'Ame Oka Devatha' - New Telugu Story Written By Mohana Krishna Tata
'ఆమె ఒక దేవత' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రోజూ ఆఫీస్ కు పది కిలోమీటర్ల దూరం.. నా మోటారు సైకిలు మీద వెళ్తాను.. షార్ట్కట్ అయితే, ఇంకా తొందరగా ఆఫీస్ కు చేరుకోవచ్చని ఊరు చివర నుంచి వెళ్తుంటాను. అలాగ వెళ్ళినప్పుడు.. ఒకొక్కసారి ఎవరు లేని ప్రదేశం నుంచి వెళ్ళాల్సి వస్తోంది. రోజూ, అలా వెళ్తుండగా.. ఒక మతిస్తిమితం లేని ఒక మహిళ తన దగ్గరకు వచ్చి.. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది.. ఆ దారిన వెళ్తున్న మిగిలిన వారంతా.. పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. నేను అందరి తోనే.. నా ఆఫీస్ కు వెళ్ళిపోయాను..
ఇలా ప్రతిరోజు జరుగుతుంది.. ఒక రోజు ఆకాశం మబ్బు పట్టి.. వాన కురిసే లాగ ఉంది.. రోడ్డు మీద ఎవరు అంతగా లేరు. బండి మీద ఫాస్ట్ గా వెళ్తున్న నాకు.. ఆ మహిళా ఒక చెట్టు కింద తడుస్తూ కనిపించింది.. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. ఎవరికైనా.. ఆకలి, చలి ఉంటాయి కదా! అని గుర్తొచ్చింది. వెంటనే.. బండి పక్కకు ఆపి.. ఆమె దగ్గరకు వెళ్ళాను.
ఆఫీస్ కు మా అమ్మ పెట్టిన లంచ్ బాక్స్.. ఆమె కు ఇచ్చాను. తర్వాత చలి తో వణుకుతున్న తనకి నా రైన్ జాకెట్ ఇచ్చాను. జాకెట్ వేసుకుని.. లంచ్ బాక్స్ గబా గబా ఓపెన్ చేసి తినేసింది.. చూస్తూ వుంటే.. చాలా రోజుల నుంచి ఏమి తిన్నట్టు లేదనిపించింది.. ఆమె చేతి తో ఏవో సైగలు చేసి, అక్కడ నుంచి వెళ్లిపోయింది. నాకు ఏమి అర్ధం కాలేదు.. మతిస్తిమితం లేదు కదా! అనుకున్నాను.
లాంగ్ వీకెండ్ రావడం చేత, నేను ఆఫీస్ కు ఒక నాలుగు రోజులు వెళ్ళలేదు. నా పనిలో చాలా బిజీ అయిపోయాను. మా ఇంట్లో మా అమ్మా నాన్న కు నేను ఒక్కడినే కొడుకును. నా పేరు రవి. వాళ్ళు నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచారు. నేను ఏది అడిగితే.. అది ఇచ్చారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. క్యాంటీన్ ఫుడ్ వద్దనీ, రోజూ ఉదయం లేచి నాకు లంచ్ బాక్స్ కట్టి ఇచ్చేది ఆఫీస్ కు. నేను సరే అనేవాడిని. మా నాన్న తన బిజినెస్ లో ఎప్పుడు బిజీ గా ఉండేవాడు. ఒక్కొక్కసారైతే.. మాట్లాడడానికి టైం ఉండేది కాదు అతనికి. డబ్బు సంపాదించడమే అతని లక్ష్యం అన్నట్టు పని చేస్తాడు.
హాలిడేస్ తర్వాత నేను మళ్ళీ ఆఫీస్ దారి లో వెళ్తున్నప్పుడు ఆమె ను ఎక్కడా చూడలేదు.. ఇలాగ రెండు రోజులు ఆవిడా ఎక్కడా కనిపించలేదు. వేరే చోటకి ఎక్కడికో వెళ్లిపోయిందేమో అనుకున్నాను.. ఆ విషయం మర్చిపోయి ఇంక నేను నా ఆఫీస్ వర్క్ లో బిజీ అయిపోయాను.. ఆఫీస్ లో నా షిఫ్ట్ కూడా మార్చారు. నైట్ షిఫ్ట్ కావడం చేత, నేను అటుపక్క కొన్ని రోజుల పాటు వెళ్ళలేదు. మెయిన్ రోడ్ మీద నుంచే వెళ్ళేవాడిని..
మళ్ళీ నా షిఫ్ట్ మారగానే.. ఆ పాత రూట్ లో వెళ్తున్నాను. ఆశ్చర్యం!.. ఆ మహిళ మళ్ళీ అక్కడ కనిపించి.. నా బండి కి అడ్డుగా వచ్చి నిల్చుంది. నాకు అర్ధం కాలేదు.. వెంటనే బండి ఆపాను. చేతిలోంచి ఒక పాత బ్యాగ్ ఒకటి తీసి, నా చేతిలో పెట్టి అక్కడనుంచి వెళ్లిపోయింది.. ఏదో పాత బ్యాగ్ అనుకుని.. ఇంటికి వెళ్లి చూసుకుందామని అనుకున్నాను. ఇంటికి వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే.. అందులో డబ్బులు, నగలు ఉన్నాయి.. ఇంకా లోపల వెదికాను.. కొన్ని ఫోటోలు ఉన్నాయి.. అందులో ఆమె ఫోటో తో పాటు.. నా చిన్నప్పటి ఫోటో ఉంది.. చాలా ఆశ్చర్యం వేసింది..
ఇంతకీ ఆమె ఎవరు? ఆమె దగ్గర నా ఫోటో ఎందుకు ఉంది? ఇంత డబ్బులు ఎక్కడివి? ఈ ప్రశ్నలకి సమాధానం కోసం మా ఇంట్లో ఉన్న నా చిన్నప్పటి ఫోటో ఆల్బం చూసాను.. అందులో.. నన్ను ఈ మహిళ ఎత్తుకుని ఉన్న ఫోటో ఉంది.. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లి అడిగాను.. నాకు తెలియదు అంది.
నాన్న వచ్చాక.. అతన్ని అడిగాను..
"ఆవిడ చిన్నప్పుడు నిన్ను చూసుకున్న ఆయా బాబు!.. మీ అమ్మ చనిపోయిన తర్వాత.. కొన్ని సంవత్సరాల వరకు నేను పెళ్ళి చేసుకోలేదు. అప్పుడు నిన్ను చూసుకోవడానికి ఈమెను పనిలోపెట్టుకున్నాను.. ఆ తర్వాత నేను రెండో పెళ్ళి.. చేసుకున్నాను.. "
"నాకు ఆయా గురించి ఇంకొన్ని విషయాలు చెప్పండి నాన్న!"
"మనింట్లో ఆమె పని చేసేటప్పుడు.. మనం ఇచ్చే జీతం తో వాళ్ళ అబ్బాయిలను బాగా చదివించానని చాలా సార్లు నాతో చెప్పింది.. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిలు మంచి ఉద్యోగం లో ఉన్నారని మానేసేటప్పుడు నాతో చెప్పింది.. అదే నేను ఆమెను ఆఖరి సారి చూడడం. ఇంతకీ.. ఈ విషయాలు ఇప్పుడు నీ కెందుకు?”
"ఏం లేదు నాన్న?"
మర్నాడు ఆఫీస్ కు కొంచం ముందుగా బయల్దేరి.. ఆమెను కలవాలనుకున్నాను. నేను అక్కడకు వెళ్లేసరికి.. ఆమె రోడ్డు మీద పడిపోయి ఉంది.. చుట్టూ జనం ఉన్నారు.. వెళ్లి చూస్తే, ఆమె చనిపోయిందని అక్కడ చెప్పారు.. చాలా బాధ వేసింది. ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికి.. అక్కడ నుంచి వెళ్ళిపోయాను.
రాత్రంతా అదే ఆలోచన.. పెంచి వృద్ధి లోకి తెచ్చిన కొడుకులు.. కన్న తల్లి ని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నందుకు చాలా బాధ వేసింది.. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను.. ఇలాంటి పరిస్థితి కొందరికైనా రాకుడదని.. ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బులు.. నేను దాచుకున్న డబ్బుకు కలిపి ఒక వృద్ధాశ్రమం ప్రారంభించాను. ఇప్పుడు అది ఎంత మందికో ఆసరా ఇస్తోంది.. ఈ విధంగా ఆ దేవత ఋణం తీర్చుకోగలిగాను.
*************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
留言