ఇష్టం అది తిడితే.. వురుకోవాకు అని చెప్పేవాడు. ఈ పిచ్చిది మా అక్క, అమ్మని ఎడిపించటానికి.. ! నేను బావని చేసుకుంటానని ఒకటే గొడవ. 


 ఈ గొడవలప్పుడు నేను ఎంఎస్ చేయటానికి అమెరికా వచ్చాను. అమ్మ ఫోన్ లో అంటూ వుండేది "నాకు బ్రతకాలేని లేదు సారిక. "

 "అమ్మా.. ! అలా అనకు నాకు జాబ్ వస్తే ఇక్కడికి వద్దువు కాని, అని ధైర్యం చెప్పేదాన్ని. "


 మరి మీ అక్క ఏమనేది?" అంది వసంత. 

అక్కకి కాల్ చేసి అమ్మతో.. ! మాట్లాడు అంటే.. , ! "ఇలా వుండు అలా వుండు.. ! జాబ్స్ కు అప్లయ్ చెయ్యి ఒకటే క్లాస్లు తీస్తుంది. నాన్న చెప్పినట్లు బావని చేసుకుని ఈమే గోల నుండి బయటపడతా. అమ్మా.. ! ఎపుడు ఆమె సైడ్ ఆలోచిస్తుంది. నా సైడ్ ఆలోచించదనేది. ఇలా అక్కా.. !, నాన్న టార్చర్ తో అమ్మ వెక్స్ అయిపోయింది 


 పెళ్లి, పిల్లలు గూర్చి ఎన్నో కలలు కన్నది అమ్మ. కానీ ఆ ఇంట్లోనే తనకి సపోర్ట్ లేకపోవటం, సొంత పిల్ల కూడా అర్థం చేసుకోలేక పోయేసరికి కుంగిపోయింది. బయట ఎంత మంచి అనిపించుకున్నా! ఇంట్లో వంటరి పోరాటమే చేసింది. 

 

 ఎంతో ప్రశాంతంగా బతకాలనుకుందో? అంత జీవితం ఇంకా కష్టంగా మారుతుంటే.. నేను పోతే వీళ్ళు మారుతారు అనుకుంది పిచ్చమ్మా.. ! అందుకని తన జాబ్ ను మా అక్కకు వచ్చేట్లు చేయమని ఆఫీస్ వాళ్లకి ఒక లెటరు రాసి పెట్టింది. తనకు వచ్చిన డబ్బులో మాకు కొంత, మా అమ్మమ్మకి, కొంత ఇవ్వమని చెప్పి వురివేసుకొంది. 


 ఆఫీసు వాళ్ళు అమ్మ మంచితనానికి అక్కకు, జాబ్ వచ్చేట్లు, మనీ త్వరగా వచ్చేట్లు చేశారు. స్టాఫ్ అందరూ అమ్మ గురించి గొప్పగా చెప్తుంటే.. , ! నాకు కళ్ల నీళ్ళు ఆగలేదు. ఒక అమ్మగా భార్యగా కొంచం గట్టిగా మాట్లాడితే తప్పా. అది ఎవరి? కోసం, మా కోసమేగా.. ! అని ఎమోషనలుగా ఫీల్ అయింది. అలా అని అమ్మ ఒక్కనాడు కూడా తన భాద్యతలను విస్మరించలేదు. పొద్దున ఆరింటికి లేచి మాకు అన్నం వండి బాక్స్ ఇచ్చి తను ఆఫీసుకి వెళ్ళేది. 

 

 "మరి మీ అక్క పెళ్లి అయ్యిందా?" అన్న వసంతతో లేదు "మా బావ ఫ్రెండ్స్ తో కలిసి ఎవరో అమ్మాయిని ఏడిపించాడని.. ! కొన్నాళ్ళు జైల్ కు వెళ్ళాడు. ప్రస్తుతం అక్క ఉద్యోగం చేసుకుంటూ వుంది. " 

 

 ఏవన్నా మార్పు వచ్చిందా? మీ అక్కలో!"


"లేదు ఆంటీ.. ! అసలు అమ్మ.. ! నాతో నాన్నతో మాట్లాడితే! పోయేది. ఇలా ఎందుకు? చేసుకుందో!" అంది. 


 "ఎన్నిసార్లు మీతో మాట్లాడాలన్నా.. ! మీరు ఛాన్స్ ఎక్కడ ఇచ్చారు. నువ్వూ.. ! నాన్నా అమ్మ దగ్గర కూర్చొని యేంటి అమ్మా.. !? నీ మనసులో బాధ అని ఒకసారన్నా అడిగారా! అక్కా! అని అడిగితే.. , !, నేను నీ కన్నా పెద్దదాన్ని "నాకు సలహాలు ఇవ్వకు" అంది మా అక్క. 


 "మరి అమ్మకూడ.. మన కన్నా పెద్దదిగా.. ? మరి అమ్మ మాట మనం ఎవరం విన్నాం?" అంటే

"అందుకేగా! ఇపుడు నేను బావను పెళ్లి చేసుకోవటం లేదు అంది అక్క. 

"ఇదే మాట నువ్వు ముందు చెప్తే.. !, అమ్మ బతికి వుండేది" అన్నాను. 


 అయితే నావల్ల "అమ్మ పోయిందా.. !"

 నాన్న.. ! చూడు సారిక ఏమంటుందో!" అని మా నాన్నకి చెప్పింది "మీ అమ్మలాగా క్లాసులు తీయకు.. !" అన్నాడు నాన్న కోపంగా. 


 "మనుషులు కారు వీళ్ళు ఎప్పటికీ మారరు.. ? 

అమ్మా.. ! ఇలాంటి వాళ్ల కోసం నువ్వు నీ లైఫ్ ను బలి చేశావా.. !" అక్కడ ఇక వుండలేక, తర్వాత నేను అమెరికా వచ్చాను. 

 

 "సారిక, ఇపుడు నువ్వు ఏమి చేద్దామని? అనుకుంటున్నావు.. !" అంది వసంత. 


"ఏమిచెయ్యాలో తెలియటం లేదు ఆంటీ. ప్రస్తుతం పార్ట్ టైం చేస్తూ.. ! మా ఫ్రెండ్ రూమ్ లో వుంటున్నా. జాబ్స్ కోసం అప్లయ్ చేస్తున్నా.. !" అంది సారిక. 


 "నీ డిటైల్స్ నాకు పంపు. మావారి ఆఫీస్ లో ఏదన్నా వుందేమో! చూడమని చెప్తా. "


"చాలా థాంక్స్ ఆంటీ! మీతో మాట్లాడితే.. మా అమ్మతో మాట్లాడినట్లు వుంది" అని చెప్పి సారిక వెళ్ళింది


 ఒక నెల రోజుల తర్వాత సారికకి వసంత వాళ్లయన ఆఫీస్ లో జాబ్ వచ్చింది. 


 ఒక వీకెండ్ వచ్చింది "ఆంటీ చాలా థాంక్స్.. !" అంది సారిక. "అదేమీ లేదు కానీ మీ అమ్మ కోరికలు నీతో పాటు నేను తీర్చటానికి ప్రయత్నిస్తా.. !" అంది వసంత. 


"మా అమ్మ కోరిక మా అక్క సెటిల్ అవ్వటం మా బావని కాకుండ, వేరేవాళ్లని.. ! పెళ్లి చేసుకోవటం. "

 

 "మీ అక్క సంగతి ఎంటి?" అని అడిగింది వసంత. 


 నిన్న కాల్ చేసింది ఆంటీ! మా అత్తవాళ్ళు దీని జాబ్ చూసి పెళ్ళిచేసు కుంటామన్నారుట. మా అక్క ఇప్పట్లో.. నాకు పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదు అందిట. దానితో మా అత్త.. ! మీ అమ్మ.. ! నీ వల్లే పోయింది. మాకు వద్దులే.. మీ వెదవ సంబంధం! అని పోయిందిట. 


 ఇలా అత్తా.. ! వాళ్ళు హ్యాండ్ ఇవ్వటంతో మా నాన్న కూడా కొంచం డల్ అయ్యాడుట. ఇన్నాళ్లు వీళ్ల మాటలు విని అమ్మను బాధపెట్టానే.. ! అని. నిజముగా అమ్మని మిస్ చేస్తున్నా.. ! సారిక" అని అక్క నాకు కాల్ చేసింది. 


 నేను, అమ్మా.. ! నీతో ఈ విషయాలు మాట్లాడదామని ఎన్నిసార్లు ట్రై చేశామో.. ? అక్కా.. ! కానీ, నువ్వు వినిపించుకోలేదు. ఇప్పటినుండి అమ్మ జాబ్ లో అమ్మని చూసుకుంటూ, అమ్మ చేసినట్లుగా చేసి.. అమ్మ సీట్ కి పేరు తీసుకురా అక్కా.. ! అన్నాను ఆంటీ.. !" మెరుస్తున్న కళ్ల తో అంది సారిక. 


 "పోనీలే! మీఅమ్మ త్యాగం వృదా పోలేదు.. !" అంది వసంత ఆనందంగా. 


 "ఆంటీ.. ఈ ఉగాదికి నేను ఇండియా వెళ్తున్నా.. ! అమ్మకు ఉగాది అంటే.. ! చాలా ఇష్టం. అక్కా.. ! నేను, నాన్న కలిసి ఉగాది చేసుకోబోతున్నాము. ఈ ఉగాది నుండైనా.. ! మేము ముగ్గురం కలిసి, మా కష్ట సుఖాలను పంచుకోవాలి. అమ్మ.. ఎపుడూ.. ! అంటుండేది 'కలసి ఉంటే కలదు సుఖం' అని. ఇకనుండి మేము ఎపుడూ.. !కలిసి ఉండాలనీ, మమ్మల్ని బ్లేస్ చేయమని!" వసంతను కోరింది సారిక. 


 "తప్పక నా బ్లెస్సింగ్స్, పైనుండీ మీ అమ్మ బ్లెస్సింగ్స్.. ! కూడా మీకు వుంటాయని.. !" సంతోషంగా దీవించింది వసంత. 


========================================================================

సమాప్తం

========================================================================

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


48 views0 comments

Comments


bottom of page