ప్రేమంటే ఇదేనా! పార్ట్ 7
- Penumaka Vasantha
- Sep 4, 2023
- 4 min read
Updated: Sep 16, 2023

'Premante Idena Part 7' - New Telugu Web Series Written By Penumaka Vasantha
'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 7' తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
జరిగిన కథ:
తన ఫ్రెండ్ పద్మ పెళ్ళిలో ఆనంద్ ని చూస్తుంది విరిజ.
వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది. ప్రేమలో విఫలమైన రాజీని వైజాగ్ రప్పిస్తుంది. రాజీ బ్యాంకు ఎగ్జామ్స్ కి, విరిజ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటారు. ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. వారికి సహాయం చేస్తుంటాడు.
రాజీ కి బ్యాంక్ జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. విరిజ గ్రూప్స్ కి సెలెక్ట్ అవుతుంది. ఆనంద్ ని కలుస్తుంది విరిజ.
తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని రాజీ వాళ్ళ నాన్నకు చెప్పినట్లు విరిజతో అంటాడు ఆనంద్. తన మనసులో ఒక అమ్మాయి ఉన్నట్లు కూడా చెబుతాడు.
ఆనంద్ ప్రేమించేది తననే అని రాజీ ద్వారా తెలుసుకుంటుంది విరిజ.
తన ఆర్ధిక పరిస్థితి ఆనంద్ కి వివరిస్తుంది విరిజ.
తనకు అన్ని విధాలా సహకరిస్తానని చెబుతాడు ఆనంద్.
ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 7 చదవండి
నాన్న ఆనంద్ వాళ్ల అమ్మ, నాన్న తో ఫోన్ లో మాట్లాడాడుట.
వాళ్ల అమ్మ గారు ‘నాకు విరిజ తెలుసు, వైజాగ్ లో చూసాను. మంచి పిల్ల కోడలుగా రావటం మా అదృష్టం. మా అమ్మాయి కూడా చూసినట్లు ఉంటుంది. హైదరాబాద్ లో విరిజ ని చూపించం’డని అడిగారుట. మంచివాళ్ళుగా అనిపిస్తున్నారు తల్లీ! వాళ్ల మాట తీరుచూస్తే" నాన్న అన్నారు
"ఏమో నాన్నా! అక్క అత్తగారు వాళ్ళు మొదట్లో ఇలానే మాట్లాడేవారు. తర్వాత ఇది కావాలి అది కావాలనీ! మనల్ని పీడించటం లేదూ!" అన్నాను.
"అలా అనుకోకు తల్లి! అన్నీ, బాగానే జరుగుతాయి ఆనంద్ మంచి పిల్లాడు. మర్చిపోయా! ఆనంద్ నిన్న కాల్ చేసాడు. "మీ ఆమ్మాయిను వివాహం చేసుకుంటే! మీకు అభ్యంతరం లేదుగా.. మా అమ్మ నాన్నతో కూడా మాట్లా”డండని వాళ్ల నంబర్ ఇచ్చాడు.
'నా దగ్గర నాన్న నంబర్ తీసుకున్నది ఆనంద్ అందుకా!' అనుకొన్నా మనసులో.
తర్వాత అమ్మ కూడా ఫోన్ తీసుకొనీ "విరి.. ఆనంద్ ఎంత మంచివాడే! నాతో కూడా మాట్లాడాడు. నీకు ఏ కలర్స్ ఇష్టం, నీ హాబీస్ ఏంటనీ అడిగి తెల్సుకున్నాడు. బామ్మ తో కూడా ఎన్నో సంగతులు మాట్లాడాడు. ఇక బామ్మ నీ గొప్పతనం గురించి చెప్పటం. మా బుడ్డీ చదువులో, వినయం లో పనిపాటల్లో ఎవరూ, దీనికి సాటి రారని ఒకటే పొగిడిందనుకో. నిన్ను బామ్మ ముద్దుగా ఏమని పిలిచేది! ఇవన్నీ చెప్పింది ఆనంద్ తో. "
"అబ్బా ! బామ్మ నా పరువు తీసిందిగా" అంటే “ఇదిగో మీ బామ్మ కిస్తున్నా ఫోన్ని” అమ్మ బామ్మ చెవిలో ఫోన్ పెట్టింది.
"బుడ్డి తల్లి ఏమి చేస్తుందని ముద్దుగా అడిగేసరికి"
"బామ్మ ఎలా ఉన్నావు. "
"బాగున్నా బుడ్డి తల్లి. ఆనంద్ ఎంత మంచివాడోనే! పెద్ద వాల్లంటే! ఎంత వినయం, భక్తి, మా బుడ్డి తల్లి బంగారమని చెప్పాను. బుడ్డి పేరు బావుంది అన్నాడు. మీ బావ కంటే, వంద రెట్లు, మంచిగా ఉన్నాడు. బుడ్డీ అని ఎందుకు పిలుస్తారు, అని అడిగాడు. అపుడు నేను మా విరిజ ఏడాది పిల్ల. కిరసనాయిలు బుడ్డి అక్కడ పెడితే తెలియకది తాగింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళితే కక్కించి పిల్లను బతికించారు. అప్పటినుండి దాని పేరు బుడ్డి అని పిలుస్తున్నాం అని చెపితే ఏమి నవ్వాడో. "
"అబ్బా ! ఇంకా నేను గోడ దూకి కింద పడింది, ముక్కులో రాయి పెట్టుకుంది, ఇవి కూడా చెప్పలేక పోయావా!"అన్నాను మండిపోయి.
"ఈసారి చెప్తా కానీ! అన్నమది బాగా తిను బుడ్డీ! పెళ్లికి కళ కళలాడుతుండాలి. ఇదిగో మీ నాన్న కు ఇస్తున్నాననీ" ఫోన్ ఇచ్చింది, నాన్నకు బామ్మ.
"సరే తల్లి జాగ్రత్త తొందరలోనే అందరం హైదరాబాద్ వస్తాం. అపుడు ఆనంద్, అమ్మానాన్న, అక్కబావ ను వచ్చి నిన్ను చూడమని చెప్తాను. సరే ఉంటానమ్మా!"అని ఫోన్ పెట్టేశారు.
ఆదివారం ఎపుడు వస్తుందానీ! వెయిట్ చేస్తున్నా. ఆదివారం ఉదయం ఆనంద్ ఫోన్ చేసాడు. "విరి నాకు వంట్లో బాలేదు. రాత్రి నుండి ఫీవర్ రాలేనక్కడికి. "
"అయ్యో! ఇపుడు ఎలా ఉంది.. "మీ అడ్రస్ చెప్పండని! నోట్ చేసుకుని గబగబా రెడయ్యి ఆనంద్ ఇంటికి వెళ్ళాను
కాలింగ్ బెల్ కొడితే వచ్చి తలుపు తీసాడు. చాలా నీరసంగా కనిపించాడు. నేను లోపలికి రాగానే "విరి వంట గదిలో మంచినీళ్లున్నాయి తాగనీ!" వెళ్లి పడుకున్నాడు.
నే వెళ్లి వంటగదిలో చూస్తే.. ఎక్కడ సామాను అక్కడ చిందరవందరగా ఉంది. చకచకా ఇల్లంతా సర్ది గ్యాస్ గట్టు తుడిచి పాలు కాచి, ఒక గ్లాస్ లో పోసుకుని వెళ్లి ముందు "పైకి లేవండి.. ముందు ఈ నీళ్లతో టాబ్లెట్ వేసుకుని తర్వాత ఈ పాలు తాగండనీ!" చేతికి గ్లాస్ ఇచ్చాను
నేను ఆటో లో వస్తుంటే.. ఈ వీధి చివర హాస్పిటల్ కనపడింది. "ఆనంద్ గారు కొంచం రెడీ అవుతారా ఈ వీధి చివరిలో ఉన్న హాస్పిటల్ కి వెళదామన్నాను. "
"వద్దు ఈ టాబ్లెట్ వేసుకున్నా గా జ్వరం తగ్గుతుంది, ప్లీజ్ పడుకుంటాన్న" ఆనంద్ ని లేపి "ఇంతగా ఒళ్లు కాలి పోతుంటే.. బయటకు వచ్చి ఆటో ని పిలిచి ఆనంద్ ను తెచ్చి ఆటో లో కూర్చో బెట్టి హాస్పిటల్ కి తీసుకెళ్ళి డాక్టర్ కి చూపించాను. ఇపుడు ఈ వైరల్ ఫీవర్స్ అన్ని చోట్ల ఉన్నాయనీ! టాబ్లెట్స్ ఇచ్చి ఒక ఇంజెక్షన్, చేశారు డాక్టర్ గారు.
మళ్ళీ అదే ఆటోలో ఇంటికి తెచ్చి బెడ్రూం లో పడుకోపెట్టాను. తడి టవల్ తడిపి ఆనంద్ నుదిటి పై వేసాను. కాస్త ఫీవర్ తగ్గు ముఖం పట్టింది.
ఆ ఈవెనింగ్ నా రూంకి వెళ్తుంటే "ఉండవచ్చుగా ఇక్కడన్నాడు" ఆనంద్.
"నో నేను, అలా ఉండకూడదు ఇక్కడ. పాలు కాచి గ్లాస్ లో పోసాను. తాగండి ఈ టాబ్లెట్స్ రాత్రికి ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. పొద్దున కాల్ చేస్తాను రేపు ఒక్క రోజు లీవ్ పెట్టండి నీరసంగా ఉన్నారు. సరే బై" చెప్పి కదులుతుంటే ఆనంద్ ఏడుపుమోహం తో "రేపు నువ్వు లీవ్ పెట్టీ ఇక్కడికి రావచ్చుగా!" అన్నాడు. "ఎల్లుండి పబ్లిక్ హాలిడే గా రేపు వెళ్ళాలి ఆఫీసుకనీ!" బయటపడ్డాను.
మరుసటి రోజు ఆనంద్ కాల్ చేసి చెప్పాడు "రాత్రి టాబ్లెట్స్ తో జ్వరం పోయింది. ఈ రోజు లీవ్ పెట్టాన న్నాడు. "
"ఓకే! ఫ్రూట్స్, బ్రెడ్, పాలు తాగి రెస్ట్ తీసుకోండి. టైం అయింది నేను ఆఫీస్ కెళ్ళాలంటూ" ఫోన్ పెట్టేశాను. నెక్స్ట్ డే సెలవు, నిదానంగా లేచి కాఫీ తాగుతుంటే.. ఆనంద్ వచ్చాడు.
"నీరసంగా ఉండీ ఇక్కడకు రాకపోతేమనీ! ఆనంద్ ని కోపడ్డాను. "జ్వరం తగ్గింది నిన్నంతా ఇంట్లో ఉండి బోరింగ్. ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడేదాక ప్రాణమా గలేదన్నాడు" ఆనంద్.
"సరే ఈ పేపర్ చదువుతూ కాఫీ తాగండని" కాఫీ ఇచ్చి స్నానము చేసి వంట మొదలెట్టాను. దొండకాయ కూర, కారప్పొడి, చారు పెట్టను. "రండి మీకు టూ డేస్ నుండి తిండి లేదు. "
బల్ల పై కంచంలో అన్ని వడ్డించి పిలిచాను. "థాంక్స్! విరి ఎన్నో రోజుల తర్వాత కమ్మని భోజనం చేశాను. " సింకు లో చెయ్యి కడిగి నా చీర కొంగుతో చెయ్యి తుడుచుకున్నాడు.
నేను సిగ్గుపడుతూ చీర కొంగు లాక్కుంటే.. "విరి సిగ్గుపడితే నువ్వు చాలా బావుంటావని" దగ్గరగా రాబోతే! "ప్లీజ్ నాకు ఇలాంటివి పెళ్లికి ముందే ఇష్టం ఉండదని" పక్కకు తొలిగాను.
"మీ ఫ్రెండ్ చెప్పింది అక్షరాల నిజం మీరు జూనియర్ కన్నాంబనే" అని ఎగతాళి చేశాడు ఆనంద్. "మీరు ఏవన్నా!.. అనుకోండి నా రూల్స్ కి విరుద్ధం గా నడుచుకోను" అన్నాను.
"ఓకే బుడ్డీ గారు"అన్నాడు ఆనంద్. "నా పేరు, విరిజా!" అన్నాను. బామ్మా! నువ్వు చెప్పటం వల్ల ఆనంద్ ఆటపట్టిస్తున్నాడని గొనుక్కుంటే మీ బామ్మను నీ ముద్దు పేరు చెప్పిందని తిడుతున్నావు కదూ! ఆమెను ఏమి అనకు బుడ్డీ. ఆవిడకు నువ్వంటే ఎంత ప్రేమో.. ! తెలియదు నీకన్నాడు" ఆనంద్.
ఈవెనింగ్ వరకు ఉండి వెళ్ళాడు ఆనంద్. టైం ఎట్లా గడిచిపోయిందో తెలియలేదు, ఆనంద్ తో ఉంటే. పెళ్లి తర్వాత ఎలా వుండాలి ఏమి చేయాలి, ఎలా లైఫ్ లో స్థిర పడాలో వాటి గూర్చి చెప్పాడు. "వచ్చే వారం వాళ్ల అమ్మానాన్న, అక్కాబావ, వస్తారని" చెప్పి వెళ్ళాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments