top of page

అమ్మ - అయ్య

'

'Amma Ayya' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally

'అమ్మ అయ్య' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


అక్షరంబులలోని తొలి యక్షరంబె

అమ్మ యను మాటకాధారమై యుండు

అమ్మ నేర్పెడి పదములె అవని పైన

అక్కరకు వచ్చు నది నిక్కంబు నీ వెరుంగ


ఓనమాలు నేర్పించ నోర్పుగ గూర్చుండి

చేతికి పలుకిచ్చి చేబట్టి వ్రాయించు

తల్లియె తొలి గురువు తనయులకును

అట్టి గురువున కంజలి ఘటించ నబ్బు చదువు


వెన్నముద్దలు బెట్టుచు కన్నతల్లి

సున్నితంబుగ జెప్పు సుద్దులెన్నొ

చిన్న చిన్న మాటలు చిరునోటవిన్న

అమ్మ జెందెడి ఆరాటమెన్న మిన్న


ఆటలోనను జోల పాటలోన

మంచి మాటల మర్మమె మనసు దెలియ

అమ్మ జెప్పును చదువుల అవసరంబు

అమ్మ మాటను మదినమ్మి మసలు కొమ్ము.


చారు పప్పు నెయ్యి చాలినంత గలిపి నిక

గారవంబుగ బెట్టు గోరు ముద్దలు బెట్టు తల్లి కోరి కోరి

వారె అమ్మ చేతి వంట కమ్మదనము జెప్ప

ఆరున్నొక రుచిక యవతరించె నవని లోన


అమ్మ విలువ దెలిసి దేవుడే చిన్నబోయి

అమ్మ గలదు పృథ్వినందు అందరికిని మరి యా

అమ్మ లేకున్న నాకు న్యాయ మెట్లనుచు

అమ్మ కడుపున జొచ్చె అవతార పురుషుణొంక


అమ్మ ప్రేమ తత్వానికి

అర్థ మెన్ను టెంతనో

అంతు లేని ఆకసానికి

అంచు లెదుకుట అంతనే.


జన్మకారకుడయ్యి జనయిత్రి

తనయుల పోషించు తగురీతి తన్వితోడ

ప్రేమ పాళ్ళు బంచి పెంచి పోషించు

కష్ట మనునది మది కిష్టమనుచు


సుతులు భవితలొ తమ

గతులు మార్చునంటు గనుచు కలలు

కోర్కెలేవైన దీర్చు కొసరకుండ

భుజమె అందల మంటు భూరిగ శ్రమించు


తనయుడంటెను తానింక తనర మురిసి

చదువు సందెలు నేర్పి చక్క బర్చు

కరుణ తోడ బెంచు కాలికి

మట్టి యంటకుండ మహిలొ తండ్రి


అట్టి తలిదండ్రుల ఆదరించ

బూనకుందురు సుతులు బుద్ధి లేక

అవసరంబు కొరకె అమ్మ అయ్య అంటు

అదియు దీర నుంద్రు ఆమడ దూరంబు


శ్రద్ధ మరచి వారిని చేర్చ జూతురు

వృద్ధ ఆశ్రమంబు ఉర్వినందు

ఖలులు అంటె వారె ఈ కర్వరందు

మనిషి జన్మయెత్తి మానవత్వ మనగ మరచి.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.

36 views0 comments
bottom of page