top of page

 అమర్ నాథ్ యాత్రలో విషాదం

#AmarnathYathraloVishadam, #అమర్నాథ్, #సైనికకథ, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguHeartTouchingStories

ree

Amarnath Yathralo Vishadam - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 29/05/2025

అమర్ నాథ్ యాత్రలో విషాదం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


"రామం, నాకు అమ్మకు అమర్నాథ్ యాత్రకు పెర్మిషన్ వచ్చింది. మెడికల్ టెస్టులు అన్నీ పూర్తయాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్న అమర్నాథ్ మంచు శివలింగాన్ని 

దర్శించుకునే అవకాశం వచ్చింది. పక్కూరు లక్ష్మీ పురం దివాణం గారి కుటుంబం కూడా తోడుగా ఉంటారు. మాకు హిందీ భాష రాకపోయినా ఆయనకు ఆభాష వచ్చు కనక ప్రయాణంలో ఇబ్బంది ఉండదు. 


అక్కడి వాతావరణానికి తగ్గ చలి దుస్తులు అన్నీ సమకూర్చుకుంటున్నాము. నీ ప్రస్తుత ఆర్మీ డ్యూటీ శ్రీనగర్ దగ్గరని తెలిపావు. వీలుంటే మమ్మల్ని కలియడానికి ప్రయత్నించు." 


ఆర్మీ మెడికల్ కేంపులో విధులు నిర్వహిస్తున్న కొడుకు రామారావుకి రిటైర్డ్ టీచర్ వెంకటరావు ఫోన్లో తెలియచేసారు. 


అవసరమైన మెడికల్ ఫిజికల్ డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకుని రెండు తెలుగు కుటుంబాలు డిల్లీ చేరుకుని కావల్నిన చలి దుస్తులు, తినుబండారాలు సమకూర్చుకుని పహెల్ గాం బేస్ కేంప్ చేరుకున్నారు. 


టెర్రరిస్టుల ఎటాక్ భయంతో రక్షణ దళాలు సతర్కతతో దారి పొడవునా విధులు నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో వస్తున్న అమర్నాథ్ యాత్రికులకు బేస్ కేంప్ లో గుడారాలతో వసతులు, వైద్య సౌకర్యాలు సమకూర్చారు. 


వాతావరణం అనుకూలించక ప్రయాణం జాప్యమవుతోంది. వర్షాలతో కాలిబాట చిత్తడిగా మారి కాలినడకన వెళ్లేవారికి ఇబ్బందిగా మారింది. ఎవరి అనుకూలతను బట్టి నడక ద్వారా కొందరు డబ్బు ఖర్చుతో కంచర గాడిదలు, డోలీలలో ప్రయాణం సాగిస్తున్నారు. 


అవకాశం ఉన్నచోట యాత్రికులకు వసతులు కలగచేస్తూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై నెల నుంచి ఆగష్టు వరకు అమర్నాథ్ యాత్రికులకు అనుమతులు మంజూరయాయి. 


ముందుగా అనుమతులు పొందిన కొన్ని వేలమంది యాత్రికులు సురక్షితంగా అమర్నాథ్ హిమలింగాన్ని దర్శనం చేసుకుని స్వస్థలాలకు పయనమయారు. 


మద్యలో వాతావరణం అనుకూలించక యాత్రికులను ముందుకు పంపడానికి అధికారులు ప్రయాసలు ఎదుర్కొంటున్నారు. వెంకట్రావు గారి కుటుంబం, దివాణం గారి కుటుంబం బేస్ కేంప్ నుంచి మెల్లగా సాగుతు మంచులింగ ప్రవేసానికి కొద్దిదూరంలో గుడారాలలో వారి వంతు వచ్చేవరకు ఎదురు చూస్తున్నారు. కొంతమంది అమర్నాథ్ హిమలింగాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. 


సాయంకాల మైనందున యాత్రికులు గుడారాలలో బసచేసారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పైన పర్వతాలలో కురిసిన వర్షాలకు వరద పోటెక్కి బురదతో కూడిన నీటిప్రవాహం ఒక్కసారిగా కిందకు ఉధృతితో వచ్చింది. 


అనుకోని ఆకస్మిక ఘటనకు అధికారులు నివ్వెరపోయారు. ఏమి చేయలేని పరిస్థితి. బురదతో కూడిన వరదనీరు గుడారాలను ముంచి తుడుచుకు పోయింది. ఎన్నో గుడారాలు వరద నీటిలో కొట్టుకుపోయి అందులో బస చేసిన చాలామంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 

కొంతమంది ఆచూకీ తెలియడంలేదు. 


ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ టిబెటియన్ ఫోర్స్ ఇలా రక్షణ దళాలు రంగంలో దిగాయి. ఎందరినో ప్రాణాలతో రక్షించాయి. గాయపడిన వారిని వాయుసేన హెలీకాఫ్టర్లలో దగ్గరున్న హాస్పిటల్సుకి తరలించారు. ప్రతికూల పరిస్థితుల్లో యాత్రికులను రక్షింంచడానికి

రక్షణ దళాలు శ్రమపడుతున్నాయి. 


ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వైద్య దళాలు బాధితులకు బాసటగా నిలిచి ప్రథమ చికిత్స చేస్తున్నారు. 


ఆర్మీ మెడికల్ దళంలో పనిచేస్తున్న మేల్ నర్స్ రామారావు శ్రీనగర్ నుంచి అమర్నాథ్ యాత్రికుల వైద్య సహాయానికి పంపడం జరిగింది. తన అమ్మానాన్న అమర్నాథ్ యాత్రలో ఉన్నందున వారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్నాడు


ఆర్మీ మెడికల్ శిబిరంలో యాత్రికులకు వైద్య సేవలు అందిస్తూ అధికారులతో తన పేరెంట్స్ గురించి వాకబు చేస్తున్నాడు మేల్ నర్స్ రామారావు. దుర్ఘటనలో చనిపోయిన వారి వివరాలు తెలుసుకుంటున్నాడు. 


ఒక శిబిరంలో చూసిన తన తల్లి మృతదేహం చూసి స్థబ్దుడయాడు. బురదతో నిండిన శరీరాల్ని శుభ్రం చెయ్యగా వ్యక్తుల గుర్తింపు జరుగుతోంది. మరొక శిబిరంలో తండ్రి గాయాలతో కనబడ్డాడు. 


అమర్ నాథ్ పవిత్ర యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారనుకున్న అమ్మా నాన్నలు ఇలా దుర్ఘటనలో చిక్కుకుంటారనుకోలేదు. ఈ దుర్ఘటనలో తల్లి దుర్మరణం, తండ్రి చావు బతుకుల్లో ఉండటం చూసి తట్టుకోలేక పోయాడు ఆర్మీ మెడికల్ మేల్ నర్స్ రామారావు. 

 

 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page