top of page

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 6


'Premante Idena Part 6' - New Telugu Web Series Written By Penumaka Vasantha

'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 6' తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

జరిగిన కథ:


తన ఫ్రెండ్ పద్మ పెళ్ళిలో ఆనంద్ ని చూస్తుంది విరిజ.


వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది. ప్రేమలో విఫలమైన రాజీని వైజాగ్ రప్పిస్తుంది. రాజీ బ్యాంకు ఎగ్జామ్స్ కి, విరిజ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటారు. ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. వారికి సహాయం చేస్తుంటాడు.


రాజీ కి బ్యాంక్ జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. విరిజ గ్రూప్స్ కి సెలెక్ట్ అవుతుంది. ఆనంద్ ని కలుస్తుంది విరిజ.


తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని రాజీ వాళ్ళ నాన్నకు చెప్పినట్లు విరిజతో అంటాడు ఆనంద్. తన మనసులో ఒక అమ్మాయి ఉన్నట్లు కూడా చెబుతాడు.

ఆనంద్ ప్రేమించేది తననే అని రాజీ ద్వారా తెలుసుకుంటుంది విరిజ.


ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 6 చదవండి


నాకు ఒక వైపు ఆనందం మరో వైపు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ఆనంద్ నన్ను ఇష్ట పడుతున్నాడా!? మేఘాల్లో తేలిపోతునట్లుగా ఉంది. ఇన్నాళ్లు, నన్ను, ఇష్ట పడటం లేదనీ ఆనంద్ మీద పీకల దాకా కోపం ఉంది. ఇపుడేమో ఇష్టపడుతుంటే.. అయోమయం గా ఉంది. ఇందుకేనా! ఆడవారి మాటలకు, ఆర్ధాలే వేరులే అనేది.


అంటే, నేను ఆనంద్ ను ఇష్ట పడుతున్నానా!? ఇదేనా ప్రేమంటే? ఆనంద్, ఫోన్ చేస్తే, ఏమి మాట్లాడాలి.. కాని నేను నా సుఖం చూసుకొని వెళ్లిపోతే నాన్న అప్పులు ఎవరు తీరుస్తారు. పిచ్చి నాన్న.. అందరూ నీలాగా వుండరు. నువ్వు అమ్మమ్మ వాళ్లకు ఎంత హెల్ప్ చేసావో! మాకు తెలుసు. తాతయ్య పోతే పిన్నికి పెళ్లి చేసావు. మామయ్యను చదివించావు. అదే అక్కను ఇచ్చిన బావ మనకు అంత హెల్ప్ గా లేడు. పండగకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదంటూ! ఒకటే నస.


అందుకని, ఇపుడు బాగున్నా ఆనంద్ తర్వాత మీ అమ్మ వాళ్ళు ఏమి ఇవ్వలేదంటే ఏమి చేయాలి. !? ఒకవేళ ఆనంద్ కు లేకపోయినా వాళ్ల అమ్మానాన్న కుంటే కాదనలేడు కదా! ఇవన్నీ క్లియర్ చేసుకుంటేనే నేను ఆనంద్ తో పెళ్లికి ఒప్పుకోవాలనుకున్నా.

ఆ ఈవెనింగ్ ఆఫీస్ నుండి వచ్చి కాఫీ తాగుతుంటే కాల్ చేసాడు ఆనంద్. "హలో” అన్నాను.


"నేను ఆనంద్ నండి” అన్నాడు. నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. "ఆ.. చెప్పండి."


"థాంక్స్, ఓకే చెప్పినందు”కన్నాడు.


"కానీ!" అని నేనసుగుతుంటే..


"అర్థమైంది!.. మీరు ఏమి మాట్లాడతారో! రేపు సండే మీకు వీలైతే ఒకసారి కలిసి మాట్లాడుకుంటే, ఇవన్నీ, క్లియర్ అవుతాయి కదా!" అన్నాడు ఆనంద్.

"అవునండీ! ఇంటికి రండన్నాను. "


"ఓకే! కొంచం రేపు అయినా.. కాస్త మనసు విప్పి మాట్లాడుతారుగా!" అన్న ఆనంద్ తో నవ్వుతూ.


"ట్రై చేస్తా లెండ”ని ‘బై’ చెప్పి పెట్టేసాను.

రేపు ఆనంద్ వస్తాడనగా ఇల్లంతా సర్ది ఉంచాను. ఉన్న వాటిల్లో వైట్ ఆర్గంజ్ శారి తీసి కట్టుకుని ముత్యాల దండ వేసుకుని రెడీ అయి ఫస్ట్ టైం చాలా ఇంటరెస్టింగ్ గా తయారయ్యాను. తయారవుతూ.. 'ఎందుకు ఇలా రెడీ!? అవ్వటం ఆనంద్ ను ఇంప్రెస్స్ చేయటానికా! ఇదేనా ప్రేమ అంటే.. నో అదేమీ! కాదు. ఆత్మ సౌందర్యం తో పాటు బాహ్య సౌందర్యం కూడా ఉండాలంటూ' ఇలా రెఢీ అవ్వటం తప్పు కాదంటూ!' మనసును సమాధానపెట్టాను.

కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపించటం తో వెళ్లి డోర్ తీస్తే ఎదురుగా ఆనంద్! ఏదో తెలియని సిగ్గు ఆవరించగా "లోపలికి రండి" అని సోఫా చూపించాను.

"మంచి నీళ్ళు కావాలా?” అని అడిగాను.


ఓ.. ! మీకు మాటలు కూడా వచ్చా?" చిరునవ్వుతో ఆనంద్ అడిగేసరికి "నేను చాల వాగుడు కాయను. కాకపోతే బాగా పరిచయం అయితే కాని మాట్లాడను" అన్నాను.

"ఇప్పుడు నేను పరిచితుడినా, అపరిచితుడునా!" అని ఆనంద్ అడిగేసరికి నవ్వు వచ్చింది.


"మీరు ప్రస్తుతానికి అపరిచితుడు. ఇపుడు మాట్లాడితే కాస్త పరిచితుడవుతారు. "

“వామ్మో! మీ ఫ్రెండ్ రాజీ మా విరిజకు నోట్లో నాలుక లేదు అన్నారు. కానీ! మీరు వాగుడుకాయలానే ఉన్నారుగా!" అన్నాడు ఆనంద్.

"సర్లే కాని ఇదిగో కాఫీ తీసుకోండి" అని ఇచ్చాను.


కాఫీ తాగుతూ “ఇపుడు చెప్పండి. మీరు నిజంగా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడే చేసుకుంటున్నారా! లేక రాజీ, మీ నాన్న గారి కోరిక పై నన్ను పెళ్లి చేసుకుంటున్నారా.. !" అన్న ఆనంద్ తో "ఇష్టపడే చేసుకుంటున్నాను కాని కొన్ని బాధ్యతలు ఉన్నా”యన్నాను నవ్వుతూ.

“విరిజ గారు.. ఇపుడు మనం జీవితాన్ని పంచుకో బోతున్నాము. సో కష్టనష్టాలు, బాధ్యతలు అన్ని ఇద్దరం కలిసి పంచుకుంటేనే ఆ పెళ్ళికి అర్థం, పరమార్థం. నాకు ఒక అక్క ఉంది. తను నాకు అన్ని విషయాలు విడమర్చి చెపుతుంది. ఇద్దరు కలిసి లైఫ్ ను పంచుకొంటెనే ఆ లైఫ్ బావుంటుంది. భార్య అంటే బాధ్యత కాదు ఒక బంధం అని ఎన్నో సార్లు చెప్పింది. అక్కాబావ చాల కలసి మెలసి ఉంటారు. వాళ్ళను చూసి నేను అలానే వాళ్ల లాగా కల్సుండాలనుకున్నా.


అందువల్ల మీరు నా గురించి నెగటివ్ గా థింక్ చేయకండి. మీకు ఏమి కావాలి!? నా నుండి ఏమి కోరుకొంటున్నారు. ఇలాంటివన్నీ నిరభ్యంతరంగా అడగండి. ఇపుడు మాట్లాడకుండా వుంటే మీ మనసులో ఉన్న భావాలు నాకెలా తెలుస్తాయి. "

"ఏమో! ఆనంద్ గారు నాకు ఎందుకో జీవితం పూలపాన్పు కాదనిపిస్తుంది. ఇపుడు నా ముందు ఎన్నో సవాళ్లు, వాటిని దాటుకొని గమ్యాన్ని చేరుకొంటానా!? లేదా ఇదే నా ముందరి అతి పెద్ద సవాలు. వీటీని దాటుకుని జీవితాన్ని గడిపేస్తే చాలు. "

"ఓ! తప్పకుండా మీ కోరికలు తీరుతాయి విరిజ నేనున్నా కదా! మీరు మీ జాబ్ చేస్తూ మీ నాన్న గారి అప్పులు తీర్చండి. మీ మని నాకు మీరు ఇవ్వనవసరం లేదు. నేను మిమ్మలను ఇష్టపడింది మీ జాబ్ చూసి కాదు. మీ నిరాడంబరత, నిజాయితీ, లైఫ్ పట్ల మీ కున్న డెడికేషన్, పెద్దల పట్ల మీ కున్న గౌరవం ఇలాంటి వాటిని చూసి. పెళ్లి అయిన తర్వాత నేను మాట మారి మీ డబ్బు కోసం మిమ్ములను కష్టపెడతానని అనుకోవద్దు. డబ్బు కన్నా, రిలేషన్స్, గొప్ప”వన్నాడు ఆనంద్.

ఆనంద్ మాటలకు నాకు చాల దైర్యం వచ్చింది. "ఇక డబ్బులు కాకుండా మిగతా విషయాలు ఏవన్నా చెప్పుకుందామా!"అన్న ఆనంద్ తో చిరునవ్వుతో అలాగేనంటు.. తలవూపాను.

మొదటిసారి పద్మ పెళ్ళిలో కలసినప్పటి సంగతలు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాము. "మీరు రూం కి లోపల గడియ పెట్టుకోకుండా నన్ను భలే దబాయించారుగా!" అన్నాడు ఆనంద్.

ఆరోజు నా తొందరపాటుకు నవ్వొచ్చి! నవ్వాను. నా నవ్వును ఆనంద్ చాలా ఇష్టంగా చూస్తుండటాన్ని గమనించాను.

"విరిజా! నిన్ను విరి, అని పిలవచ్చా!” అడిగిన ఆనంద్ తో "మీకు ఎలా ఇష్టమైతే అలానే పిలవండి" అన్నాను.

"మనం మన కిష్టమైన రీతిలో జీవితాన్ని మలుచుకోవడం మన చేతిలో ఉంది. ఒక అండర్ స్టాండింగ్, ఒక ప్లాన్ ఉంటే.. జీవిత నౌక ను ఈజీగా అడ్డంకులు.. లేకుండా తీరానికి చేర్చవచ్చ”న్నాడు ఆనంద్.

అపుడు.. నాకు ఎంతో ఇష్టమైనదిగా ఈ ప్రపంచం కనపడసాగింది. ఆనంద్ మాటల్తో నాకు కొండంత బలం వచ్చింది.

“అయ్యో! కాఫీ మాత్రమే ఇచ్చాను. టిఫిన్ ఏదన్నా చేసి పెట్టాలని దోశలు పోసి చెట్ని చేసి పెట్టాను”.


ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. "ఎలా ఉన్నాయి దోశలు" అడిగాను.

"విరి తేనె లాగా బావున్నాయి" అన్నాడు ఆనంద్.

"సరే ఇక లేట్ అవుతుంది, వెళ్తారా ఇంటి”కన్నాను ఆనంద్ చూపుల్తో చూపులు కలపలేక.

"అపుడేనా! ఇంకా కాసేపు ఉండి వెళ్తా”న్న ఆనంద్ తో " లేదూ! లేట్ అయింది ఇప్పటికే.. ప్లీజ్ వెళ్ళండి" అని గుమ్మం వైపు దారి చూపాను.

"ఓకే విరి ఉంటాను మళ్ళీ మనం ఎపుడు ఎక్కడ కలుసుకుందాము. "

"మళ్ళీ వచ్చే సండే నే. ఈ లోపు నో మీటింగ్స్" అన్నాను.

"అయ్యో! వారం ఆగాల ఈ దేవి గారి దర్శనం కోస”మంటూ వెళ్ళలేక వెళ్ళాడు.


ఆ రోజు ఎంతో సంతోషంగా ఆనంద్ తో గడపబోయే జీవితం కోసం ఆలోచిస్తూ నిద్ర లోకి ఒరిగాను.

నాన్న ఆనంద్ వాళ్ల అమ్మ, నాన్న తో ఫోన్ లో మాట్లాడాడుట. వాళ్ల అమ్మ గారు “నాకు విరిజ తెలుసు. వైజాగ్ లో చూసాను. మంచి పిల్ల కోడలుగా రావటం మా అదృష్టం. మా అమ్మాయి కూడా చూసినట్లు ఉంటుంది. హైదరాబాద్ లో విరిజ ని చూపించం”డని అడిగారుట.


"మంచివాళ్ళుగా అనిపిస్తున్నారు తల్లీ! వాళ్ల మాట తీరుచూస్తే" నాన్న అన్నారు

"ఏమో నాన్నా! అక్క అత్తగారు వాళ్ళు మొదట్లో ఇలానే మాట్లాడేవారు. తర్వాత ఇది కావాలి అది కావాలనీ! మనల్ని పీడించటం లేదూ!" అన్నాను.

"అలా అనుకోకు తల్లీ! అన్నీ, బాగానే జరుగుతాయి. ఆనంద్ మంచి పిల్లాడు. మర్చిపోయా.. ఆనంద్ నిన్న కాల్ చేసాడు. మీ ఆమ్మాయిను వివాహం చేసుకుంటే మీకు అభ్యంతరం లేదుగా.. మా అమ్మ నాన్నతో కూడా మాట్లాడం”డనీ వాళ్ల నంబర్ ఇచ్చాడు.

'నా దగ్గర నాన్న నంబర్ తీసుకున్నది ఆనంద్ అందుకా!' అనుకున్నా మనసులో.


తర్వాత అమ్మ కూడా ఫోన్ తీసుకుని, "విరిజా !ఆనంద్ ఎంత మంచివాడే! నాతో కూడా మాట్లాడాడు. నీకు ఏ కలర్స్ ఇష్టం నీ హాబీస్ ఏంటని అడిగి మరీ తెల్సుకున్నా”డనీ సంతోషంతో అంది.

========================================================================

ఇంకా వుంది..


========================================================================


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.



35 views0 comments

Comments


bottom of page