అమ్మ… పనిమనిషి కాదు
- Manasa Reddy Chichili

- 4 days ago
- 3 min read

Amma Panimanishi Kadu - Telugu Emotional Family Story | Manasa Reddy Chichili
అమ్మ… పనిమనిషి కాదు - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ| మానస రెడ్డి చిచిలీ
Published in manatelugukathalu.com on 09/05/2026
పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాన్నే త్యాగం చేసే తల్లిదండ్రులు… వృద్ధాప్యంలో ప్రేమ, ఆప్యాయత మాత్రమే ఆశిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ప్రేమను బాధగా మార్చేది కాలమా? లేక మనుషుల మారిన మనసులా? “అమ్మ… పనిమనిషి కాదు” ఒక తల్లి మౌన వ్యథను హృదయాన్ని కదిలించేలా ఆవిష్కరించిన కథ.
అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు జానకి రామయ్య. చిన్న గ్రామంలో ఉండి, జీవితమంతా కుటుంబం కోసం కష్టపడిన సాధారణ జంట.
తన కొడుకు రాహుల్ కోసం ఎన్నో కలలు కని, అతన్ని చదివించారు. పెద్ద ఉద్యోగం వచ్చింది. “నా కొడుకు బాగుంటే చాలు” అనే ఆలోచనతో వారి కోరికలన్నీ త్యాగం చేశారు.
కాలం గడిచింది… రాహుల్ అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాడు. కోడలు స్నేహ కూడా ఉద్యోగం చేస్తోంది. ఒక రోజు రాహుల్, “అమ్మా, మీరు, నాన్న కలిసి అమెరికా రండి. మాతో ఉండండి” అని చెప్పాడు. ఆ మాట విని లక్ష్మి గుండె ఆనందంతో నిండిపోయింది.
లక్ష్మి ఆనందంతో, “నిజంగా! అవునా రా? మీతో ఉండమంటావా?”
“మన కొడుకు దగ్గర ఉంటే… మన వయస్సులో ఇంకేమి కావాలి?” అనుకుంది.
అలా లక్ష్మి, తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్లింది.
లక్ష్మి: “ఇది మన రాహుల్ ఇల్లు కదా… ఎంత పెద్దగా ఉంది?!”
భర్త: “అవును… మన కష్టం ఫలించింది లక్ష్మి…”
మొదట్లో అన్నీ బాగానే అనిపించాయి. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి మారింది.
ఉదయం లేవగానే లక్ష్మి వంటింట్లోకి వెళ్లేది. కోడలు, కొడుకు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్లిపోతారు. ఇంటి పనులన్నీ ఆమె మీదే. వంట, ఇంటి శుభ్రం, బట్టలు అన్నీ ఆమె బాధ్యత అయ్యాయి.
మొదట్లో “పిల్లలకు సహాయం చేస్తున్నాను” అని భావించింది. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమెకు అర్థమైంది…
ఆమెను అమ్మగా కాదు… పనిమనిషిలా చూస్తున్నారని.
రాహుల్ మాటల్లో ప్రేమ తగ్గింది.
“అమ్మా, ఇది చేయీ… అది
చేయీ…” అన్న ఆదేశాలే ఎక్కువయ్యాయి.
ఒక రోజు లక్ష్మి తన కోడలితో మెల్లిగా అడిగింది:
“బంగారం… మీరు ఇద్దరూ బిజీగా ఉంటారు… కానీ మన ఇంట్లో పిల్లల నవ్వులు వినిపిస్తే ఎంత బాగుంటుంది కదా?”అని.
ఆమెకు ఒక చిన్న కోరిక మాత్రమే: మనవడు లేదా మనవరాలు చేతుల్లోకి తీసుకోవడం.
కానీ స్నేహ చల్లగా నవ్వుతూ చెప్పింది.
“ఇంకా టైం ఉంది అత్తమ్మ… మేము ఇంకా రెడీ కాదు.”
ఆ మాట విని లక్ష్మి హృదయం కొంచెం విరిగింది… కానీ బయటకు చూపలేదు.
ఒక రాత్రి…
అందరూ నిద్రపోయిన తర్వాత, లక్ష్మి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది.
మంచుతో కప్పబడిన ఆ నగరం మధ్యలో ఆమెకు తనకు తాను గుర్తొచ్చింది…
పొలాల్లో పరిగెత్తిన తన కొడుకు…
తన చేతులతో తినిపించిన రోజులూ…
తన కోసం చేసిన త్యాగాలన్నీ…
కన్నీళ్లు మెల్లగా జారాయి.
ఆమె భర్త లక్ష్మి దగ్గరకు వచ్చి నెమ్మదిగా అడిగాడు,
“ఏమైంది లక్ష్మి?”
ఆమె ముసిముసిగా నవ్వుతూ చెప్పింది.
“ఏమీ లేదు… మన కొడుకు బాగున్నాడు కదా… అంతే చాలు…”
కానీ ఆ నవ్వులో ఎంతో బాధ దాగి ఉంది.
మరుసటి రోజు కూడా ఆమె అదే పనులు చేసింది… అదే ప్రేమతో వంట చేసింది… అదే మమకారంతో వాళ్లను చూసుకుంది…
ఎందుకంటే ఆమె అమ్మ…
అమ్మ ప్రేమకు ప్రతిఫలం అవసరం లేదు…
గౌరవం లేకపోయినా, బాధ ఉన్నా…
ఆమె హృదయం మాత్రం ఎప్పటికీ ఇవ్వడానికే అలవాటు పడింది.
ఆమె మనసులో ఒక చిన్న ఆశ మాత్రం ఇంకా ఉంది…
“ఒక రోజు… నా కొడుకు నన్ను గుర్తిస్తాడు.
ఒక రోజు… ఈ ఇంట్లో పిల్లల నవ్వులు వినిపిస్తాయి…”అని.
భర్త: “మన ఇంటికి తిరిగి వెళ్లిపోదామా?” లక్ష్మి?
కొద్దిసేపు నిశ్శబ్దం…
లక్ష్మి…
“లేదండి…
మన కొడుకు దగ్గర ఉండటం ఒక వరం…
అతనికి అవసరం ఉన్నంతవరకు… నేను ఉంటాను…”
మరుసటి రోజు…
రాహుల్: “అమ్మా, బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయ్యిందా?”
లక్ష్మి చిరునవ్వుతో, “అవును రా… నీకు ఇష్టమైనది చేశాను…”
ఆమె గుండె విరిగినా…
ఆమె ప్రేమ మాత్రం మారలేదు.
ప్రేమ ఇచ్చే వారు ఎప్పుడూ గెలుస్తారు అంటారు…
కానీ…
కొన్నిసార్లు ఆ ప్రేమే వాళ్లను మౌనంగా ఓడిస్తుంది…
అదే ఆశతో…
అదే త్యాగంతో…
ఆమె జీవితం ముందుకు సాగింది…
సమాప్తం
మానస రెడ్డి చిచిలీ గారి కొన్ని ఇతర రచనలు:
మానస రెడ్డి చిచిలీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://manatelugukathalu.com/profile/manasa/profile
మానస రెడ్డి చిచిలీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన కవయిత్రి. ఆమె రచించిన హైకూ మరియు టాంకా కవితలు Under the Basho, Mainichi Haiku వంటి అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆమె హైకూ 2025 సంవత్సరానికి సంబంధించిన Touchstone Award కు నామినేట్ చేయబడింది. అంతేకాకుండా, ఆమె నేరుగా జపనీస్ భాషలో కూడా హైకూ రచనలు చేసారు.
telugu moral story, kids story telugu, inspirational story telugu, success failure lesson, children story telugu, Manasa Reddy Chichil, మానస రెడ్డి చిచిలీ |







Comments