top of page

అమ్మ చచ్చి పోయింది


'Amma Chachhi Poyindi' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 07/12/2023

'అమ్మ చచ్చి పోయింది' తెలుగు కథ

రచన, కథా పఠనం: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)ఉషమ్మ రోజూలాగానే తన పనులను పూర్తి చేసుకుని ఆశ్రమంలోని అందరినీ ప్రేమగా పలకరించి ఆఫీసులోకి వచ్చి ఎకౌంట్సు చూసుకుని పేపరు చూస్తుండగా "పనిమనిషి కావలెను. మంచి జీతం ఇవ్వబడును" అన్న ప్రకటన, దానిక్రింద బెంగళూరులో ఉన్న వాళ్ల పేర్లు, ఫోన్ నెంబర్లు చూసి మనసు వికలమై అక్కడి నుండి తన గదిలోకి వచ్చి విశ్రమించింది.


ఆవిడ మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్లింది. ఒక ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఉషమ్మ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కూతురు కీర్తనను చాలా ప్రేమగా చూసుకుంటూ కష్టపడి ఇంజినీరింగ్ చదివించింది. కీర్తనకు బెంగుళూరులో ఉద్యోగం వచ్చాక తను ప్రేమించిన ధనుష్ తో పెళ్లి జరిపించింది. ఇద్దరూ ఉద్యోగస్తులైనందుకు వాళ్లకు సాయంగా అక్కడే ఉండేది ఉషమ్మ. రెండేళ్ల తర్వాత ఆదంపతులకు 'శిరి, శశి' అనే కవలలు పుట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంటిపనీ, వంట పనీ, పిల్లలపనీ అన్నీ తనే చేస్తూ చాలా కష్టపడేది ఉషమ్మ.


పగలు, రాత్రి తేడా లేకుండా ఆ పసిపిల్లలకు డైపర్లు మార్చడం, వాళ్లకు స్నానాలు, పాల బాటిల్స్ పట్టడం, కొన్ని నెలలయ్యాక ఫుడ్ పెట్టడం వగైరా పనులన్నీ ఉషమ్మే చేసేది.


రోజుకి ఎన్ని డైపర్లు మారుస్తున్నదీ, వాళ్లు 'పీ, పూ' లు ఎన్నిసార్లు చేస్తున్నదీ ఒక పేపరు మీద వ్రాసి తనకు చూపించాలని కీర్తన ఆర్డరు. పిల్లల ఆరోగ్యం కోసమని అర్ధం చేసుకుని అలాగే చేసేది ఉషమ్మ. ఒకరోజు ఆ లెక్క ఏమన్నా తప్పితే తనేదో తప్పు చేసినట్టుగా కూతురు, అల్లుడు పెద్ద చర్చ చేసి తనను దోషిగా చూసేవాళ్లు. అది ఉషమ్మ మనసుకు చాలా బాధ కలిగినా ఓర్పుతో తమాయించుకునేది.


అలాగే నిత్యం ఉషమ్మ చేసే వంటలలో విమర్శలు. వాళ్లు చెప్పిన తీరులోనే వంట చేస్తున్నా "మీరు ఇంకా వివిధ రకాలుగా ఫాస్ట్ ఫుడ్స్ తయారీ, , కేకుల తయారీ నేర్చుకోవాలి. మీరు ఇంట్లోనే ఉంటారు కదా! పిల్లలు పడుకున్న ఖాళీ సమయంలో గూగుల్ లో చూసి నేర్చుకోవచ్చు కదా!" అని ఈసడింపుగా మాట్లాడేవాడు ధనుష్. కీర్తన కూడా భర్తకు సపోర్టు.


ఎప్పుడన్నా ఆరోగ్యం సహకరించక, ఓపిక లేకపోతే ఏదైనా హాస్పిటల్ లో చూపించమంటే "అనవసరపు ఖర్చు. హాస్పిటల్ కి వెళితే బోలెడు బిల్లు అవుతుంది. బాగానే ఉన్నావుకా! కషాయం పెట్టుకుని త్రాగు". అని ఉచిత సలహా పారేసి ఆఫీసుకు పోతారు కీర్తన, ధనుష్ లు. ఆ స్ధితిలో కూడా మనవరాళ్ల బాధ్యతలు, ఇంటి పనులు చేయక తప్పవు ఉషమ్మకి.


ఆ ఇంటి కోసం, వాళ్ల కోసం క్రొవ్వొత్తిలా కరిగిపోతోంది ఉషమ్మ.


తల్లి కష్టాన్ని ఏమాత్రం గుర్తించకపోగా ప్రతి చిన్నదానికి ఎంతో చులకన చేస్తూ భర్త ముందే ఆవిడని అనేక మాటలు అంటూ పనిమనిషిగా చూసేది కీర్తన. ధనుష్ కూడా అత్తగారనే గౌరవం లేకుండా ఆవిడని లోకువగా చూసేవాడు. కన్నబిడ్డ మీద ప్రేమ కొద్దీ అన్నీ భరిస్తూ ఎంతో ఓర్పుగా ఉండేది ఉషమ్మ.


ఒకనాడు బయటివాళ్లముందు కూడా తల్లిని చాలా అవమానించింది కీర్తన. 'కీర్తన తీరింతే' అని సర్దుకున్నా జరిగినదానికి మనసు వికలం చెంది ఒక సంచీలో తన బట్టలను తీసుకుని, తను ఎప్పటినుంచో దాచుకున్న 200రూ. డబ్బును చేతిలోకి తీసుకొని బయటకు వెళదామని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేయబోయింది ఉషమ్మ.


తల్లి వెళ్ళబోతున్నా "ఎక్కడికి ? ఈ వయసులో బయటికి వెళ్లి ఆవిడ ఎలా ఉంటుందో? ఎలా బ్రతుకుతుందో ?" అనే ఆందోళన లేకపోగా మానవత్వంతో కనీసం ఆవిడని ఆపే ప్రయత్నం చేయలేదు కీర్తన.. ఆవిడ మందే స్నేహితురాలు సుధకి ఫోన్ చేసింది కీర్తన.


సుధ ఫోన్ లిఫ్ట్ చేయగానే " హలో! సుధా! ఎలా ఉన్నావు? రాజస్తాన్ టూర్ నుండి ఎప్పుడు వచ్చావు? నీకు తెలిసిన పనిమనిషి ఎవరన్నా ఉంటే పంపించు. మాకు చాలా అవసరం" అంది కీర్తన.


"బాగానే ఉన్నాం కీర్తనా! అదేంటి? పనిమనిషి కావాలని అడుగుతున్నావు? ఆమధ్య మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారని చెప్పావు. ఆవిడ ఏమయ్యారు?" అడిగింది సుధ.


"ఆవిడ ఈమధ్య చచ్చిపోయింది. పిల్లలతో ఇంట్లో అన్ని పనులు, ఆఫీసు పనులు చేసుకోలేక చాలా అవస్ధ పడుతున్నాను.

పనిమనిషి కావాలి. పంపించు సుధా! " అని ఫోన పెట్టేసింది కీర్తన.


గుమ్మంలోంచి బయటికి అడుగులు వేస్తున్న ఉషమ్మకి ఆ సంభాషణంతా చెవిన సోకి మనసు వికలమైంది.

తనని ఉద్దేశించి "చచ్చిపోయింది" అని కన్నకూతురు తన ముందే అంటున్నప్పుడు తన మనసు విరిగింది. 'ఇన్నేళ్లు తను ఎవరికోసం ఇన్ని కష్టాలు పడింది? తన జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి వాళ్ల కోసం క్రొవ్వొత్తిలా కరిగిపోతోంది?" అర్ధమైంది ఉషమ్మకి.


భారమైన మనసుతో కీర్తన వంక చూసి "కీర్తనా! ఇన్నేళ్ళ నుంచి నీపై ప్రేమతో మూసుకొని పోయిన నాకళ్లను ఇప్పటికైనా తెరిపించావు" అని బయటికి నడిచింది ఉషమ్మ.


ఉషమ్మ బయటికి వచ్చి ఆటోలో బస్టాండ్ కు చేరుకోగానే ఎదురుగా రాజమండ్రి బస్సు బయలుదేరటానికి సిధ్ధంగా ఉంది. ఇంక క్షణం ఆలోచించకుండా ఆ బస్సుకు టిక్కెట్ కొని అందులో కూర్చొంది. మరో రెండు గంటల తర్వాత బస్సు రాజమండ్రి చేరగానే బస్ దిగి బయటకు నడుస్తుండగా కొంత దూరంలో ఒక అనాధాశ్రమం కనిపిస్తే అందులోకి వెళ్లింది ఉషమ్మ.


అక్కడ తృప్తిగా భోజనం చేసి ఆ ప్రాంతాన్ని, అక్కడి వాళ్లను పరిశీలనగా చూసింది. తన లాంటి వారెందరో ఇక్కడ ఉన్నారు. ఇంక తాను ఇక్కడే ఉండి ఈ ఆశ్రమంలో ఏదైనా పనిపాటలు చేద్దామని నిర్ణయించుకుని అక్కడే ఆ ఆశ్రమ యజమాని రామయ్య గారిని కలిసి తన గురించి సవిస్తరంగా చెప్పి, "మీ అనుమతి తో నేనిక్కడే ఉండి ఏదైనా పనిచేసి బ్రతుకుతాను. దయ చూపండి" అంది ఉషమ్మ.

వృధ్ధుడైన రామయ్యగారు ఉషమ్మకి ఆ ఆశ్రమంలో లెక్కలు వ్రాసే పనిని ఒప్పగించారు. ఉషమ్మ అందరితో అనుకూలంగా, ప్రేమగా ఉంటూ నమ్మకంగా పనిచేస్తోంది. కొన్నినెలలయ్యాక రామయ్య గారు సంతోషంగా ఆశ్రమ బాధ్యతలను ఉషమ్మకి ఒప్పగించారు.


కాలం సాగిపోతోంది. ఒక రోజున నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు రామయ్య గారు. జరిగిన దారుణానికి ఉషమ్మ, ఆశ్రమ వాసులందరూ కన్నీరుమున్నీరుగా విలపించి ఆయన కార్యక్రమాలను యధావిధిగా జరిపించారు.


ఉషమ్మ ఆశ్రమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అక్కడి వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రఉషంగా, మనశ్ఉషిగా జీవిస్తోంది

.

ఏదో చప్పుడైతే తృళ్లిపడి క్రమేణా నిద్రలోకి జారుకుంది ఉషమ్మ.


.. సమాప్తం.

***

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
76 views0 comments

Комментарии


bottom of page