అమ్మ ఆశ
- Gadwala Somanna
- 2 hours ago
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaAsha, #అమ్మఆశ, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 91
Amma Asha - Somanna Gari Kavithalu Part 91 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/06/2025
అమ్మ ఆశ - సోమన్న గారి కవితలు పార్ట్ 91 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అమ్మ ఆశ
----------------------------------------
కోరికలు ఎక్కువైతే
తరుగుతుంది ఆనందము
సద్గుణాలు క్షీణిస్తే
వశమగును దానవత్వము
సాహసం చేసేస్తే
విజయాలు దరిచేరును
దేశభక్తి చూపిస్తే
భారతి సంతసించును
ప్రవృత్తిలో రాణిస్తే
గౌరవం దక్కుతుంది
ఉప్పెనై ఉద్యమిస్తే
గెలుపు సాధ్యమవుతుంది
బద్దకం ఆవరిస్తే
అభివృద్ధి కుంటపడును
చురుకుదనం ఉదయిస్తే
బంగారం భవిత అగును

ఉండాలోయ్! జగతిలో
----------------------------------------
ఫలాలిచ్చు తరువులా
జలాలిచ్చు చెరువులా
ఉండాలోయ్!జగతిలో
విద్య నేర్పు గురువులా
ప్రవహించే యేరులా
వికసించే పూవులా
ఉండాలోయ్!జగతిలో
విహరించే ఖగంలా
రవళించే మువ్వలా
ముద్దులొలుకు గువ్వలా
ఉండాలోయ్!జగతిలో
వెలుగులీను దివ్వెలా
కడుపు నింపు పొలంలా
చెట్టు మీద ఫలంలా
ఉండాలోయ్!జగతిలో
కదిలించే కలంలా
సాగు చేయు హలంలా
సాహసించే బలంలా
ఉండాలోయ్!జగతిలో
పదిమందికి గళంలా

మాస్టారు అభిలాష
-----------------
పనిచేస్తే ఓర్పుగా
ఫలితాలు మెండుగా
జనహితం కోరాలోయ్!
పరోపకారి తరువుగా
క్రమేణా ఎదగాలోయ్!
పుడమిలోన మొక్కగా
అనుదినం వెలగాలోయ్!
ప్రకాశించు చుక్కగా
ప్రగతి బాట నడవాలోయ్!
కష్టించే వ్యక్తిగా
దేశ పరిరక్షణకు
మారాలోయ్! శక్తిగా
అలసిపోయిన మదులకు
ఆదరించు మాటగా
నలిగిపోయిన మనుషులకు
ఉండాలోయ్! కోటగా

చింతలు చితిమంటలు
----------------------------------------
గుండెలోని చింతలు
అవే చింత నిప్పులు
ఎక్కువైతే గనుక
తగలబెట్టు బ్రతుకులు
ఆదిలో త్రుంచితే
హాయిగుండు మనసులు
వృక్షమై పెరిగితే
బ్రతుకిక తలక్రిందులు
చింతల కుంపట్లో
పడి నీవు మాడిపోకు
నిరాశ చీకట్లో
నిత్యం ఉండిపోకు
చింతలు చితిమంటలు
హరించును సంతసం
వెంటనే బయటపడు
బహు దూరంగా నడు!

మహాత్ముల మాటలు
----------------------------------------
మహనీయుల పలుకులు
కాంతులీప్రమిదలు
గైకుంటే మాత్రం
జీవితాన వెలుగులు
పసి పాప నవ్వులా
వికసించిన పువ్వులా
పెద్ద వారి మాటలు
వెన్నెల్లా సొగసులు
గురుదేవుల బోధలా
దిద్దుతాయి బ్రతుకులు
రవి కిరణం కాంతిలా
తరుముతాయి మబ్బులు
మహాత్ముల మాటలే
అపరంజి మూటలే
అర్థము చేసుకుంటే
అగును బ్రతుకు బాటలే
-గద్వాల సోమన్న
Comentarios